- Home
- Entertainment
- TV
- నవ్విస్తూనే.. ఏడిపించే అందమైన దెయ్యం కథ, 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా?
నవ్విస్తూనే.. ఏడిపించే అందమైన దెయ్యం కథ, 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా?
'సర్వం మాయ': 'సు ఫ్రమ్ సో' సినిమా లాగే హారర్ కామెడీ అంశాలతో వచ్చిన ఈ సినిమా, కన్నడలో మ్యాజిక్ చేసినట్లే, ఇప్పుడు మలయాళంలో 'సర్వం మాయ'గా విడుదలై పెద్ద సంచలనం సృష్టిస్తోంది.

సర్వం మాయ సంచలనం..
కన్నడ చిత్ర పరిశ్రమలో 'సు ఫ్రమ్ సో' హారర్ కామెడీతో ఎలా అలరించిందో, అదే విధంగా ఇప్పుడు మలయాళంలో 'సర్వం మాయ' అనే హారర్ కామెడీ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది.
భారీ విజయం సాధించిన సినిమా..
ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ నటించారు. ఈ సినిమాను నివిన్ పౌలీ గ్రాండ్ కమ్‌బ్యాక్‌గా చెప్పొచ్చు. చాలా ఏళ్ల తర్వాత ఈ నటుడికికు ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది. అద్భుతమైన కథా కథనంతో సౌత్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది సినిమా..
సర్వం మాయ నటీనటులు..
'సర్వం మాయ' సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ రోజున కేరళలో విడుదలైంది. ఈ చిత్రానికి అఖిల్ సత్యన్ కథ రాసి, దర్శకత్వం వహించారు. నివిన్‌తో పాటు అజు వర్గీస్, రియా షిబు, ప్రీతి ముకుందన్ నటించారు.
అందమైన దెయ్యం కథ
ఇది ఒక అందమైన దెయ్యం కథ. ఈ సినిమాలో దెయ్యం మిమ్మల్ని భయపెట్టదు, నవ్విస్తుంది. చివరకు కంటతడి పెట్టిస్తుంది. హీరో ప్రభేందు గిటారిస్ట్. అతని తండ్రి, అన్నయ్య పురోహితులు. కానీ అతనికి వాటిపై, దేవుడిపై నమ్మకం లేదు. తండ్రిపై కోపం. చివరికి అతని జీవితంలోకి దెయ్యం వస్తే ఏమవుతుంది?
గతం మర్చిపోయిన దెయ్యం..
ఈ చిత్రంలో రియా షిబు డెలూలుగా నటించింది. ఆమె దెయ్యంగా హీరో ప్రభేందు (నివిన్ పౌలీ) జీవితంలోకి వచ్చి ఎలాంటి మార్పులు తెస్తుందనేది కథ. ఈ అందమైన దెయ్యం తన గతాన్ని మర్చిపోతుంది. ఎలా చనిపోయి దెయ్యంగా మారిందో తెలియక తిరుగుతుంటుంది. చివరకు ఎలా ముక్తి పొందుతుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమా
సినిమా విడుదలై 10 రోజులైంది. ఈ పది రోజుల్లో కేరళలోనే కాక దేశ, విదేశాల్లో కలిపి రూ.100 కోట్లు వసూలు చేసింది. కేరళలో ప్రేక్షకులు డెలూలు ప్రేమలో పడ్డారు. ఇలాంటి అందమైన దెయ్యం తమ జీవితంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూడాలంటే ఈ సినిమా చూడాల్సిందే అంటున్నారు.

