MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆనందానికి అసలైన అర్థం చెప్పిన ఉపేంద్ర.. సినిమాల్లాగే ఆయన ఫిలాసఫి కూడా సూపర్

ఆనందానికి అసలైన అర్థం చెప్పిన ఉపేంద్ర.. సినిమాల్లాగే ఆయన ఫిలాసఫి కూడా సూపర్

ఉపేంద్ర పేరుకు కన్నడ హీరో అయినా. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇటీవల యూఐ అనే సినిమాతో ఆడియన్స్ పలకరించిన ఉపేంద్ర మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో ఆసక్తిర విషయాలను పంచుకున్నారు.. 

2 Min read
Narender Vaitla
Published : Dec 31 2024, 07:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
స్వీయ అవగాహన ప్రాముఖ్యతను తెలియజేసే ప్రయత్నం

స్వీయ అవగాహన ప్రాముఖ్యతను తెలియజేసే ప్రయత్నం

యూఐ సినిమా ద్వారా తాము ఆడియన్స్ కు ఒక విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేశామని ఉపేంద్ర తెలిపారు. స్వీయ అవగాహన ప్రాముఖ్యత ఎంత గొప్పదే ఈ సినిమాతో వివరించాలనుకున్నామన్నారు. ప్రేక్షకులు కూడా ఈ విషయాన్ని బాగానే స్వీకరించి, అర్థం చేసుకున్నారని ఉపేంద్ర చెప్పుకొచ్చారు. 

26
క్లైమాక్స్ కీలకం..

క్లైమాక్స్ కీలకం..

సినిమాలోని చివరి సన్నివేశం కొంచెం క్లిష్టమైనదని, దాన్ని కొంతి మంది మాత్రమే అర్థం చేసుకున్నారని ఉపేంద్ర చెప్పుకొచ్చారు, యూఐ సినిమా విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉపేంద్ర చిత్ర యూనిట్ తో కలిసి కేక్ కట్ చేసిన సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగానే ఆయన ఆనందానికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. 

36
అసలైన ఆనందం ఏంటంటే

అసలైన ఆనందం ఏంటంటే

ప్రతి ఒక్కరూ తమ జీవితాలను సరిగ్గా చూసుకుంటే అసలు సమస్యలే ఉండవని ఉపేంద్ర చెప్పుకొచ్చారు. ఇక  స్వ విమర్శ, విశ్లేషణ చేసుకోవాలని సూచించారు. అలాగే ఆనందం అనేది ఎక్కడి నుంచో రాదని, మనశ్శాంతే ఆనందం అనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. నిజానికి చాలా మంది కారుల్లోనే, దుస్తుల్లోనే, అంతస్తుల్లోనే ఆనందాన్ని వెతుక్కుంటారు. కానీ అది ఏమాత్రం కరెక్ట్ కాదని ఒక్క మాటతో చెప్పేశారు ఉపేంద్ర. 

46

ఇక యూఐ సినిమా సక్సెస్ పై కూడా ఉపేంద్ర స్పందించారు. సినిమా రొటీన్ ఫార్ములాను మించి తాను ప్రయత్నించానని, ప్రేక్షకులు దాన్ని ఆదరించారని అన్నారు. తాను ఊహించిన దానికంటే భిన్నంగా ప్రేక్షకులు ఆలోచిస్తున్నారని, ఇలాంటి ప్రయత్నాలకు ప్రోత్సాహం ఉంటే మరింత ధైర్యంగా ప్రయత్నించవచ్చని చెప్పుకొచ్చారు. ఈ సినిమా విజయం ముమ్మాటికీ ప్రేక్షకులదేనని ఉపేంద్ర అన్నారు.
 

56
రామాయణ, మహాభారతాల గురించి..

రామాయణ, మహాభారతాల గురించి..

రామాయణ, మహాభారతాలు ఎప్పుడూ ప్రస్తుతమేనని, వాటి ఆధారంగా చాలా మంది సినిమాలు తీస్తున్నారని, కాపీరైట్‌ సమస్య వస్తే అందరు దర్శకులూ వాల్మీకి, వ్యాసులకు కాపీరైట్‌ డబ్బులు ఇవ్వాలని నవ్వుతూ ఉన్నారు. వారు వేల సంవత్సరాల క్రితం చెప్పిన విషయాలనే ఇప్పుడు దర్శకులు సినిమాలుగా తీస్తున్నారని అన్నారు. 

66

ఇక సినిమా విజయం గురించి లహరి వేలు మాట్లాడుతూ, సినిమా బాగా హిట్‌ అయ్యిందని, బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ సాధించిందని, అంచనాలకు మించి సినిమా విజయం సాధించిందని అన్నారు. నిర్మాతలు జి. మనోహరన్‌, నవీన్‌ మనోహరన్‌ తో సహా చిత్ర యూనిట్ ఈ వేడుకలో పాల్గొంది. 

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
100 సినిమాల్లో 44 ప్లాప్ లు, 30 మూవీస్ రిలీజ్ అవ్వలేదు, అయినా సరే ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Recommended image3
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved