MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Illu Illalu Pillalu Today Episode: చంపేస్తానని వల్లికి వార్నింగ్ ఇచ్చిన చందు.. మళ్లీ పగబట్టిన వల్లి?

Illu Illalu Pillalu Today Episode: చంపేస్తానని వల్లికి వార్నింగ్ ఇచ్చిన చందు.. మళ్లీ పగబట్టిన వల్లి?

Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో నర్మదను వేదవతి క్షమించమని అడుగుతుంది. ఇక వల్లిని చందు చాలా అసహ్యించుకుంటాడు. అలాగే వేదవతి కూడా వల్లికి చుక్కలు చూపిస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. 

3 Min read
Author : Haritha Chappa
Published : Jul 09 2026, 09:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వల్లికి వార్నింగ్ ఇచ్చిన చందు
Image Credit : Jio hotstar

వల్లికి వార్నింగ్ ఇచ్చిన చందు

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో నర్మదను వల్లి విషయంలో అపార్థం చేసుకుని కొట్టినందుకు సారీ చెప్పేందుకు వస్తుంది వేదవతి. కాసేపు నర్మద.. వేదవతి చెప్పింది వినిపించుకోకుండా మొండికేస్తుంది. తర్వాత ఇద్దరూ కలిసిపోతారు. ఇక చందు గదిలోకి వెళ్లి చాప దిండు పట్టుకొని బయటకు వస్తూ ఉంటాడు. వల్లి ఆపి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది. నేను ఇకపైన బయటే పడుకుంటాను అని చెబుతాడు. నువ్వు నన్ను దూరం పెట్టి పూర్తిగా చంపెయ్యకు బావా అంటుంది వల్లి. మా అమ్మ వాళ్ళ మాటలు విని ఏదో బుద్ధి తక్కువ తెలియక చేశాను అంటుంది వల్లి. 

దానికి చందు ‘తెలియక కాదు.. తెలిసే చేసావు. మీ అందరూ ఒక ప్లాన్ ప్రకారమే మమ్మల్ని అందరినీ మోసం చేశారు’ అంటాడు. అయితే వల్లి మాట్లాడుతూ ఒట్టేసి చెబుతున్నాను బావ ఇకపై అలా చేయను అంటుంది. దాంతో చందు కి విపరీతంగా కోపం వచ్చి ‘చంపేస్తాను.. దొంగఒట్లు పెట్టావంటే ఇకపై చంపేస్తాను’ అని వార్నింగ్ ఇస్తాడు. ప్రెగ్నెంట్ అని చెప్పి అబద్ధం ఆడడమే పెద్ద తప్పు.. ఇక ఆ కడుపు పోవడానికి నర్మద కారణమని నింద వేసి ఇంకా పెద్ద అబద్ధం చెప్పావు.. సిగ్గు అనిపించడం లేదా అంటూ తిడతాడు. వల్లి నా కాపురం నిలబెట్టుకోవడం కోసం అలా చేశాను అంటుంది. ఎంతగా బతిమిలాడినా చందు ఆమెను స్వీకరించేందుకు ఒప్పుకోడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బాధపడిన ప్రేమ
Image Credit : jio hotstar

బాధపడిన ప్రేమ

ఇక్కడ నుంచి సీన్ ధీరజ్ ప్రేమ దగ్గరికి మారుతుంది. ధీరజ్ నిద్రపోతూ ఉంటాడు. ప్రేమ మాత్రం నిద్రపోకుండా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ధీరజ్ లేచి ఏమైందని ప్రేమను అడుగుతాడు. ‘రేపు అమూల్య కేసు హియరింగ్ కదా.. అటువైపు ఏమో పుట్టిల్లు ఇటువైపు ఏమో అత్తిల్లు’ అని చెప్పి బాధపడుతుంది. ధీరజ్ ప్రేమకు కాసేపు నచ్చచెబుతాడు. అలా ప్రేమను నిద్రపుచ్చుతాడు. ఇక ఇక్కడి నుంచి సీన్ తిరుపతి దగ్గరికి మారుతుంది. ధీరజ్ తిరుపతి దగ్గరికి వచ్చి పెళ్లి కాలేదని బాధపడకు, ఇక్కడ పెళ్ళి చేసుకుని సంతోషంగా ఎవ్వరూ లేరు అని అంటాడు. తిరుపతి మాట్లాడుతూ నా కలలోకి వచ్చిన దేవకన్య ఎవరో కాదు సుకన్య అని చెబుతాడు. ఆమె నా కళ్ళముందే ఇక్కడే ఉంటుంది కదా అనుకుంటే.. ఇప్పుడు వెళ్ళిపోయింది మా ఇద్దరిని నువ్వే కలపాలి అంటూ ధీరజ్ ను అడుగుతాడు. దానికి ధీరజ్ ఒప్పుకోడు.

33
మళ్లీ పగబట్టిన వల్లి?
Image Credit : Jio hotstar

మళ్లీ పగబట్టిన వల్లి?

వేదవతిని పిలుస్తూ వీధిలోని ముగ్గురు నలుగురు మహిళలు వస్తారు. అందులో ఒకామె మాట్లాడుతూ ‘మా కోడలు నెల తప్పిందని తెలుసు కదా.. అందుకే మా ఊరి అమ్మవారి దగ్గర పూజ చేశాను. ఆ పసుపు కుంకుమలు నీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను’ అని చెబుతుంది. అది విని వేదవతి చాలా బాధపడుతుంది. అక్కడే ఉన్న వల్లిని ఆ మహిళ పిలుస్తుంది. వల్లితో కొంగు పట్టమ్మా పసుపు కుంకుమ తీసుకుందువు అని అంటుంది. వల్లి కొంగు పట్టగానే ఆమె పసుపు కుంకుమ కొంగులో పెట్టబోతుంది. అయితే వేదవతి ఆమెను అడ్డుకుంటుంది. ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి నర్మదను పిలుస్తుంది. కొంగు పట్టి అమ్మవారి పసుపు కుంకుమ తీసుకోమని నర్మదకు చెబుతుంది వేదవతి. అప్పుడు వచ్చిన మహిళలు ‘పెద్ద కోడల్ని కాదని రెండో కోడలిని తీసుకోమంటున్నారు ఏంటి’ అని అడుగుతారు. 

అప్పుడు వేదవతి మాట్లాడుతూ ‘పెద్ద కోడలు అంటే పెద్ద కొడుకుని పెళ్లి చేసుకోవడంలోనూ, వయసులోనూ కాదు. ఇంటి బాధ్యతలు చూసుకోవడంలో, పెద్ద మనసు ఉండడంలో ఉంటుంది’ అంటుంది వేదవతి. నర్మద కొంగు పట్టి పసుపు కుంకుమను తీసుకుంటుంది. వేదవతి కుంకుమ తీసుకొని ఇద్దరు కోడళ్ళకు బొట్టు పెట్టి.. వల్లిని మాత్రం వదిలేస్తుంది. అది చూసి వల్లి చాలా బాధపడుతుంది. వేదవతి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. 

వల్లి వేదవతి దగ్గరికి వచ్చి ఏడుస్తూ కాళ్ళ మీద పడుతుంది. నన్ను క్షమించండి అత్తయ్యా అని అడుగుతుంది. దానికి వేదవతి కాళ్ళను వదిలించుకుని ‘ మిగతా ఇద్దరు కోడళ్ళ కంటే నీకే ఎక్కువ విలువ ఇచ్చాను. నా కూతురికంటే ఎక్కువ ప్రేమను పెంచాను. కానీ నా ప్రేమ నీకు పిచ్చితనం అయింది, నా మంచితనం నీకు చేతకానితనమైంది. నీ మీద నాకు అసహ్యం వేస్తోంది. అది జన్మలో పోదు’ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నర్మదను, ప్రేమను వేదవతి ఆప్యాయంగా చూడడం చూసి వల్లిలో కోపం పెరుగుతుంది. మళ్లీ కుటుంబంపై పగబట్టేలా కనిపిస్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode: వల్లిని పుట్టింటికి ఈడ్చుకెళ్లిన వేదవతి.. నూతిలో దూకేసిన వల్లి
Recommended image2
Illu Illalu Pillalu Today Episode: మళ్లీ రామరాజుని వెర్రోడిని చేసిన కుటుంబం, అత్తారింటికి చేరిన వల్లి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved