- Home
- Entertainment
- TV
- Gunde Ninda Gudi Gantalu: నా నుంచి ఏమైనా దాచిపెడుతున్నావా? రోహిణీని ప్రశ్నించిన మనోజ్, ప్రభావతిలోనూ అనుమానం
Gunde Ninda Gudi Gantalu: నా నుంచి ఏమైనా దాచిపెడుతున్నావా? రోహిణీని ప్రశ్నించిన మనోజ్, ప్రభావతిలోనూ అనుమానం
Gunde Ninda Gudi Gantalu: బాలు, మీనా కాంపిటీషన్ లో లక్ష రూపాయలు గెలిచినందుకు చాలా సంతోషిస్తూ ఉంటారు. వీళ్ల సంతోషాన్ని చూసి ప్రభావతి అసూయతో రగిలిపోతూ ఉంటుంది. మరి, నేటి ఎసిపోడ్ లో ఏం జరిగిందో టీవీ కంటే ముందుగా మీకోసం..

Gunde Ninda Gudi Gantalu
బాలు, మీనా ఇద్దరూ కలిసి తాము గెలిచిన చెక్ ని చూసుకొని మురిసిపోతూ ఉంటారు. అక్కడికి ప్రభావతి, రోహిణీ, మనోజ్ లు వస్తారు. మనోజ్ రావడం రావడమే.. ‘ గెలిచింది లక్ష రూపాయలే కోటి రూపాయలు అన్నట్లు మురిసిపోతున్నావ్’ అని అంటాడు. దానికి బాలు..‘ లక్షలు లక్షలు ఖర్చు పెట్టి నిన్ను డిగ్రీల మీద డిగ్రీలు చదివిస్తే.. నువ్వు సాధించింది ఏంట్రా? మళ్లీ నేను సాధిస్తే ఏడుస్తావేంటి?’ అని ప్రశ్నిస్తాడు. దానికి ప్రభావతి వెంటనే ‘ అవునవును..నీ లక్ష చూసి నిన్ను తొక్కేస్తున్నాం’ అని వెటకారంగా మాట్లాడుతుంది.దానికి బాలు‘ దీన్ని ఏమంటారు దుఖావతి..కడుపుమంట, అసూయ, ఈర్ష్య, చూడలేకపోతున్నారా’ అని ఏవేవో డైలాగులు కొడతాడు. అప్పుడే సత్యం ఇంట్లోకి వస్తాడు. అది చూసి మీనా.. ఆపేయమని మామయ్య గారు వచ్చారు అని చెబుతుంది. కానీ.. మనోజ్,బాలు మాత్రం ఆపరు. సెటైర్లు వేసుకుంటూనే ఉంటారు.‘ చూశావా నాన్న.. వీళ్లు ముగ్గురూ కలిసి నా మీద పడి ఏడుస్తున్నారు’ అని బాలు వాళ్ల నాన్నకు ఫిర్యాదు చేస్తాడు. దానికి సత్యం... ‘ వింటున్నాను రా.. వాళ్లు ఏడిపించిన దానికంటే.. నువ్వు ఏడిపించేదే ఎక్కువ ఉంది’ అని అంటాడు. దానికి బాలు..‘ ఓ అలా ఉందా.. కానీ ఒక్క రోజులో రూ.లక్ష సంపాదించడం గొప్పే కదా నాన్న’ అంటాడు. వెంటనే ప్రభావతి..‘ కష్టపడి సంపాదిస్తేనే గొప్ప’ అని అంటే.. ‘నీ దృష్టిలో కష్టపడి మింగినా కూడా గొప్పే కదా దుఖావతి’ అని బాలు సెటైర్ వేస్తాడు.‘ ఈ డబ్బు మా మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి ఇచ్చారు మామయ్య’ అని మీనా అంటే..‘ అది ఈ తల్లీ కొడుకులకు ఏం తెలుస్తుందమ్మా... భర్తను మోసం చేసే భార్య మీ అత్త.. భార్యను మోసం చేసే భర్త ఈ మనోజ్ గాడు’ అని సత్యం అంటాడు. ఆ మాటకు బాలు సంతోషించి.. మనోజ్ ని ఇంకో నాలుగు మాటలు అనేస్తాడు.సత్యం.. బాలు,మీనాలను తెగ పొగిడేస్తాడు. అది చూసి.. మనోజ్ బాగా కోపం వస్తుంది.
‘ మీకు ఏం తెలుసు నాన్న.. వాళ్లు ఏదో ఫ్రాడ్ చేసి గెలిచారు’ అని మనోజ్ అంటాడు. ‘ ఫ్రాడ్ పని అంటే ఏంటి’ అని బాలు అంటే.. ‘ ఈ ఇంట్లో దానికి అర్థం వాళ్లు మాత్రమే చెప్పగలరు. 40 లక్షలు, నగలు ఎత్తుకుపోయింది వాళ్లే కదా’ అని మీనా కూడా సెటైర్ వేస్తుంది. రోహిణీ కి కోపం వస్తుంది కానీ.. మీనా ఎక్కడా తగ్గదు.ఆ తర్వాత తాను మీనా కారణంగానే పోటీలో గెలిచాను అని బాలు గర్వంగా చెప్పుకుంటాడు.కానీ.. ‘ అక్కడ మార్కులు వేసేవాళ్లకు తెలివిలేనట్లుంది.. అందుకే మా సమాధానాలు అర్థం చేసుకోలేదు’ అని మనోజ్ అంటాడు. ‘ వాళ్లు గెలిచారు..నువ్వు మెచ్చుకోకపోయినా పర్వాలేదు, తక్కువ చేయద్దు’ అని సత్యం అంటే.. ‘ అయినా వాళ్లకు ఏం తెలుసు నాన్న.. వీళ్ల గురించి’అని మనోజ్ అంటే.. ‘ లక్ష గెలవగానే లక్షణమైన కాపురం అయిపోతుందా’ అని ప్రభావతి కూడా రాగాలు తీస్తుంది.‘ వీళ్లు వారానికి ఒకసారి గొడవ పడతారని వాళ్లకు తెలీదు కదా.. వీళ్లు ఆదర్శ జంట ఏంటి? మంచి జంట అంటే అండర్ స్టాండింగ్ ఉండాలి. మమ్మల్ని చూడండి.. మేం ఎప్పుడైనా గొడవ పడ్డామా’ అని మనోజ్ చాలా గొప్పగా చెబుతాడు. ‘ ఎలా గొడవ పడతారు రా..? నువ్వు ఎన్ని మింగినా పార్లరమ్మ భరిస్తూనే ఉంది..పుట్టింటి నుంచి తెచ్చి మరీ పోషిస్తోంది.. నువ్వు మింగిన వాటిని తానే మీద వేసుకొని మరీ భరిస్తోంది.. ఇంక నువ్వు ఎందుకు గొడవ పడతావ్.. ఇద్దరికి ఇద్దరు పెద్ద కేడీలు అని మార్కులు వేసి వాళ్లే చెప్పారు’ అని బాలు అంటాడు. ‘ చిన్న చిన్న గొడవలు పడితేనే భార్యభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు’ అని మీనా వంత పాడుతుంది. ‘ అలా చిన్న చిన్న గొడవలు పడకపోతే.. ఆ భర్త భార్య దగ్గర ఏదో రహస్యం దాస్తున్నారని అర్థం అంట. ఇలా గొడవలు పడి భార్యాభర్తలు ఏదో ఒక రోజు ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటే చచ్చినా క్షమించుకోలేరంట’ అని జడ్జ్ లు చెప్పిన విషయాలను బాలు చెబుతాడు. ఆ మాటలకు ప్రభావతిలో కూడా అనుమానం మొదలౌతుంది. రోహిణీ కంగారు పడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వెనకే ప్రభావతి కూడా వెళ్తుంది.
రోహిణీపై అనుమానం..
‘ఏమైంది?’ అని ప్రభావతి అడిగితే..ఏం కాలేదు అని రోహిణీ కవర్ చేయాలని చూస్తుంది. కానీ, ప్రభావతి వదిలిపెట్టదు. ‘ మీ ఇద్దరి మధ్యా గొడవలు లేవు అంటే.. మీ ఇద్దరి మధ్య దాపరికాలు ఉన్నట్లా? సీక్రెట్స్ ఉన్నట్లా? ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారా?’ అని ప్రభావతి అడుగుతుంది. దానికి‘ ఇంతకాలం మామయ్యతో కాపురం చేసిన మీరే చెప్పాలి. మాకు తెలీదు. వాళ్లు సగం ఇంగ్లీష్ లోనే మాట్లాడారు కాబట్టి.. వీళ్లకు అర్థమైంది వీళ్లు చెప్పారు’ అని రోహిణీ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ..ప్రభావతి మాత్రం దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది.
బాలుపై ప్రభావతి సెటైర్లు
ఇక.. తమ గెలుపును తండ్రితో బాలు పంచుకుంటాడు.అప్పుడే ప్రభావతి వచ్చి మళ్లీ సెటైర్లు వేయడం మొదలుపెడుతుంది.‘ డబ్బులు అకౌంట్ లో వేస్తారంట.. అవి పడగానే మా నాన్నకే ఇస్తాను’ అని బాలు అంటాడు. అయితే..సత్యం ఆ డబ్బులు తనకు వద్దు అని చెబుతాడు. కానీ, ప్రభావతి మాత్రం.. తన పెద్ద కొడుకు మనోజ్ నే మెచ్చుకుంటుంది. ఏరోజుకైనా మనోజ్ తనని విమానంలో తిప్పుతాడు అని గొప్పగా చెబుతుంది. తర్వాత.. మళ్లీ ఆ డబ్బుల ప్రస్తావన వస్తుంది.సత్యం మాత్రం.. తనకు ఆ డబ్బు వద్దు అని.. మీ కోసం రూమ్ కట్టుకోవాలి కదా అందుకు ఉపయోగించమని చెబుతాడు. సత్యం చెప్పిన దానికి బాలు, మీనా ఒకే అంటారు. ఆ లక్షతో ఎంత వరకు గదికి సరిపోతాయో లెక్కలు వేసుకుందాం అని బాలు అంటే..అలాగే గృహ ప్రవేశానికి దూడను తేవాలో..దున్నపోతు తేవాలో ఆలోచించుకోండి అని ప్రభావతి వెటకారంగా మాట్లాడుతుంది. దానికి బాలు..ఎందుకు..మనోజ్ ఉన్నాడుగా అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వాళ్లు వెళ్లగానే ప్రభావతి.. చాలా కౌంటర్లు వేస్తుంది.‘ లక్ష రూపాయలకే రూమ్ కట్టేస్తాడంట.. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉంది’ అని ప్రభావతి అంటే.. ‘ కారు కొన్నవాడు.. ఇంకో కారు కొన్నవాడు, స్కూటీ కొన్నవాడు.. రూమ్ కూడా కట్టగలడు’ అని సత్యం చాలా స్ట్రాంగ్ గా బాలు గురించి చెబుతాడు. పనిలో పనిగా మనోజ్ చేసిన దొంగతనాలన్నీ కూడా మాట్లాడి ప్రభావతి నోరు మూయిస్తాడు.
తర్వాత మనోజ్, ప్రభావతి దగ్గరకు వచ్చి.. మళ్లీ ఆ పోటీ గురించి మాట్లాడతాడు. మనోజ్ మాట్లాడిన మాటలకు ప్రభావతి తిడుతుంది. తెలివితేటలు లేవని తిట్టిపోస్తుంది. తర్వాత జడ్జ్ లు మాట్లాడిన విషయం గురించి ఆరా తీస్తుంది. ‘ భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉంటేనే వాళ్ల మధ్య గొడవలు రావు అని చెప్పారా’ అని అడుగుతుంది.‘ నువ్వు రోహిణీ దగ్గర ఏమైనా దాచిపెడుతున్నావా?’ అని అడుగుతుంది. మనోజ్ సమాధానం చెప్పకుండా తప్పించుకొని వెళ్లిపోతాడు.
నా దగ్గర ఏమైనా దాచావా?
రాత్రికి రోహిణీ నిద్రపోకుండా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. మనోజ్ వచ్చి ఏమైంది అని అడిగితే.. ‘ ఆ లక్ష మనం గెలవాల్సింది.. అనవసరంగా ఓడిపోయాం’ అని రోహిణీ చెబుతుంది. మరోసారి ప్రయత్నిద్దాం లే అని మనోజ్ అంటాడు. కానీ.. రోహిణీ మాత్రం..అందరూ బాలు, మీనా ని పొగుడుతున్నారు అని ఫీలౌతుంది.. మనోజ్.. మనమే గ్రేట్ అని చెబుతాడు.‘ నా లైఫ్ లో నాకు దొరికిన బెస్ట్ గిఫ్ట్ నువ్వు. నిన్ను ప్రేమించకముుందు..వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాను అని తెలిసినా నువ్వు పట్టించుకోలేదు.నాకు ప్రతి విషయంలోనూ తోడుగా ఉంటావు. నువ్వు నా బెస్ట్ వైఫ్’అని తెగ పొగిడేస్తాడు. ఇక.. రోహిణీ కూడా.. తనకు మనోజ్ బెస్ట్ లైఫ్ ఇచ్చావ్ అని.. మనిమిద్దరం బెస్ట్ కపుల్ అని చెబుతుంది.‘ భార్యభర్తల మధ్య గొడవలు ఉంటేనే అండర్ స్టాండింగ్ ఉంటుందని జడ్జ్ లు అన్నారు.. ఏమైనా దాచి పెడుతున్నావా’ అని మనోజ్ అడిగితే.. అలాంటిదేమీ లేదని రోహిణీ కవర్ చేస్తుంది. మనోజ్ కూడా నమ్మేస్తాడు.
ఇక రవి, శ్రుతి కూడా కాంపిటీషన్ లో ఓడిపోయినందుకు మాట్లాడుకుంటూ ఉంటారు.కానీ.. తప్పంతా రవిదే అని.. శ్రుతి తిడుతుంది. ఇద్దరు చాలా సేపు వాదించుకుంటూ ఉంటారు.ముఖ్యంగా రవి.. పిల్లల ప్రస్తావన తేవడంతో శ్రుతి కోపంతో ఊగిపోతుంది. రవి ఎంత నచ్చచెప్పాలని చూసినా శ్రుతి వినిపించుకోదు. శ్రుతి కోపం పోగొట్టడానికి రవి తనకు పిల్లలు వద్దు అంటే.. శ్రుతి రివర్స్ లో తనకు పిల్లలు కావాలి అని అంటుంది. ఆ సీన్ ఫన్నీగా ఉంటుంది.
ఇక బాలు, మీనా ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. కమింగప్ లో రోహిణీ తన కొడుక్కి బర్త్ డే కి డ్రెస్ కొంటూ.. ప్రభావతి ముందు దొరికేస్తుంది.

