MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ustaad Bhagat Singh Day 11 Collections: ఉస్తాద్‌కి పెరిగిన కలెక్షన్లు.. హిట్‌ కావాలంటే ఇంకా ఎన్నో కోట్లు రావాలంటే?

Ustaad Bhagat Singh Day 11 Collections: ఉస్తాద్‌కి పెరిగిన కలెక్షన్లు.. హిట్‌ కావాలంటే ఇంకా ఎన్నో కోట్లు రావాలంటే?

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీ రెండు వారాలు కంప్లీట్‌ చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఈ చిత్రానికి ఎన్ని కోట్లు వచ్చాయి? ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 30 2026, 11:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ బాక్సాఫీసు రిజల్ట్
Image Credit : Asianet News

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ బాక్సాఫీసు రిజల్ట్

పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రంలో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆడియెన్స్ నుంచి నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ డిజాస్టర్‌ దిశగా వెళ్తోంది. రోజు రోజుకి క్రమంగా కలెక్షన్లు తగ్గిపోతున్నాయి.

25
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ 11 రోజుల కలెక్షన్లు
Image Credit : Asianet News

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ 11 రోజుల కలెక్షన్లు

 పవన్‌ కళ్యాణ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`కి ఇప్పుడు అనూహ్యంగా కలెక్షన్లు పెరిగాయి. ఆదివారం ఈ సినిమాకి ఊహించని విధంగా వసూళ్లు పెరగడం ఆశ్చర్యపరుస్తోంది. ఆదివారం కోటీ మూడు లక్షలు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ.94కోట్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఇది ఇండియాలో రూ.82కోట్ల గ్రాస్‌, రూ.70కోట్ల నెట్‌ ని రాబట్టింది. ఓవర్సీస్‌ రూ.12కోట్ల వరకు వచ్చాయి. ఓవరాల్‌గా ఈ మూవీకి యాభై కోట్లకు పైగా షేర్‌ వచ్చిందని సమాచారం.

Related Articles

Related image1
Prakash Raj: ప్రకాష్‌ రాజ్‌ తల్లి కన్నుమూత.. అనాథగా కష్టాలు, పేషెంట్‌గా వచ్చినవాడితో లవ్‌ మ్యారేజ్‌
Related image2
NTR: 2 కోట్లు పెట్టి తీస్తే రూ.30 కోట్ల కలెక్షన్లు.. రూ.5 టికెట్‌ రేట్‌తో ఎన్టీఆర్ మూవీ సంచలనం
35
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ రోజు వారి కలెక్షన్లు
Image Credit : Asianet News

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ రోజు వారి కలెక్షన్లు

ఈ సినిమాకి రోజు వారి కలెక్షన్లు చూస్తే, ఇండియన్‌ నెట్‌ ప్రకారం మొదటి రోజు రూ.34.75కోట్లు, రెండో రోజు రూ.9కోట్లు, మూడో రోజు రూ.9.10కోట్లు, నాల్గో రూ.7.50కోట్లు, ఐదో రోజు రూ.2.50కోట్లు, ఆరో రోజు రూ.1.75కోట్లు, ఏడో రోజు రూ.1.35కోట్లు, ఎనిమిదో రోజు కోటి, 9వ రోజు రూ.1.10కోట్లు, పదో రోజు రూ.86లక్షలు, 11వ రోజు రూ.1.03కోట్లు రాబట్టింది. అయితే శనివారంతో పోల్చితే ఆదివారం దాదాపు ఇరవై లక్షలు పెరగడం విశేషం.

45
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కి భారీగా నష్టాలు?
Image Credit : Asianet News

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కి భారీగా నష్టాలు?

`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రానికి దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌ అయితే, థియేట్రికల్‌ బిజినెస్‌ ద్వారా రూ.123కోట్లు వచ్చినట్టు సమాచారం. అలాగే ఓటీటీ ద్వారా రూ.108కోట్లు వచ్చాయట. ఆడియో రైట్స్ అదనంగా చెప్పొచ్చు. అయితే థియేట్రికల్‌గా ఈ మూవీ భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం 60-70కోట్లు నష్టపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆదివారం వరకు బాగానే వచ్చింది. కానీ సోమవారం నుంచి దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది. దీన్ని బట్టి ఈ వారంతో ఈ సినిమాని థియేటర్ల నుంచి ఎత్తేసే పరిస్థితి వస్తుందని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

55
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ కథ ఏంటంటే?
Image Credit : Asianet News

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ కథ ఏంటంటే?

ఇక `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కథ గురించి చూస్తే, ఇందులో పవన్‌ కళ్యాణ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఆయన ఒక అనాథ. ఒక గురువు(కేఎస్‌ రవికుమార్‌) ప్రోత్సాహంతో బాగా చదువుకుని పోలీస్‌ అవుతాడు. అన్యాయాన్ని ఎదురిస్తాడు. అవినీతి, అక్రమాలు చేసే రాజకీయ నాయకుల తాట తీస్తాడు. ఈ క్రమంలో తన గురువే సీఎం అవుతాడు. ఆయనకు పవన్‌ సపోర్ట్ గా ఉంటాడు. కానీ ఓ రాజకీయ నాయకుడు(పార్థీబన్‌) తాను సీఎం సీటుని సొంతం చేసుకోవాలని సీఎంపై ఎటాక్‌ చేస్తాడు. అలాగే తనకు అన్ని రకాలుగా అడ్డుగా మారుతున్న పవన్‌ ఫ్యామిలీని చంపేస్తాడు. మరి అతనిపై పవన్‌ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది ఈ సినిమా కథ.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Prakash Raj: ప్రకాష్‌ రాజ్‌ తల్లి కన్నుమూత.. అనాథగా కష్టాలు, పేషెంట్‌గా వచ్చినవాడితో లవ్‌ మ్యారేజ్‌
Recommended image2
Brahmamudi Serial Today Episode: రాకేష్‍తో మాట్లాడుతూ దొరికిపోయిన ఐశ్వర్య, రాజు గురించి తెలుసుకునేందుకు రేఖ ప్లాన్
Recommended image3
Ajay Devgn Flop Movie: స్టార్ హీరోతో తమన్నా మూవీ, కోట్ల రూపాయలు బూడిదపాలైందని తెలుసా
Related Stories
Recommended image1
Prakash Raj: ప్రకాష్‌ రాజ్‌ తల్లి కన్నుమూత.. అనాథగా కష్టాలు, పేషెంట్‌గా వచ్చినవాడితో లవ్‌ మ్యారేజ్‌
Recommended image2
NTR: 2 కోట్లు పెట్టి తీస్తే రూ.30 కోట్ల కలెక్షన్లు.. రూ.5 టికెట్‌ రేట్‌తో ఎన్టీఆర్ మూవీ సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved