- Home
- Entertainment
- StarHero Childhood Photo: 3 బ్లాక్‌బస్టర్లు, 6 సూపర్ హిట్లు, 4వేల కోట్ల సినిమా చేస్తోన్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?
StarHero Childhood Photo: 3 బ్లాక్‌బస్టర్లు, 6 సూపర్ హిట్లు, 4వేల కోట్ల సినిమా చేస్తోన్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?
StarHero Childhood Photo: స్టార్ హీరో చిన్నప్పటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెద్ద స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ హీరో, తన 19 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇచ్చాడు. మరి ఆయన ఎవరో తెలుసా?

ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?
బాలీవుడ్ సూపర్ స్టార్ చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 44 ఏళ్ల ఈ హీరో తన 19 ఏళ్ల సినీ కెరీర్‌లో 3 బ్లాక్‌బస్టర్లు, 6 సూపర్ హిట్లు, 3 హిట్ సినిమాలు ఇచ్చాడు. ఇప్పుడు 4000కోట్ల సినిమా చేస్తున్నాడు.
హిస్టారికల్ మూవీ చేస్తోన్న హీరో
బాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ హీరో తల్లిదండ్రులు, భార్య కూడా స్టార్లే. ప్రస్తుతం ఈ హీరో దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఓ భారీ చారిత్రక సినిమాలో నటిస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా?
ఆ హీరో రణ్‌బీర్ కపూర్
ఈ రోజు సోమవారం రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు ఆయన చిన్నప్పటి ఫోటోను వైరల్ చేస్తున్నారు. యానిమల్, బర్ఫీ, సంజు, యే జవానీ హై దీవానీ, బ్రహ్మాస్త్ర లాంటి సూపర్ హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోల్లో రణ్‌బీర్ ఒకరు. ఇప్పుడు ఆయన నటిస్తోన్న `రామాయణ్` మూవీ ఏకంగా నాలుగు వేల కోట్లతో రూపొందుతున్న విషయం తెలిసిందే,
నేడు రణ్‌బీర్ కపూర్ బర్త్ డే
రణ్‌బీర్ కపూర్ 1982 సెప్టెంబర్ 28న రిషి కపూర్, నీతూ కపూర్ దంపతులకు జన్మించాడు. బాలీవుడ్ లెజెండరీ నటుడు, దర్శకుడు రాజ్ కపూర్‌కు ఇతను మనవడు. రణ్‌బీర్ 'స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్', 'లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్'లో మెథడ్ యాక్టింగ్, ఫిల్మ్ మేకింగ్ చదివాడు.
అలియాభట్‌ని పెళ్లి చేసుకున్న రణ్‌బీర్ కపూర్
కెరీర్ మొదట్లో రణ్‌బీర్ కపూర్ చాలా మంది హీరోయిన్లతో డేటింగ్ రూమర్స్ ఎదుర్కొన్నాడు. దీపికా పదుకొణె, కత్రినా కైఫ్ లాంటి స్టార్లతో ఆయన పేరు వినిపించింది. చివరకు ఈ గాసిప్స్‌కు చెక్ పెడుతూ తన గర్ల్‌ఫ్రెండ్ అలియా భట్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ జంటకు ఓ ముద్దుల కూతురు ఉంది.

