MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Varanasi Leak: సింహాంలా కదిలిన మహేష్‌ బాబు.. పూనకాలు తెప్పిస్తోన్న `వారణాసి` లీక్ వీడియో

Varanasi Leak: సింహాంలా కదిలిన మహేష్‌ బాబు.. పూనకాలు తెప్పిస్తోన్న `వారణాసి` లీక్ వీడియో

Varanasi Leak: మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌తో రూపొందుతున్న `వారణాసి` సినిమా నుంచి మరో వీడియో లీక్‌ అయ్యింది. ఇందులో మహేష్‌ బాబుని చూస్తే పూనకాలు రావాల్సిందే. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 06 2026, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న వారణాసి మూవీ
Image Credit : Sri Durga Arts

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న వారణాసి మూవీ

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో `వారణాసి` మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇండియన్‌ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాల్లో ఇదొకటి. దీన్ని గ్లోబల్‌ ఫిల్మ్ గా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ వంటి వారు నటిస్తున్నారు. ఈచిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ప్రపంచ సాహసికుడి కథ ప్రధానంగా సినిమా సాగుతుందని, అదే సమయంలో టైమ్‌ ట్రావెల్‌ అంశాలుంటాయని తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రామాయణం ఎపిసోడ్‌ హైలైట్‌గా వారణాసి
Image Credit : youtube/varanasi movie

రామాయణం ఎపిసోడ్‌ హైలైట్‌గా వారణాసి

అందులో భాగంగానే రామాయణం ఎపిసోడ్‌ని చూపించబోతున్నారు. హనుమంతుడు లంక దహనం ఎపిసోడ్‌ హైలైట్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో రుద్ర అనే పాత్రలో మహేష్ బాబు కనిపించబోతున్నారు. ఆయన ఏడు కాలాల్లోకి వెళ్లొస్తాడనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇవన్నీ సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే సినిమా చిత్రీకరణ విషయంలో రాజమౌళి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. సెల్‌ ఫోన్లకు అనుమతి ఉండదు. అయినా కొన్నిసార్లు లీక్‌ అవుతుంటాయి. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ ప్రారంభంలోనే ఓ సీన్‌ లీక్‌ అయ్యింది. అది సినిమాకి మైనస్‌ కంటే ప్లస్సే అయ్యింది.

Related Articles

Related image1
Korean Kanakaraju Review: కొరియన్‌ కనకరాజు మూవీ ఫస్ట్ రివ్యూ.. వరుణ్‌ తేజ్‌కి ఈ సారి హిట్‌ పక్కా?
Related image2
Lenin total Collections: `లెనిన్‌` ఫైనల్‌ కలెక్షన్లు, నిజంగా షాకింగ్‌.. అఖిల్‌ సినిమా హిట్టా? ఫట్టా?
34
వారణాసి సెట్‌లో మహేష్‌ లుక్‌ లీక్‌
Image Credit : Asianet News

వారణాసి సెట్‌లో మహేష్‌ లుక్‌ లీక్‌

మధ్యలో మరో సీన్‌ లీక్‌ అయ్యింది. చిత్ర బృందంలోని ఎవరో ఒకరు చాటుగా వీడియో తీశారు. అప్పట్లో రాజమౌళి టీమ్‌ అలర్ట్ అయి నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ లీక్‌ ల బెడద తప్పలేదు. తాజాగా మరో వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో మహేష్‌ బాబు డీ గ్లామర్‌ లుక్‌లో, యాక్షన్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన నడక ఒక సింహలా ఉంది. యాక్షన్‌కి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టుగా ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. మహేష్‌ పై రక్తం మరకలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఆయన ఒక గుడిలోని నీటి కొలనుకోకి దిగే సీన్‌ ఉంది. ఆ పక్కనే శివలింగాలున్నాయి. నీటిలోకి దిగిన మహేష్‌ లుక్‌ సైతం గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. సినిమాకిది మైనస్‌ కావడం కంటే ప్లస్‌ అయ్యిందనే చెప్పాలి. ఇది నేషనల్‌ వైడ్‌గా ట్రెండ్‌ అవుతుంది.

44
ఏప్రిల్‌ 7న వారణాసి రిలీజ్‌
Image Credit : youtube/varanasi movie

ఏప్రిల్‌ 7న వారణాసి రిలీజ్‌

మొత్తంగా రాజమౌళి చాలా గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నారని, రాజీపడటం లేదని అర్థమవుతుంది. అదే సమయంలో మహేష్‌ బాబు కూడా డూప్‌ లేకుండా స్వయంగా యాక్షన్‌ సీన్లలో పాల్గొంటున్నట్టు ఈ లీక్‌ అయిన సీన్లు చూస్తుంటే అర్థమవుతుంది. ఈ ఏడాది చివరి వరకు చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్‌లో ఏప్రిల్‌ 7న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
మహేష్ బాబు ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
ఎస్.ఎస్. రాజమౌళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Related Stories
Recommended image1
Korean Kanakaraju Review: కొరియన్‌ కనకరాజు మూవీ ఫస్ట్ రివ్యూ.. వరుణ్‌ తేజ్‌కి ఈ సారి హిట్‌ పక్కా?
Recommended image2
Lenin total Collections: `లెనిన్‌` ఫైనల్‌ కలెక్షన్లు, నిజంగా షాకింగ్‌.. అఖిల్‌ సినిమా హిట్టా? ఫట్టా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved