MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Podarillu Today Episode మార్చి 16: చక్రి చెంప పగులగొట్టిన మహా, విడాకుల తీసుకునేందుకు సిద్ధం

Podarillu Today Episode మార్చి 16: చక్రి చెంప పగులగొట్టిన మహా, విడాకుల తీసుకునేందుకు సిద్ధం

Podarillu Today Episode మార్చి 16: పొదరిల్లు నేటి ఎపిసోడ్లో మహాలక్ష్మీ చక్రిని విడాకులు తీసుకుందామని చెబుతుంది. ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు చక్రి. ఇద్దరూ లాయర్ ఆఫీసుకు వెళతారు. ఇక రోజు పొదరిల్లు ఎసిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

3 Min read
Author : Haritha Chappa
Published : Mar 16 2026, 09:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మహాకు వదిన సలహా
Image Credit : Jio hotstar

మహాకు వదిన సలహా

పొదరిల్లు నేటి ఎపిసోడ్లో మహాలక్ష్మి తన వదిన హారికతో రెస్టారెంట్లో మాట్లాడుతూ ఉంటుంది. వారి మాటలు వినేందుకు సీక్రెట్ గా చక్రి ప్రయత్నిస్తాడు. హారిక మాట్లాడుతూ ‘నువ్వు ఆ ఇంట్లో సేఫ్ గానే ఉన్నావు కదా’ అని అడుగుతుంది. దానికి మహాలక్ష్మి ‘మన ఇంట్లో ఉండడం కన్నా ఈ మనుషుల మధ్య ఉండడమే చాలా సేఫ్ గా అనిపిస్తుంది’ అంటుంది.దానికి హారిక ‘నువ్వు చెప్పే దాన్ని బట్టి చూస్తే నువ్వు ఆ ఇంట్లోనే సెటిలైపోయేటట్టు ఉన్నావు, అది మీ దృష్టిలో పెళ్లి కాకపోవచ్చు. కానీ చట్టం దృష్టిలో అది నిజమైన పెళ్లి. వీలైనంత తొందరగా విడాకులు తీసుకోండి’ అని చెబుతుంది. ‘లీస్ స్టేషన్ లో పెళ్లి జరగాక ఎవరి దారిన వారు వెళ్ళిపోవచ్చు అనుకున్నాను.అయితే వెంటనే మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేసి మమ్మల్ని విడిపోవడానికి వీలు లేకుండా చేశారు.ఇప్పుడు ఏం చేయాలి వదిన’అంటుంది.అప్పుడు హారిక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విడాకులు తీసుకోమని చెబుతోంది. తర్వాత వాళ్ళిద్దరూ రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే చక్రి కూడా అక్కడ నేను రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్లిపోతాడు.

24
చక్రిని కొట్టిన మహా
Image Credit : Jio hotstar

చక్రిని కొట్టిన మహా

ఇక్కడి నుంచి సీన్ ఇంటికి మారుతుంది. రాత్రి చక్రి తో మహాలక్ష్మి విడాకుల విషయం మాట్లాడాలని పిలుస్తుంది. మహాలక్ష్మి మాట్లాడుతూ ‘వదినతో మాట్లాడాను మాట్లాడాక ఒక నిర్ణయం తీసుకున్నాను. మనకు జరిగింది నిజమైన పెళ్లి కాదు కదా మనం ఇంకా కలిసి ఉండడం మంచిది కాదు. మనం చట్ట ప్రకారం కూడా విడాకులు తీసుకుందాం అంటుంది మహాలక్ష్మి. దానికి చక్రి మాట్లాడుతూ ‘ఏ కారణం మీద విడాకులు ఇవ్వాలి, మీకు విడాకులు ఇవ్వాలన్న ఆలోచన నాకు లేదు. మీరు ఎన్నయినా చెప్పండి. మీ అవసరం కోసం మీరు తాళి కట్టించుకుంటారు నన్ను ఉపయోగించుకుంటారు. ఇప్పుడు విడాకులు కావాలంటారు. జీవితంలో ఎవరో ఒకరితో పెళ్లి జరగాలి నాకు జరిగింది. కాబట్టి నేను విడాకులు ఇవ్వను మీరు ఇంట్లోనే ఉండాలి. మనిద్దరం భార్యాభర్తలం అంతే’ అని అంటాడు. దాంతో మహాలక్ష్మీ చక్రిని చెంప మీ లాగి పెట్టి కొడుతుంది. అయితే ఇదంతా మహాలక్ష్మి కలలో జరుగుతుంది. ఆమె నిద్ర నుంచి సడన్ గా లేస్తుంది. ఇది కలా? అనుకుని చక్రితో మాట్లాడేందుకు వెళుతుంది.

Related Articles

Related image1
Guru Shukra Conjunction: గురు శుక్రుల కలయిక ఈ 4 రాశులకు డబ్బే డబ్బు, కొత్త జాబ్ కూడా
Related image2
Podarillu Today Episode మార్చి 13: చక్రి నుంచి విడాకులు అడిగిన మహా, గాయత్రికి పెళ్లి సెటిల్
34
విడాకులు అడిగిన మహా
Image Credit : Jio hotstar

విడాకులు అడిగిన మహా

ముగ్గురు అన్నదమ్ములు నిద్రపోతూ ఉంటే చక్రి మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. మహాలక్ష్మి వచ్చి చక్రిని బయటికి పిలుస్తుంది. మొన్న మీరు బయటకు తీసుకెళ్లారు కదా ఎక్కడికైనా బయటికి వెళ్దామా అని అడుగుతుంది. ఇద్దరూ బయటికి వెళ్తారు. మహాలక్ష్మి మాట్లాడుతూ ‘మన పెళ్లి ఎలా జరిగిందో మీకు గుర్తుంది కదా. నీకైనా నాకైనా నీ పెళ్లి ఇష్టం లేకుండా జరిగింది. నేను మా వదినను కలిసాను. మనము ఈ పెళ్లి నుంచి బయట పడదాము. మనం విడాకులు తీసుకుందాము. ఎవరి జీవితం వాళ్లు చూసుకుందాం’ అని చెబుతుంది. దీంతో చక్రి చాలా షాక్ అయిపోతాడు. మహాలక్ష్మి మనది ఒక ఫేక్ మ్యారేజ్.. కానీ అనుకోకుండా చట్టపరంగా మన మ్యారేజ్ రిజిస్టర్ అయింది, కనుక మనము చట్టపరంగానే విడాకులు తీసుకోవాలి.. నేను పూర్తిగా మీ ఇంటికి పరిమితం అయిపోయ్యే పరిస్థితులు ఎదురవుతున్నాయి, నేను నా పొజిషన్ వేరు. మా వదిన చెప్పేవరకు నేను బంధంలో ఇరుక్కుపోయానని అర్థం కాలేదు. రేపే మనం విడాకుల ప్రాసెస్ మొదలు పెడదాము అని చెబుతుంది మహాలక్ష్మి.

44
లాయర్ ఆఫీసుకు చక్రి, మహా
Image Credit : Jio hotstar

లాయర్ ఆఫీసుకు చక్రి, మహా

దానికి చక్రి మాట్లాడుతూ ‘నాకు ఇదే పని కదా. మీ పెళ్లి చెడగొట్టాలి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. మీకు నచ్చితే విడాకులు ఇవ్వాలి. నాకంటూ ఒక ఇష్టా ఇష్టాలు ఉండవా’ అని అడుగుతాడు. మహాలక్ష్మి పట్టించుకోకుండా ఇంటికి వెళ్దాం పదండి అని చక్రితో చెబుతుంది. ఇద్దరూ కారులో ఇంటికి బయలుదేరుతారు. ఉదయం అవ్వగానే మహాలక్ష్మి తయారై బయటికి వస్తుంది. చక్రి దుప్పటి కప్పుకొని చలికి వణుకుతూ కనిపిస్తాడు. ఎందుకలా ఉన్నారని అడుగుతుంది మహాలక్ష్మి. దానికి చక్రి భయమేస్తోంది అని చెబుతాడు.విడాకులు అడిగితే మీకెందుకు భయం అని అంటుంది. దానికి చక్రి మాట్లాడుతూ నీ మెడలో తాళి కట్టింది నేనే కదా.. అందుకే బాధపడుతున్నాను అని అంటాడు. తర్వాత లాయర్ దొరికాడా? ఎప్పుడు ప్రాసెస్ మొదలవుతుంది అని అడుగుతుంది. చక్రి ఏదో చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తాడు. చక్రి మాటలు విన్నాక మహాలక్ష్మి లాయర్ ను తానే వెతికి పెడతానని చెబుతుంది. మనకి పెళ్లయి మూడు నెలలు అవుతుంది. ఇంకా ఎక్కువ సమయం గడపకూడదు. త్వరగా విడాకులు తీసుకుంటే మీ జీవితంలో మీరు సెటిల్ అయిపోవచ్చు.. రేపు లాయర్ ని కలవడానికి వెళదామని చెబుతుంది మహాలక్ష్మి. ఇద్దరూ కలిసి లాయర్ ఆఫీస్ కి వెళ్లి కూర్చుంటారు. ఎపిసోడ్ ముగిసిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:దీపను ప్రశ్నించిన సుమిత్ర-దీపకు ప్రమాదం తప్పదన్న గురువు-షాక్‍లో దశరథ
Recommended image2
Oscar Awards 2026 : 98వ ఆస్కార్ అవార్డు విజేతలు వీరే.. ఎవరెవరిని వరించిందంటే?
Recommended image3
12 కోట్ల బంగ్లాలో తులసి కోట చాలా స్పెషల్, కాంతార హీరో ఇల్లు చూస్తే.. వావ్ అనాల్సిందే
Related Stories
Recommended image1
Guru Shukra Conjunction: గురు శుక్రుల కలయిక ఈ 4 రాశులకు డబ్బే డబ్బు, కొత్త జాబ్ కూడా
Recommended image2
Podarillu Today Episode మార్చి 13: చక్రి నుంచి విడాకులు అడిగిన మహా, గాయత్రికి పెళ్లి సెటిల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved