MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జోవికా పుట్టినప్పుడు ఒంటరిగా నరకం చూశా, కూతురు బర్త్ కష్టాలు పంచుకుంటూ వనతా విజయ్‌ కుమార్‌ ఎమోషనల్‌

జోవికా పుట్టినప్పుడు ఒంటరిగా నరకం చూశా, కూతురు బర్త్ కష్టాలు పంచుకుంటూ వనతా విజయ్‌ కుమార్‌ ఎమోషనల్‌

అత్యంత సంచలన, వివాదాస్పద నటి వనితా విజయ్‌ కుమార్‌ తన కూతురు జోవికా పుట్టిన సమయంలో తాను ఎదుర్కొన్న కష్టాలను బయట పెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 26 2025, 10:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
`మిస్సెస్ అండ్ మిస్టర్` ఆడియో లాంచ్ లో వనిత విజయ్‌ కుమార్‌ కామెంట్స్
Image Credit : our own

`మిస్సెస్ అండ్ మిస్టర్` ఆడియో లాంచ్ లో వనిత విజయ్‌ కుమార్‌ కామెంట్స్

వరుస పెళ్లిళ్లు, వివాదాస్పద కామెంట్లతో సంచలనంగా మారింది వనితా విజయ్‌ కుమార్‌. ఆ తర్వాత `బిగ్ బాస్` ద్వారా బాగా ఫేమస్‌ అయ్యింది. ఆమెకు జోవికా అనే కూతురు కూడా ఉన్నారు. ఆమె కూడా బిగ్ బాస్ 7వ(తమిళం) సీజన్‌లో పాల్గొని ఫేమస్ అయ్యారు. ఈ నేపథ్యంలో జోవికా విజయ్‌ కుమార్ బిగ్ బాస్ ద్వారా సంపాదించిన డబ్బుతో `మిస్సెస్ అండ్ మిస్టర్` అనే సినిమాను నిర్మించారు.  జోవికా తల్లి వనిత దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వనితకు జంటగా రాబర్ట్ నటించారు.

25
మిస్సెస్ అండ్ మిస్టర్ ఆడియో లాంచ్
Image Credit : Instagram

మిస్సెస్ అండ్ మిస్టర్ ఆడియో లాంచ్

`మిస్సెస్ అండ్ మిస్టర్` చిత్రం జూన్ నెలలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుక ఆదివారం చెన్నైలో జరిగింది. ఇందులో వనితా విజయ్‌ కుమార్, రాబర్ట్, జోవికాతో పాటు సినిమాలో నటించిన షకీలా, పవర్ స్టార్ శ్రీనివాస్, నటి కిరణ్ కూడా పాల్గొన్నారు. దర్శకుడు వసంత బాలన్  ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ ఆడియో లాంచ్‌లో వనితా మాట్లాడుతూ కూతురు జోవికా పుట్టినప్పుడు తాను ఎదుర్కొన్న కష్టాలను పంచుకున్నారు.

Related Articles

Related image1
ఐశ్వర్యారాయ్ రిజెక్ట్ చేసిన 8 బ్లాక్ బస్టర్ సినిమాలు.. చేసి ఉంటే ఆమె రేంజ్‌ వేరే లెవల్‌
Related image2
`యానిమల్‌` హీరోయిన్‌ త్రిప్తి డిమ్రీ కొత్త మూవీస్‌.. `స్పిరిట్‌`, `యానిమల్‌ పార్క్` టోటల్‌ లిస్ట్
35
విమర్శలకు వనిత కౌంటర్
Image Credit : Google

విమర్శలకు వనిత కౌంటర్

జోవికా బిగ్ బాస్‌ షోలో పాల్గొన్నప్పుడు ఆమెను విమర్శిస్తూ అనేక  కామెంట్లు వచ్చాయి. ఆమె పేరు వెనుక తండ్రి పేరు లేకపోవడంతో ఆమె తండ్రి ఎవరనే చర్చ కూడా ఆ సమయంలో జరిగింది. అప్పుడు దీని గురించి స్పందించని వనిత, `మిస్సెస్ అండ్ మిస్టర్` ఆడియో ఈవెంట్‌లో తన కూతురిపై వచ్చిన ట్రోల్స్ కి కౌంటర్ ఇచ్చారు.

`సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ అన్నీ చదువుతాను. కానీ పట్టించుకోను. జోవికా బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు ఆమె పేరు వెనుక ఎందుకు విజయ్‌ కుమార్ అని అడిగారు. దానికి ఈ వేదికపై సమాధానం చెబుతున్నాను. ఈ సినిమా రూపొందడానికి కారణం కూడా అదే. నా పేరు వనితా విజయ్‌ కుమార్, నేటికీ నా పేరు మార్చలేదు. నాకు పెళ్లయి కొడుకు పుట్టి మూడేళ్లయ్యాక, నా జీవితంలో చాలా సమస్యలు వచ్చాయి.

45
వనిత ఆవేదన
Image Credit : our own

వనిత ఆవేదన

ఆ టైమ్‌లో నేను ఇండస్ట్రీలో ఉండలేకపోయాను. నేను ఎక్కడికి వెళ్లినా సమస్యే. నా గురించి మాట్లాడి నా పిల్లలకు తండ్రి సమస్య సృష్టించారు. ఆయన ఎవరో చెప్పను. జోవికా నా గర్భంలో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉండలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు నా అమ్మ నన్ను అమెరికా వెళ్ళమన్నారు. నేను హాయిగా బిడ్డను కనాలని మా నాన్నే నన్ను అమెరికా పంపించారు.

55
ఆ టైమ్‌లో నాన్న పేరే గుర్తొచ్చింది
Image Credit : Twitter

ఆ టైమ్‌లో నాన్న పేరే గుర్తొచ్చింది

ఒక అమ్మాయి గర్భవతిగా ఉన్నప్పుడు అమ్మతో ఉండటం కంటే భర్తతో ఉండాలి. కానీ నేను ఒంటరిగా కష్టపడ్డాను. అమెరికాలో బిడ్డ పుట్టగానే వారి పేరు చెప్పాలి. అప్పుడు నా భర్త పేరును నా కూతురి పేరుతో కలపాలని నేను అనుకోలేదు. నేను బిడ్డను బాగా కనాలని కోరుకున్న మా నాన్న పేరే అప్పుడు గుర్తుకు వచ్చింది. అందుకే జోవికా విజయ్‌ కుమార్ అని పేరు పెట్టానని వనిత చెప్పారు. ఈసందర్భంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
20 ఏళ్ళ గ్యాప్ తరువాత టాలీవుడ్ లో రచ్చ చేస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
దుబాయ్‌లో చిక్కుకున్న వాళ్లకు సోనూ సూద్ సహాయం.. ఫ్రీగా ఉండొచ్చు.. ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే?
Recommended image3
Rashmika-Vijay : ఎర్రటి మైసూర్ సిల్క్ చీర, నెమలి నెక్లెస్‌తో రష్మిక రచ్చ, విజయ్ ఎలా ఉన్నాడంటే?
Related Stories
Recommended image1
ఐశ్వర్యారాయ్ రిజెక్ట్ చేసిన 8 బ్లాక్ బస్టర్ సినిమాలు.. చేసి ఉంటే ఆమె రేంజ్‌ వేరే లెవల్‌
Recommended image2
`యానిమల్‌` హీరోయిన్‌ త్రిప్తి డిమ్రీ కొత్త మూవీస్‌.. `స్పిరిట్‌`, `యానిమల్‌ పార్క్` టోటల్‌ లిస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved