- Home
- Entertainment
- TV
- Kissik Talks: కర్మ ఎవరినీ వదిలిపెట్టదు, అమర్ దీప్ అలా.. కన్నీళ్లు పెట్టుకున్న రైతు బిడ్డ
Kissik Talks: కర్మ ఎవరినీ వదిలిపెట్టదు, అమర్ దీప్ అలా.. కన్నీళ్లు పెట్టుకున్న రైతు బిడ్డ
జబర్దస్త్ తో ఫేమస్ అయిన యాంకర్ వర్ష రీసెంట్ గానే ఈ కిస్సిక్ టాక్స్ మొదలుపెట్టింది. బుల్లితెర సెలబ్రెటీలు, పలువురు డైరెక్టర్లను ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్న వర్ష తాజాగా.. పల్లవీ ప్రశాంత్ ని ఇంటర్వ్యూ చేసింది.

పల్లవీ ప్రశాంత్ ఇంటర్వ్యూ
రైతు బిడ్డ అనగానే తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది పల్లవీ ప్రశాంత్. బిగ్ బాస్ సీజన్ 7 లో కామన్ మ్యాన్ గా.. అడుగుపెట్టి.. ఆఖరికి టైటిల్ సాధించాడు. సీనియర్ నటుడు శివాజీ సపోర్ట్ తో.. తన ఆటతీరుతో పల్లవీ ప్రశాంత్ అందరి మనసులు గెలుచుకున్నాడు. అయితే.. ఆయన విజయం తర్వాత గొడవలు, కాంట్రవర్సీలు చాలానే జరిగాయి. చాలా కాలం పాటు.. ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ఉండిపోయిన ప్రశాంత్ తాజాగా... కిస్సిక్ టాక్స్ లో ఇంటర్వ్యూతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
కిస్సిక్ టాక్స్..
జబర్దస్త్ తో ఫేమస్ అయిన యాంకర్ వర్ష రీసెంట్ గానే ఈ కిస్సిక్ టాక్స్ మొదలుపెట్టింది. బుల్లితెర సెలబ్రెటీలు, పలువురు డైరెక్టర్లను ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్న వర్ష తాజాగా.. పల్లవీ ప్రశాంత్ ని ఇంటర్వ్యూ చేసింది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఆ ప్రోమోలో కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు.
ఎవరు చేశారో ఆ భగవంతుడికే తెలుసు..
బిగ్ బాస్ టైటిల్ గెలిచి బయటకు వచ్చిన తర్వాత.. ఆయన అభిమానులు చాలా మంది.. ఇతర కంటెస్టెంట్లపై దారుణంగా దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో.. గెలిచిన సంతోషం కాసేపు కూడా ఉండనివ్వకుండా వెంటనే పోలీసులు ప్రశాంత్ ని అప్పుడు అరెస్టు చేశారు. ఈ సంఘటన అప్పుడు సంచలనం అయ్యింది. కాగా.. ఇదే విషయాన్ని వర్ష తన ఇంటర్వ్యూలో ప్రశ్నించింది. డైరెక్ట్ గా ఈ దాడులు మీరే చేయించారు అని అందరూ అనుకుంటున్నారు అని అడిగేసింది. ‘ఎవరు చేశారో ఎందుకు చేశారో ఆ భగవంతుడికే తెలుసు కానీ కర్మ ఎవరినీ వదిలిపెట్టదు’ అని ప్రశాంత్ సమాధానం ఇచ్చాడు.
అమర్ దీప్ తో బాండింగ్..?
ఇక... ‘ నేను ఎక్కిన కారు కూడా పగలకొట్టారు. వేరే అన్న కారులో నేను వెళ్తుంటే.. దాని అద్దాలు పీకి మా తమ్ముడి చేతిలో పెట్టారు.’ అని ప్రశాంత్ చెప్పాడు. ఇక ప్రస్తుతం అమర్ దీప్ తో మీ బాండింగ్ ఎలా ఉంది అని వర్ష అడగగా..‘ అన్నా.. ఆ పంచాయతీలు అన్నీ వదిలిపెట్టు.. మీరు చేసిర్రు అని నేను అనుకున్నా.. నేను చేసిర్రు అని మీరు అనుకున్నారు.. లవ్ యూ అన్నా’ అని చెప్పాడు. ఇక ఆ తర్వాత తన ఫ్యామిలీలో జరిగిన ఓ విషయాన్ని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. తాను, తన తమ్ముడు కలిసి వెళ్తుంటే కారుకు యాక్సిడెంట్ అయ్యిందని.. చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ వివరాలన్నీ తెలియాలంటే.. పూర్తి వీడియో వచ్చే వరకు ఆగాల్సిందే.అయితే..ప్రోమో కింద కామెంట్ల వర్షం మాత్రం కురుస్తోంది. చాలా మంది ప్రశాంత్ కి నెగిటివ్ గానే కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.
ఇక.. తాను అరెస్టు అయిన తర్వాత.. తన తండ్రి పోలీస్ స్టేషన్ బయట ఉన్న విషయాన్ని కూడా తలుచుకొని ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు.