MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Uday Kiran Favorite Food: ఉదయ్‌ కిరణ్‌కి ఇష్టమైన ఫుడ్‌ ఏంటో తెలుసా? స్టార్‌ హీరో అయి ఉండి ఇంత సింపుల్‌గానా?

Uday Kiran Favorite Food: ఉదయ్‌ కిరణ్‌కి ఇష్టమైన ఫుడ్‌ ఏంటో తెలుసా? స్టార్‌ హీరో అయి ఉండి ఇంత సింపుల్‌గానా?

Uday Kiran Favorite Food: ఒకప్పుడు లవర్‌ బాయ్‌గా టాలీవుడ్‌ ని ఊపేసిన ఉదయ్‌ కిరణ్ గురించి అక్క శ్రీదేవి ఆసక్తికర విషయాలను పంచుకుంది. అందులో భాగంగా ఆయనకు ఇష్టమైన ఫుడ్‌ ఏంటో రివీల్‌ చేసింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 16 2026, 07:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
`మనసంతా నువ్వే`తో ఆడియెన్స్ ని అలరించిన ఉదయ్‌ కిరణ్‌
Image Credit : Asianet News

`మనసంతా నువ్వే`తో ఆడియెన్స్ ని అలరించిన ఉదయ్‌ కిరణ్‌

లవర్‌ బాయ్‌ ఉదయ్‌ కిరణ్‌ ఇప్పుడు మన మధ్య లేరు. కానీ ఆయన తన సినిమాలతో మన మధ్యనే ఉన్నట్టుగా ఉంది. తన లవ్‌ స్టోరీస్‌తో ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. లవ్‌ స్టోరీస్‌ చూడాలంటే ఆయన మూవీస్‌ బెస్ట్ ఛాయిస్‌ అవుతున్నాయి. ఇటీవల ప్రేమికుల రోజు సందర్భంగా ఆయన నటించిన `మనసంతా నువ్వే` మూవీ రీ రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. దీనికి విశేషమైన స్పందన లభించింది. ప్రేమికుల రోజు రీ రిలీజ్‌ కావడంతో లవర్స్ పండగ చేసుకున్నారని చెప్పొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉదయ్‌ కిరణ్‌కి ఇష్టమైన ఫుడ్‌
Image Credit : our own

ఉదయ్‌ కిరణ్‌కి ఇష్టమైన ఫుడ్‌

ఈ క్రమంలో ఉదయ్‌ కిరణ్‌కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆయన అక్కడ శ్రీదేవి ఈ విషయాలను పంచుకుంది. ఉదయ్‌ కిరణ్‌ ఫేవరేట్‌ ఫుడ్‌ ఏంటో తెలిపింది. ఏదైనా సంతోషంలో ఉన్నప్పుడు తనకు ఇష్టమైన ఫుడ్‌ తింటాడట. అది స్వయంగా తనే చేసి పెట్టేదట. సినిమాలు రిలీజ్‌ అయినప్పుడు, సక్సెస్‌ అయినప్పుడు ఇలా తమతోనే ఉండి సెలబ్రేట్‌ చేసుకునేవాడట.

35
ఉదయ్‌ కిరణ్‌ సంతోషంగా ఉంటే తినేది ఇదే
Image Credit : our own

ఉదయ్‌ కిరణ్‌ సంతోషంగా ఉంటే తినేది ఇదే

ఈ క్రమంలో ఉదయ్‌ కిరణ్‌కి ఇష్టమైన ఫుడ్‌ ఏంటో చెప్పింది శ్రీదేవి. ఆలుగడ్డ ఫ్రై అంటే ఇష్టమట. ఎంతో ఇష్టంగా తినేవాడట. అలాగే చారు, చింతపండు పులిహోరని బాగా ఇష్టంగా తినేవాడట. తన ఆహార అలవాట్లు చాలా సింపుల్‌గా ఉండేవని తెలిపింది. వీటినే ఎక్కువగా తినేవాడట. టేస్ట్ లు కూడా సింపుల్‌గా ఉండేవని తెలిపింది శ్రీదేవి. లేటెస్ట్ గా ఆమె సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకుంది.

45
ఉదయ్‌ కిరణ్‌ మరణానికి కారణం ఏంటి?
Image Credit : youtube/@sumantv

ఉదయ్‌ కిరణ్‌ మరణానికి కారణం ఏంటి?

`మనసంతా నువ్వే` చిత్రంలో ఎలా అయితే ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడో, ఇంట్లో కూడా అలానే ఉండేవాడని, ఎప్పుడూ నవ్వుతూనే కనిపించేవాడని, తన బాధని ఎప్పుడూ చెప్పేవాడు కాదని తెలిపారు. హ్యాపీగా ఉండే పర్సన్‌ అని, కానీ మనసులో ఇంత బాధపెట్టుకున్నాడనే విషయం తమకు అర్థం కాలేదని, చివర్లో కూడా ఏం చెప్పలేదని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు, సినిమా అవకాశాలు రావడం లేదనేది నిజం కాదని, తనకు చాలా ఆఫర్లు వస్తున్నాయి. కానీ మంచి సినిమాలు చేయాలనుకునేవాడు. సెలక్టీవ్‌గా వెళ్లేవాడు. అదే సమయంలో తన భార్యతోనూ గొడవలు లేవని, వారిద్దరు హ్యాపీగా ఉండేవారని తెలిపింది ఉదయ్‌ కిరణ్‌ అక్క.

55
లవర్‌ బాయ్‌గా రాణించిన ఉదయ్‌ కిరణ్‌
Image Credit : facebook.com/UdayKiran.OfficialPage

లవర్‌ బాయ్‌గా రాణించిన ఉదయ్‌ కిరణ్‌

సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఉదయ కిరణ్‌ `చిత్రం` సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. హీరోగా నటించిన తొలి చిత్రంతోనే హిట్‌ అందుకున్నాడు. టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత `నువ్వు నేను`, `మనసంతా నువ్వే` చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. వరుసగా హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాడు. దీంతో విశేషమైన ఫాలోయింగ్‌ ఏర్పడింది. లవర్‌ బాయ్‌ అనే ట్యాగ్‌ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన `కలుసుకోవాలని` కూడా పెద్ద హిట్‌ అయ్యింది. కానీ ఆ తర్వాత నుంచే ఉదయ్‌ కిరణ్‌ కెరీర్‌ డౌన్‌ అయ్యింది. ఉదయ్‌ కిరణ్‌ 2014 జనవరి 5న ఆత్మహత్య చేసుకున్నాడు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఉదయ్ కిరణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Actress Roja: రోజా నిద్రపోతుంటే రజనీకాంత్ చేసిన అల్లరి పనికి అంతా షాక్‌.. సెట్‌లో సూపర్‌స్టార్‌ ఎలా ఉంటారంటే?
Recommended image2
Varanasi Update: మహేష్‌ `వారణాసి` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌.. అప్పట్నుంచే అసలైన పండగ షురూ
Recommended image3
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Related Stories
Recommended image1
Vijay Rashmika Wedding Card: విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌.. పెళ్లి చిన్నగా, రిసెప్షన్‌కి రండి
Recommended image2
OTT Movie: థియేటర్లో డిజాస్టర్‌, ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతున్న బాలయ్య సినిమా.. నెట్‌ ఫ్లిక్స్ టాప్‌ 10 ఫిల్మ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved