MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు దక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా?

తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు దక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా?

చాలా చిన్నవయసులో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు యంగ్ హీరో ఉదయ్ కిరణ్. ఆయన కెరీర్ ను కంప్లీట్ గా మార్చి.. స్టార్ డమ్ ఇచ్చిన సినిమా ఏదో తెలుసా? ఆ సినిమా అవకాశం అతనికి ఎలా వచ్చిందంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 10 2026, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిన్నవయసులో కన్నుమూసిన ఉదయ్ కిరణ్
Image Credit : Asianet News

చిన్నవయసులో కన్నుమూసిన ఉదయ్ కిరణ్

ఉదయ్ కిరణ్ ను తలుచుకుంటే.. ఆయన అభిమానుల గుండెలు బరువెక్కుతాయి.. కళ్లలో నీళ్ళు తెలియకుండానే ఉబికి వస్తుంటాయి.. హీరోగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ హీరో.. చిన్నవయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆయన్ను అభిమానించే ఎంతో మందికి కన్నీళ్లు మిగిల్చాడు. కానీ ఉదయ్ కిరణ్ చేసిన సినిమాలు ఎప్పటికీ.. అతన్ని అభిమానుల నుంచి దూరం చేయకుండా.. మరింత గుర్తు చేస్తుంటాయి. మంచి మంచి ప్రేమ కథలతో.. యూత్ ఆడియన్స్ తో పాటు.. ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా అలరించాడు యంగ్ హీరో. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను అనుభవించాడు.

25
మొదటి సినిమాతో స్టార్ గా..
Image Credit : facebook.com/UdayKiran.OfficialPage

మొదటి సినిమాతో స్టార్ గా..

ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీకి వచ్చీ రావడంతోనే హిట్లు కొట్టాడు. ఫస్ట్ మూవీతోనే స్టార్ గా మారాడు. తేజ డైరెక్షన్ లో ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈసినిమాతో ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ గా ఆడియన్స అందరిలో రిజిస్టర్ అయ్యాడు. చిత్రం సినిమా తరువాత వరుసగా ఎన్నో అవకాశాలు అతన్ని పలుకరించాయి. కానీ సెలక్టీవ్ గా సినిమాలు తీసుకోవడం వల్ల... ఉదయ్ ఇండస్ట్రీలో హీరోగా నిలబడగలిగాడు. అయితే ఆయన కెరీర్ ను కంప్లీట్ గా మార్చిన సినిమా నువ్వు నేను. ఈసినిమా అవకాశం ఉదయ్ కిరణ్ కు ఎలా వచ్చిందో తెలుసా?

Related Articles

Related image1
కార్తీక దీపం దీప రెమ్యునరేషన్ ఎంత? వంటలక్క ఆస్తులు తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..ప్రేమి విశ్వనాథ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్..?
Related image2
మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా? మోహన్ బాబు వల్ల డిజాస్టర్ అయిన మూవీ..
35
తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు అవకాశం..
Image Credit : Asianet News

తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు అవకాశం..

అయితే నువ్వు నేను సినిమా అవకాశం ఉదయ్ కిరణ్ కు చాలా విచిత్ర పరిస్థితుల్లో వచ్చింది. ఈసినిమా కోసం ముందుగా తరుణ్ ను తీసుకోవాలి అని అనుకున్నారట మేకర్స్. తరుణ్ కోసమే ఈ కథను రెడీ చేసుకున్నారట. ఆ టైమ్ లో తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. తరుణ్ బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమాను తరుణ్ చేయలేకపోయాడ. అదే టైమ్ లో చిత్రం సినిమాతో ఒకేసారి వెలుగులోకి వచ్చాడు ఉదయ్ కిరణ్.. ఇక నువ్వు నేను సినిమాకు కూడా తేజనే డైరెక్టర్ కావడం.. అతని మనసులో ముందు నుంచే ఉదయ్ కిరణ్ ను తీసుకోవాలని ఆలోచన ఉండటంతో.. వెంటనే అవకాశం అతన్ని వరించింది.

45
ఉదయ్ కిరణ్ కు స్టార్ డమ్ తెచ్చిన సినిమా..
Image Credit : https://www.facebook.com/UdayKiran.OfficialPage

ఉదయ్ కిరణ్ కు స్టార్ డమ్ తెచ్చిన సినిమా..

ఉదయ్ కిరణ్ కెరీర్ ను కంప్లీట్ గా మార్చిన సినిమా నువ్వు నేను. చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన తరువాత ఉదయ్ చేసిన రెండో సినిమా ఇది. ఈసినిమా తో ఉదయ్ కిరణ్ కు ఇండస్ట్రీలో స్టార్ డమ్ వచ్చేసింది. ఈమూవీ యూత్ పై ఎలాంటి ప్రభావం చూపించిందంటే.. నువ్వు నేను పాటలు పెట్టుకుని ప్రేమికులు తెగ మురిసిపోయారు. చీ చీ మీ పెద్దోళ్లున్నారే.. డైలాగ్ అయితే మారు మోగిపోయింది. ప్రేమికులలో ధైర్యాన్ని నింపింది ఈ సినిమా. నువ్వు నేను బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో

55
మంచి మనసున్న హీరో
Image Credit : our own

మంచి మనసున్న హీరో

హీరోగా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను ఫేస్ చేసిన హీరో ఉదయ్ కిరణ్. హీరోగా మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తిగా ఉదయ్ కిరణ కు పరిశ్రమలో పేరుంది. హీరోగా మంచి భవిష్యత్తు ఉండగానే.. మానసిక ఒత్తడి కారణంగా ఉదయ్ కిరణ ఆత్మహత్య చేసుకోవడం అభిమానులను, ప్రేక్షకులను కంటతడిపెట్టించింది. తన సినిమాలతో ప్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ మరణం పై పలు అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో చాలా వెర్షన్లు వినిపిస్తుంటాయి. ఏది ఏమైనా ఫిల్మ్ ఇండస్ట్రీ మంచి హీరోను కోల్పోయింది. అభిమానులు మంచి మనసున్ననటుడిని కోల్పోయారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఉదయ్ కిరణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే
Recommended image2
Jeffrey Epstein: ఎవ‌రీ జెఫ్రీ, ఆ ఐల్యాండ్‌లో ఏం చేశాడు? OTTలో భయంకర సత్యాలను తెలిపే డాక్యుమెంటరీ
Recommended image3
కార్తీక దీపం దీప రెమ్యునరేషన్ ఎంత? వంటలక్క ఆస్తులు తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..ప్రేమి విశ్వనాథ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్..?
Related Stories
Recommended image1
కార్తీక దీపం దీప రెమ్యునరేషన్ ఎంత? వంటలక్క ఆస్తులు తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..ప్రేమి విశ్వనాథ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్..?
Recommended image2
మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా? మోహన్ బాబు వల్ల డిజాస్టర్ అయిన మూవీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved