- Home
- Entertainment
- TV
- Sridevi Drama Company: భోజనం పెట్టి మరీ, ఏడిపిస్తున్నారు కదరా.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల
Sridevi Drama Company: భోజనం పెట్టి మరీ, ఏడిపిస్తున్నారు కదరా.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల
రీల్ సిస్టర్స్ Vs రియల్ సిస్టర్స్ అనే కాన్సెప్ట్ సెలక్ట్ చేసుకున్నారు. ఎవరు ముందు రాఖీ కట్టాలి అనే విధంగా వారి మధ్య పోటీ అన్నట్లుగా ప్రోగ్రామ్ మొదలుపెట్టారు.

రాఖీ స్పెషల్ ప్రోగ్రామ్..
ఈ టీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కి చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. ప్రతి వారం ఏదో ఒక కంటెంట్ తో ఈ షో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటుంది. ఒక్కో వారం ఒక్కో కాన్సెప్ట్ సెలక్ట్ చేసుకుంటారు. దానిలో భాగంగానే కంటెస్టెంట్స్ మధ్య పోటీలు పెట్టడం, కొన్ని రకాల స్కిట్స్ వేయిండం, డ్యాన్సులు, ఆటలు, పాటలు అన్నీ ఉంటాయి. తాజాగా.. రాఖీ పండగ సందర్భంగా ‘ రాఖీ పండగ చేద్దామా’ అంటూ ప్రోమోని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.
రాఖీ ఎవరు ముందు కట్టాలి?
రీల్ సిస్టర్స్ Vs రియల్ సిస్టర్స్ అనే కాన్సెప్ట్ సెలక్ట్ చేసుకున్నారు. ఎవరు ముందు రాఖీ కట్టాలి అనే విధంగా వారి మధ్య పోటీ అన్నట్లుగా ప్రోగ్రామ్ మొదలుపెట్టారు. అయితే.. దీనికి చాలా మంది కంటెస్టెంట్ల రియల్ బ్రదర్స్, సిస్టర్స్ ని కూడా ఈ వెంట్ కి పిలిచారు. గెస్టులుగా యాంకర్ రవితో పాటు.. సీనియర్ నటుడు రాజీవ్ కనకాల, యంగ్ హీరోయిన్ వర్ష బొమ్మ, అవసరాల శ్రీనివాస్ కూడా వచ్చారు.
ఎమోషనల్ స్కిట్..
మొదట మొత్తం చాలా సరదాగా సాగింది. కావాలని.. హీరోయిన్ వర్ష బొమ్మ తో.. కొందరు కమెడియన్స్ కి రాఖీ కట్టించారు. ఆ తర్వాత.. అన్నా, చెల్లెళ్ల బంధాన్ని తెలియజేసేలా ఒక యాక్ట్ చూపించారు. నూకరాజు, వర్ష అన్నా చెల్లెళ్లుగా ఆ యాక్ట్ లో నటించారు. యాక్ట్ చివరిలో.. చెల్లెళ్లు క్యాన్సర్ తో చనిపోయినట్లు చూపించారు. అది చూసి అక్కడ ఉన్నవారందరూ కన్నీరు పెట్టుకున్నారు. ముఖ్యంగా రాజీవ్ కనకాల తన చెల్లెలు ని తలుచుకొని మరీ కన్నీరు పెట్టుకున్నారు.‘ ఎందుకయ్యా.. మంచి భోజనం పెట్టి, భోజనం తర్వాత ఇలా ఏడిపిస్తారు’ అంటూ రాజీవ్ కనకాల గారు మరింత ఏడ్చారు..
కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్..
ఆ తర్వాత..చనిపోయిన రాజీవ్ కనకాల చెల్లెలిని.. ఏఐ లో చూపించారు. ఆమె నిజంగా నడిచి వచ్చినట్లు.. రాజీవ్ చేతికి రాఖీ కట్టినట్లు, శుభాకాంక్షలు చెప్పినట్లు చూపించారు. అది చూసి ఆయన మరింత ఏడ్చారు. రాజీవ్ కనకాల చెల్లి.. కొంత కాలం క్రితం అనారోగ్య కారణాలతో చనిపోయారు. అందుకే.. ఆ స్కిట్ కి కూడా ఆయన ఎక్కువగా కనెక్ట్ అవ్వడం విశేషం. ప్రస్తుతం ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది.
అయితే, కామెంట్స్ లో ఆడియన్స్ మాత్రం.. రాజీవ్ కనకాల పై ఉన్న అభిమానాన్ని తెలియజేశారు. అతిథిగా పిలిచి.. వాళ్ల చెల్లిని ఏఐ లో చూపించి మరీ ఏడిపిస్తున్నారు అని కొందరు, ఆయన ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు అని మరి కొందరు కామెంట్స్ చేయడం గమనార్హం.