Actress Nandini: పర్సనల్ రీజన్స్, సీరియల్ హీరోయిన్ నందిని ఆత్మహత్య
Actress Nandini: సీరియల్ నటి నందిని బెంగళూరులోని ఒక పీజీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ ఒత్తిళ్లు, కెరీర్ సమస్యల కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

Nandini
టీవీ సీరియల్ నటి నందిని(27) బెంగళూరులో ఆత్మహత్య చేసుకుంది. కన్నడ, తమిళ సీరియల్స్ లో తనకంటూ గుర్తింపు సాధించిన ఆమె రీసెంట్ గా బెంగళూరు శివారులోని కెంగేరిలో ఉన్న ఒక పీజీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వ్యక్తిగత సమస్యలు, కెరీర్ ఒత్తిళ్లతో బాధపడుతున్న ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
విజయనగర జిల్లాలోని కొట్టూరుకు చెందిన నందిని గత కొన్ని సంవత్సరాలుగా బెంగళూరులో నివసిస్తోంది. నందిని ‘ నీనాడే నా’ సహా ప్రముఖ సీరియల్స్ లో నటించింది. తమిళ్ లో కళైంజర్ టీవీలో ప్రసారమౌతున్న సీరియల్ ‘గౌరీ’లో గౌరి పాత్రలో నటిస్తున్నారు. అయితే, ఆదివారం అర్థరాత్రి కెంగేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేట్ పీజీలో ఆమె ఆకస్మికంగా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. ఆమె మృతదేహాన్ని రాజరాజేశ్వరి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి, పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఆత్మహత్యకు కారణం ఏమిటి?
పోలీసు వర్గాల ప్రకారం, నందిని కొంతకాలంగా వ్యక్తిగత సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులే. అయితే, ఆమె తండ్రి మూడు, నాలుగు సంవత్సరాల క్రితం ఉద్యోగంలో ఉండగానే మరణించారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నందున, పెద్ద కుమార్తె అయిన నందినిని తండ్రి ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే, నటనపై ఆసక్తి ఉన్న నందినికి ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ఈ కుటుంబ ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఆమె సూసైడ్ లెటర్ కూడా రాసిందని, దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, నందిని మరణం.. తమిళ, కన్నడ టెలివిజన్ రంగానికి పెద్ద షాక్ గా మారింది.
అయితే.. గవర్నమెంట్ జాబ్ చేయమని తాము కూతురిని ఎలాంటి ఒత్తిడి చేయలేదని, ఆమెకు కోపం చాలా ఎక్కువ అని.. కోపం వస్తే ఒక్కోసారి మాతో మాట్లాడేది కూడా కాదు అని నందిని తల్లి చెబుతున్నారు.

