MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఐశ్వర్యారాయ్ రిజెక్ట్ చేసిన 8 బ్లాక్ బస్టర్ సినిమాలు.. చేసి ఉంటే ఆమె రేంజ్‌ వేరే లెవల్‌

ఐశ్వర్యారాయ్ రిజెక్ట్ చేసిన 8 బ్లాక్ బస్టర్ సినిమాలు.. చేసి ఉంటే ఆమె రేంజ్‌ వేరే లెవల్‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ ఐశ్వర్యా రాయ్ తన కెరీర్‌లో చాలా సినిమాలను రిజెక్ట్ చేసింది. వాటిలో బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచిన మూవీస్‌ ఎక్కువగా ఉండటం విశేషం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 26 2025, 07:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
1. కుచ్ కుచ్ హోతా హై (1998)
Image Credit : our own

1. కుచ్ కుచ్ హోతా హై (1998)

ఈ సినిమాలో టీనా మల్హోత్రా పాత్రలో నటించడానికి ఐశ్వర్యా రాయ్ కి అవకాశం ఇచ్చారు కరణ్ జోహార్. కానీ, తన ఇమేజ్ గురించి ఆలోచించి ఆమె ఈ అవకాశాన్ని వదులుకున్నారు. షారుఖ్ కి జంటగా రాణీ ముఖర్జీ నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
2. కహో నా ప్యార్ హై (2000)
Image Credit : instagram

2. కహో నా ప్యార్ హై (2000)

హృతిక్‌ రోషన్ నటించిన తొలి సినిమాని కూడా ఐశ్వర్య వద్దనుకున్నారట. ఆమె స్థానంలో అమీషా పటేల్ నటించి అదరగొట్టారు. ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. ఆ తర్వాత హృతిక్‌ రోషన్ తో కలిసి ఐశ్వర్యారాయ్ ‘ధూమ్ 2’, ‘జోధా అక్బర్’ లాంటి సినిమాల్లో నటించారు.

Related Articles

Related image1
దాసరి నారాయణరావు వందల కోట్ల ఆస్తులు దోచుకున్నది వాళ్లే.. గురువుగారు గురువుగారు అంటూ కాజేశారు
Related image2
ఫ్యామిలీ మెంబర్సే పతనాన్ని కోరుకుంటున్నారు.. అయినా మనోజ్‌ `భైరవం` సినిమా ఆడాలని కోరుకున్న మంచు విష్ణు
38
3. గదర్: ఏక్ ప్రేమ్ కథా (2001)
Image Credit : Social Media

3. గదర్: ఏక్ ప్రేమ్ కథా (2001)

అనిల్ శర్మ దర్శకత్వంలో, సన్నీ డియోల్ హీరోగా నటించిన `గదర్: ఏక్ ప్రేమ్ కథా` లో హీరోయిన్‌గా మొదట ఐశ్వర్యారాయ్ ని నటింపచేయాలని అనుకున్నారు. కానీ ఆమె రిజెక్ట్ చేశారు. ఆ అవకాశం అమీషా పటేల్ కి దక్కింది. ఇది ఆమె లైఫ్‌నే మార్చేసింది. 

48
4. మున్నా భాయ్ MBBS (2003)
Image Credit : Social Media

4. మున్నా భాయ్ MBBS (2003)

సంజయ్ దత్, రాజ్‌ కుమార్‌ హిరానీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్‌ మూవీలో హీరోయిన్‌ పాత్ర కోసం మొదట ఐష్‌ని అప్రోచ్ అయ్యారు.  కానీ ఐశ్వర్య ఈ అవకాశాన్ని వదులుకోవడంతో, అది గ్రేసీ సింగ్ కి వెళ్ళింది. ఈ మూవీ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో తెలిసిందే. 

58
5. వీర్-జారా (2004)
Image Credit : Social Media

5. వీర్-జారా (2004)

ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం దర్శకుడు యష్ చోప్రా ముందుగా ఐశ్వర్యను సంప్రదించారు. ఈ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉందని చెప్పి  ఐశ్వర్య రిజెక్ట్ చేశారు.  షారూఖ్‌ ఖాన్‌ హీరోగా వచ్చిన ఈ మూవీలో ఆయనకు జోడీగా ప్రీతి జింటా నటించారు. ఇది కూడా మంచి ఆదరణ పొందింది. 

68
6. భూల్ భులయ్యా (2007)
Image Credit : Social Media

6. భూల్ భులయ్యా (2007)

ఈ మూవీలో కూడా దర్శకుడు ప్రియదర్శన్ మొదటి ఛాయిస్ ఐశ్వర్యనే  అని సమాచారం. కానీ ఎందుకో ఆమె ఈ సినిమా చేయలేదు. దీంతో ఐశ్వర్య స్థానంలో విద్యా బాలన్ ని తీసుకున్నారు. 

78
7. దోస్తానా (2008)
Image Credit : Social Media

7. దోస్తానా (2008)

జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ నటించిన ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం మొదట ఐశ్వర్యనే కలిశారు దర్శకుడు. కానీ ఆమె నో చెప్పడంతో చేసేదేం లేక  ప్రియాంక చోప్రాకు ఆఫర్‌ చేశారు. ఆమె చేసింది, బ్లాక్ బస్టర్‌ అందుకుంది. 

88
8. బాజీరావ్ మస్తానీ (2015)
Image Credit : Social Media

8. బాజీరావ్ మస్తానీ (2015)

ఈ సినిమాని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ  మొదట ఐశ్వర్య, సల్మాన్ లతో చేయాలనుకున్నారు. కానీ ఇద్దరు నో చెప్పారు. దీంతో  దీపికా పదుకొనే,  రణ్ వీర్ సింగ్ లతో తీశారు భన్సాలీ. ఇది కూడా పెద్ద హిట్‌ అయ్యింది. ఇలా దాదాపు ఎనిమిది హిట్‌ మూవీస్‌లో భాగమయ్యే అవకాశాన్ని ఐష్‌ కోల్పోవడం గమనార్హం. ఈ సినిమాలు పడితే ఐశ్వర్య రేంజ్‌ వేరేలా ఉండేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pavan Sadineni: ప్రేమ పేరుతో మోసం.. టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని అరెస్టు..
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫైనల్‌ సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరే.. గ్లామర్‌, కామెడీకి కొదవ లేదు
Recommended image3
Toxic: టాక్సిక్ మూవీ ఎఫెక్ట్, గీతూ మోహన్ దాస్ పై ట్రోలింగ్.. దిల్ రాజు మనసులో అనుకున్న మాటలే నిజమయ్యాయా ?
Related Stories
Recommended image1
దాసరి నారాయణరావు వందల కోట్ల ఆస్తులు దోచుకున్నది వాళ్లే.. గురువుగారు గురువుగారు అంటూ కాజేశారు
Recommended image2
ఫ్యామిలీ మెంబర్సే పతనాన్ని కోరుకుంటున్నారు.. అయినా మనోజ్‌ `భైరవం` సినిమా ఆడాలని కోరుకున్న మంచు విష్ణు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved