- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode: విశ్వను కాపాడి కుటుంబానికి షాకిచ్చిన అమూల్య, పగబట్టిన పాములా వల్లి
Illu Illalu Pillalu Today Episode: విశ్వను కాపాడి కుటుంబానికి షాకిచ్చిన అమూల్య, పగబట్టిన పాములా వల్లి
Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో అమూల్య.. రామరాజు కుటుంబానికి పెద్ద షాకే ఇస్తుంది. విశ్వకు శిక్ష పడకుండా అడ్డుకుంటుంది. ఇక వల్లి పగబట్టిన పాములా మారిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోండి.

కోర్టులో అమూల్య.. విశ్వకు శిక్ష
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్ మొదలవగానే వర్షంలో తడుస్తున్న ప్రేమ, నర్మదలకు గొడుగు పట్టుకుని వెళుతుంది వేదవతి. వాళ్ళిద్దరికీ గొడుగు పట్టడం చూసి వర్షంలో తడుస్తున్న వల్లి కోపంతో రగిలిపోతుంది. ప్రేమ, నర్మద, వేదవతి నవ్వుకుంటూ ఆనందంగా ఉండడం చూసి వల్లి భరించలేదు. ఇక ఇక్కడి నుంచి సీన్ అమూల్య దగ్గరికి మారుతుంది రామరాజు వేదవతి ధీరజ్ అమూల్య కలిసి కోర్టు దగ్గరికి వస్తారు. అలాగే విశ్వక్ అతని కుటుంబం కూడా కోర్టు దగ్గరికి వస్తారు. కోర్టులో లాయర్లు ఇద్దరు వాదించుకుంటారు. చివరికి విశ్వను నేరస్తుడిగా కోర్టు నిర్ధారిస్తుంది. అతనికి ఏడేళ్ల జైలు శిక్ష వేయబోతుంది.
విశ్వను కాపాడిన అమూల్య
అదే సమయంలో అమూల్య జడ్జిని ఒక్క నిమిషం ఆగమని అడుగుతుంది. విశ్వకు శిక్ష వేయొద్దని అడుగుతుంది. అతడు చేసినవన్నీ తప్పులే అయినా అతనికి పడే శిక్ష వల్ల అతని కుటుంబం కూడా బాధపడుతుందని చెబుతుంది. ఇప్పటికే నా కుటుంబం, అతడి కుటుంబం మధ్య గొడవలు అధికంగా ఉన్నాయి. దీనివల్ల ఇంకా ఆ గొడవలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి కేసును కొట్టివేయమని అడుగుతుంది అమూల్య. దీంతో రామరాజు, వేదవతి, ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. వాళ్లతో పాటు విశ్వక్, సేనాపతి, భద్రావతి కూడా ఆనందంతో పొంగిపోతారు. అమూల్య తమ కుటుంబానికి భయపడే అలా చేసిందని భావిస్తాడు సేనాపతి. ధీరజ్ ఎంత చెబుతున్నా వినకుండా అమూల్య కేసును కొట్టి వేయమని అడుగుతుంది. దీంతో జడ్జి కేసును కొట్టివేస్తాడు. రామరాజు, వేదవతి, ధీరజ్ కోపం బాధతో అక్కడే కూర్చుండి పోతారు.
వల్లి పగబట్టేసిందిగా
ఇక ఇక్కడి నుంచి సీన వల్లి దగ్గరికి మారుతుంది. వల్లి తన తల్లిని కలవడానికి భాగ్యం ఇంటికి వస్తుంది. భాగ్యం.. వల్లిని బాగా తిడుతుంది. నేను చెప్పిన పనులను చేయకుండా తింగరితనంగా ప్రవర్తించడం వల్ల నీ కాపురం కూలిపోయిందని అంటుంది. ఆ నర్మదని ఇంట్లోంచి బయటికి పంపేయమని చెప్పినా కూడా ఇంట్లోనే ఉండేలా చేసావని.. దానివల్లే నీ కాపురం ఇలా అయిందంటూ తిడుతుంది. ఇకపైన నీ జీవితం అంతా ఏడుపులే అంటూ వల్లిని రెచ్చగొడుతుంది. దాంతో వల్లి మళ్ళీ పగబట్టిన పాముల మారిపోతుంది. ఇక పైన ఆ ప్రేమ, నర్మదలను ఏడిపిస్తానని తాను ఏడవనని చెబుతుంది. నాకు లేని సంతోషం ప్రేమ, నర్మదలకు కూడా ఉండకుండా చేస్తానంటూ తల్లికి చెబుతుంది. ఇకపైన వల్లి ఎన్ని నాటకాలు ఆడుతుందో చూడాలి. ఇక్కడతో ఎపిసోడ్ ముగిసిపోతుంది.

