MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vijay Rashmika Wedding Card: విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌.. పెళ్లి చిన్నగా, రిసెప్షన్‌కి రండి

Vijay Rashmika Wedding Card: విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌.. పెళ్లి చిన్నగా, రిసెప్షన్‌కి రండి

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఎట్టకేలకు ఒక్కటి కాబోతున్నారు. వీరి రిసెప్షన్‌కి సంబంధించిన ఇన్విటేషన్‌ కార్డ్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 16 2026, 05:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాన్‌ ఇండియా స్టార్స్ గా రాణిస్తున్న విజయ్‌, రష్మిక మందన్నా
Image Credit : Asianet News

పాన్‌ ఇండియా స్టార్స్ గా రాణిస్తున్న విజయ్‌, రష్మిక మందన్నా

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా.. పరిచయం అక్కర్లేని జంట. విజయ్‌ దేవరకొండ టాలీవుడ్‌లో  స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. ఇప్పుడు భారీ పాన్‌ ఇండియా చిత్రాలతో రాబోతున్నారు. మరోవైపు రష్మిక మందన్నా నేషనల్‌ క్రష్‌గా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. `పుష్ప 2`, `ఛావా` చిత్రాలతో పాన్‌ ఇండియా లెవల్‌లో దుమ్మురేపింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతోనూ మెప్పించింది. ఈ ఇద్దరు కలిసి `గీత గోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌` చిత్రాల్లో నటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
`డియర్‌ కామ్రేడ్‌` టైమ్‌లో ప్రేమలో పడ్డ  విజయ్‌, రష్మిక
Image Credit : Zee5

`డియర్‌ కామ్రేడ్‌` టైమ్‌లో ప్రేమలో పడ్డ విజయ్‌, రష్మిక

`డియర్‌ కామ్రేడ్‌` సినిమా సమయం నుంచే ఇద్దరు ప్రేమలో పడ్డారు. రహస్యంగా ప్రేమ వ్యవహారాన్ని నడిపించారు. అయితే ఎయిర్‌పోర్ట్ లో, వెకేషన్‌లో ఈ ఇద్దరు దొరికిపోయారు. కావాలనే హింట్‌ ఇచ్చారు. తాము ప్రేమలో ఉన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే ఇప్పుడు తమ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లబోతున్నారు. గతేడాది దసరా సమయంలోనే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. విజయ్‌ దేవరకొండ ఇంట్లో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నారు.

35
విజయ్‌ దేవరకొండ, రష్మిక వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ కార్డ్ లీక్‌
Image Credit : X/greatandhra

విజయ్‌ దేవరకొండ, రష్మిక వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ కార్డ్ లీక్‌

 పెళ్లి డేట్‌ని గానీ, రిసెప్షన్‌ వివరాలను గానీ ఇప్పటి వరకు ప్రకటించలేదు విజయ్‌, రష్మిక. ఈ వ్యవహారాలన్నింటిని రహస్యంగా చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి వెడ్డింగ్‌ కార్డ్ ఇచ్చి ఆహ్వానించారు విజయ్‌. ఇప్పుడు ఎట్టకేలకు పెళ్లి కార్డ్ బయటకు వచ్చింది. సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యింది. అయితే ఇది చాలా స్పెషల్‌గా ఉంది. వెడ్డింగ్‌ కార్డ్ లా లేదు. రిసెప్షన్‌ ఇన్విటేషన్‌ కార్డ్ లా ఉంది. ఇందులో విజయ్‌ పెళ్లికి పిలవడం లేదు, రిసెప్షన్‌కి ఆహ్వానిస్తున్నారు.

45
పెళ్లి ఫిబ్రవరి 26, రిసెప్షన్‌ మార్చి 4
Image Credit : Asianet News

పెళ్లి ఫిబ్రవరి 26, రిసెప్షన్‌ మార్చి 4

ఫ్యామిలీ, పెద్దల ఆశీస్సులతో ఫిబ్రవరి 26న రష్మిక, తాను పెళ్లి చేసుకుంటున్నామని, ఈ వేడుకని చిన్నగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రిసెప్షన్‌కి హాజరు కావాలని ఇందులో పేర్కొన్నారు. తమ కొత్త జర్నీలో మీరు భాగం కావాలని గెస్ట్ లను ఆహ్వానించారు విజయ్‌. మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్‌ క్రిష్ణలో ఈ రిసెప్షన్‌ జరుగుతుందని, సాయంత్రం 7 గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు విజయ్‌ దేవరకొండ. ఈ ఇన్విటేషన్‌ చాలా సింపుల్‌గా ఉంది. ఇప్పుడిది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

55
ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌లో విజయ్‌, రష్మిక రాయల్‌ వెడ్డింగ్‌
Image Credit : Rashmika Mandanna/Instagram, Vijay Devarakonda/Instagram

ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌లో విజయ్‌, రష్మిక రాయల్‌ వెడ్డింగ్‌

ఫిబ్రవరి 26న ఉదయ్‌ పూర్‌ ఫ్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. మ్యారేజ్‌ ఈవెంట్‌ మాత్రం చాలా రాయల్‌గా నిర్వహించనున్నారు. అదే సమయంలో హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా రిసెప్షన్‌ ప్లాన్‌ చేశారట. ఈ క్రమంలో రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, పలువురు వ్యాపారవేత్తలు కూడా  పాల్గొనబోతున్నారట. ప్రముఖులను విజయ్‌ దేవరకొండ స్వయంగా ఆహ్వానిస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
Couple Friendly Box Office: `కపుల్‌ ఫ్రెండ్లీ` మూవీ బాక్సాఫీసు కలెక్షన్లు.. రెండో రోజు పెరిగిన వసూళ్లు
Recommended image2
రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ పెళ్లికి 100 కోట్ల ఓటీటీ ఆఫర్‌? రౌడీ కపుల్ నిర్ణయం ఏంటో తెలుసా? షాక్ అవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved