MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: లేచిపోయి పెళ్లి చేసుకొనున్న హిమ, ప్రేమ్.. నిరుపమ్‌తో శౌర్య పెళ్లి ఫిక్స్!

Karthika Deepam: లేచిపోయి పెళ్లి చేసుకొనున్న హిమ, ప్రేమ్.. నిరుపమ్‌తో శౌర్య పెళ్లి ఫిక్స్!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 12వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం... 

4 Min read
Author : Navya G
Published : Aug 12 2022, 07:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... సౌందర్య, శౌర్యతో నేను అప్పుడు వస్తే నువ్వే నన్ను అక్కడి నుంచి పంపించేశావు. మళ్లీ ఇప్పుడు ఇలాగ అంటున్నావు అని అంటుంది. అప్పుడు సౌర్య, ఇప్పుడు కూడా బలవంతంగానే ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడ ఎవరు నాకు సొంత మనుషుల్లా అనిపించడం లేదు,పరాయి ఇంట్లో ఉంటున్నట్టు ఉంది అని అనగా హిమ,ఇంట్లో నాదెంత బాధ్యత ఉన్నదో నీది అంతే బాధ్యత ఉంది అని అంటుంది.దానికి శౌర్య బాధ్యతల గురించి నువ్వు మాట్లాడొద్దు చేసిన బాధ్యతలు చాలు అని అంటుంది.అప్పుడు హిమ, నేను ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను శౌర్య. నీకు నిరుపమ్ బావకి ఎలాగైనా పెళ్లి చేపిస్తాను అని అంటుంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

అప్పుడు ఆనందరావు, సౌందర్య, హిమని ఆ ఆలోచనలు మనసులో నుంచి బయటికి తీసేయ్ అని తిడతారు. సౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో స్వప్న, పెళ్లి పనులన్నీ హడావిడిగా చేస్తూ ఉంటుంది. ప్రేమ్ తన గదిలో కూర్చొని హిమ ఫోటో చూసుకుంటూ,నేనింత డైరెక్ట్ గా చెప్పినా కూడా నువ్వెందుకు రెస్పాండ్ అవ్వట్లేదు హిమ అని ఆలోచిస్తూ ఉంటాడు.ఈలోగా నిరూపమ్ ఫోన్ లాక్కొని ఏముంది? అని అంటాడు. ప్రేమ్ వెంటనే భయపడి ఫోన్ తిరిగి లాగేసుకుంటాడు .అంత సీక్రెట్స్ ఏమున్నాయి? అని నిరుపమ్ అనగా ఏమీ లేవు అని చెప్పి తప్పించుకుంటాడు. ఈలోగా ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఈ మధ్య ప్రేమ్ చాలా డల్ గా కనిపిస్తున్నాడు.
 

37

అసలు ఏమైందో ఎవరికీ చెప్పడం లేదు అని అంటారు.అప్పుడు ప్రేమ మనసులో,ఇష్టం లేకుండా హిమకి పెళ్లి చేసేస్తున్నారు, ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి అని అనుకుంటాడు.పైకి మాత్రం ఏం లేదు అని వెళ్ళిపోతాడు.ఆ తర్వాత సీన్ లో ఇంట్లో వాళ్ళందరూ కలిపి భోజనం చేస్తున్నప్పుడు హిమ మనసులో, ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి, ప్రేమ్ బావ దగ్గర ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో? నన్ను ప్రేమిస్తున్నాడు అని తెలిసేసరికి నాకు ఇంకో భయం మొదలైంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే స్వప్న సత్యంలు షాపింగ్ పూర్తి చేసుకొని అక్కడికి వస్తారు. నా మేనకోడలు ఇద్దరికీ నేను చీరలు కొన్నాను అని అనగా శౌర్య కంచంలోనే చేయి కడుక్కొని మిమ్మల్ని ఎవరు తెమ్మన్నారు? కొన్ని మంది నామీద జాలి చూపిస్తున్నారు, ఇంకొన్ని మంది ప్రేమను చూపిస్తున్నారు, ఇంకొంతమంది శాడిజం చూపిస్తున్నారు.
 

47

నాకు అవేవీ వద్దు ఈ పెళ్లి త్వరగా అయిపోతే నా దారి నేను చూసుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శౌర్య. ఆ తర్వాత సీన్లో ప్రేమ్ మనసులో, ప్రేమ విషయం చెప్పి ఇన్ని రోజులైనా దానికి నువ్వేమీ అనట్లేదు, ఆ టాపిక్ మన మధ్య తేవట్లేదు ఎందుకు హిమ? అని బాధపడుతూ ఉండగా, నిరూపము అక్కడికి వెళ్లి ఏమైంది? ఎందుకు ఇన్ని రోజుల నుంచి అలా బాధగా ఉన్నావు? నేను నీ అన్నయ్యని రా నాతో చెప్పుకో చిన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ గా ఉండే వాళ్ళం కదా అన్నీ చెప్పుకునే వాళ్ళం కదా ఇది చెప్పు అని అంటాడు. మరోవైపు హిమా శౌర్య దగ్గరికి వెళ్లి మనం చిన్నప్పుడు నుంచి ఫ్రెండ్స్ కదా శౌర్య అన్ని షేర్ చేసుకుని నేను ఏ డౌట్ వచ్చినా నిన్నే అడిగేదాన్ని అని అంటుంది. అప్పుడు శౌర్య ఫ్రెండ్స్ అంటే ఒకరికొకరు సహాయం చేయడం అంతేగాని ద్రోహం చేయడం కాదు అని అంటుంది.
 

57

అటువైపు ప్రేమ్ మనసులో, తెలుసో తెలియకో ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించాము హిమ నిన్ను వద్దంటుంది కదా కారణం ఏంటో కూడా తెలుసుకోలేదా అని మనసులో అనుకుంటాడు. ఇటువైపు హిమ కూడా మనసులో, తెలిసో తెలియకో ఇద్దరం ఒకరిని ప్రేమించాము. కానీ ఎప్పుడైతే నువ్వు బావని ప్రేమించావని తెలిసిందో అప్పుడే నా ప్రేమని సమాధి చేసుకున్నాను అని అంటుంది. కానీ శౌర్య హిమనీ గదిలో నుంచి బయటకు గెంటేస్తుంది. అటువైపు ప్రేమ్ కూడా ఏమీ లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో, సౌర్య సోఫాలో కూర్చుంటూ ఆలోచిస్తూ ఉండగా ఆనందరావు శౌర్య మనసు ఎలాగైనా మార్చాలి అనుకుని శౌర్య దగ్గరకు వెళ్తాడు. అదే సమయంలో ఇంటి పనులు చేస్తున్న వాళ్లు ఆనందరావుతో మీ కోడలు బంగారమైన మొగుడిని కొట్టేసింది అని నవ్వుతారు. వారిని ఆనంద రావు పంపిస్తాడు.
 

67

 ఏదైనా బాగు చేద్దాం అనుకుంటే ఇలా తేడా కొట్టింది ఏంటి? అని మనసులో అనుకుంటాడు. అప్పుడు ఆనందరావు, సౌర్య నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఎంతో మంచి జరిగింది అమ్మ అని పొగుడుతాడు. నాకు పొగడ్తలు నచ్చవు తాతయ్య విషయం ఏంటో చెప్పండి అని అంటుంది శౌర్య. అప్పుడు ఆనందరావు, ఎన్నో రోజుల నుంచి పుట్టింటికంటేనే నచ్చని మీ స్వప్న అత్త కూడా ఇంటిలో కలిసిపోయింది. అలాగే నువ్వు కూడా హిమతో అని మాట పూర్తి చేయకముందే సౌర్య లేచి అది జరగని పని తాతయ్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో నిరూపమ్, ప్రేమ్ ఎందుకు ఇలా ఉన్నాడు? మనసులో ఏమైనా బాధ పెట్టుకున్నాడా? ఈ పెళ్లయ్యాక ఆ సంగతి ఏంటో చూడాలి అని అనుకుంటాడు. అదే సమయంలో హిమ ఎందుకిలా మారిపోయింది? నిశ్చితార్థం నుంచి మాకు సమస్యలు మొదలయ్యాయి, నిశ్చితార్థం లాగా పెళ్లికి కూడా మధ్యలో లెగిసి వెళ్ళిపోతుందా? ఇంట్లో ఎవరికైనా చెప్పి హిమని హౌస్ అరెస్ట్ చేయాలి అని అనుకుంటాడు.
 

77

ఆ తర్వాత సీన్లో పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది అని హిమ బాధపడుతూ ఉండగా సౌందర్య హిమని వెళ్లి చీర కట్టుకోమంటుంది. ఇప్పుడు ఎందుకు నానమ్మ? అని హిమ అనగా సౌందర్య  నీకు ఏ ఆలోచనలు ఉన్నా అవి తీసేసి చెప్పింది చెయ్ అని గట్టిగా చెప్పి, చీర కట్టుకుంటే గుడికి బయలుదేరాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. అదే సమయంలో ప్రేమ్ అక్కడికి వచ్చి పెళ్లి పనులు అయిపోతున్నాయ? అని అడుగుతాడు.అప్పుడు హిమ బాధపడుతూ చాలా రోజులు ఉన్నాయనుకున్నాము ఆఖరికి అవి గంటల వరకు వచ్చాయి అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. అయితే రేపటి ఎపిసోడ్ లో ప్రేమ్, హిమ పెళ్లి చేసుకొని వస్తారని సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయ్ మరీ ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
నాగబాబు 'మేము కాప్‌లం' సిరీస్ షూటింగ్ లో మతిపోగొట్టే మ్యాటర్.. జస్ట్ 17 రోజుల్లోనే ఫినిష్, ఎలా సాధ్యమైంది ?
Recommended image2
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?
Recommended image3
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved