- Home
- Entertainment
- TV
- ఓటీటీలో టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. `రానా నాయుడు 2`, `జాట్`, `టూరిస్ట్ ఫ్యామిలీ`, `హిట్ 3` రచ్చ
ఓటీటీలో టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. `రానా నాయుడు 2`, `జాట్`, `టూరిస్ట్ ఫ్యామిలీ`, `హిట్ 3` రచ్చ
ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాను ఓర్మాక్స్ మీడియా విడుదల చేసింది. `రానా నాయుడు 2`, `జాట్`, `టూరిస్ట్ ఫ్యామిలీ` చిత్రాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకుందాం.

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా
ఓటీటీ ప్రభావం క్రమంగా పెరుగుతుంది. ఇది థియేటర్ ఆడియెన్స్ పై ప్రభావం చూపిస్తుంది. థియేటర్‌కి వచ్చే ఆడియెన్స్ తగ్గిపోతున్నారు. దీనికితోడు ఇటీవల కొత్త సినిమాలు థియేటర్లో విడుదలైన 28 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్నాయి.
టికెట్ ఖర్చు, పార్కింగ్, స్నాక్స్ ఖర్చులతో థియేటర్‌కు వెళ్లడం కంటే ఇంట్లోనే కుటుంబంతో ఓటీటీలో సినిమా చూసేయొచ్చు అనుకుంటున్నారు. ఓర్మాక్స్ మీడియా విడుదల చేసిన సమాచారం ప్రకారం, జూన్ 9 నుండి 15 వరకు ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా చూద్దాం.
ఐదో స్థానంలో నాని `హిట్ 3`
ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాల్లో ఐదో స్థానంలో నాని నటించిన `హిట్ 3` ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా 33 లక్షల వ్యూస్ సాధించింది. రాజ్‌కుమార్ రావ్ నటించిన `భూల్ చుక్ మాఫ్` నాలుగో స్థానంలో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా 46 లక్షల వ్యూస్ సాధించింది.
దూసుకెళ్తున్న `టూరిస్ట్ ఫ్యామిలీ`
శశికుమార్ నటించిన `టూరిస్ట్ ఫ్యామిలీ` గత వారం నాలుగో స్థానంలో ఉండగా, ఈ వారం 53 లక్షల వ్యూస్ తో మూడో స్థానానికి చేరుకుంది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం థియేటర్లోనూ సంచలన విజయం సాధించింది.
సుమారు రూ.78కోట్లు వసూలు చేసింది సంచలనం సృష్టించింది. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కి ఈ స్థాయి వసూళ్లని రాబట్టడం విశేషం. అయితే థియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూ ఇది జోరు చూపిస్తోంది.
మొదటి రెండో స్థానాల్లో `జాట్`, `కేసరి 2`
ఇక మొదటి రెండు స్థానాల్లో హిందీ సినిమాలు ఉన్నాయి. రెండో స్థానంలో అక్షయ్ కుమార్ `కేసరి చాప్టర్ 2` (57 లక్షల వ్యూస్) ఉంది. ఈ మూవీ థియేటర్లలోనూ సత్తా చాటింది. డీసెంట్ కలెక్షన్లని వసూలు చేసింది. కానీ ఓటీటీలో మంచి ఆదరణ పొందుతోంది.
మొదటి స్థానంలో `జాట్` (63 లక్షల వ్యూస్) ఉంది. తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. సన్నీడియోల్ హీరోగా నటించారు. థియేటర్లలో ఇది వంద కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఇక ఓటీటీలోనూ రచ్చ చేస్తుందని చెప్పొచ్చు. గత వారమే ఇది నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.
వెబ్ సిరీస్‌లో `రానా నాయుడు సీజర్ 2` సత్తా
ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన వెబ్ సిరీస్ జాబితాలో అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్‌లో స్ట్రీమింగ్ అవుతున్న `గేమర్‌లాక్` 16 లక్షల వ్యూస్ తో ఐదో స్థానంలో ఉంది. `లఫాంగే` సిరీస్ 22 లక్షల వ్యూస్ తో నాలుగో స్థానంలో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న `ది ట్రెయిటర్స్` 27 లక్షల వ్యూస్ తో మూడో స్థానంలో ఉంది.
ఇక నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న రానా, వెంకటేష్ నటించిన `రానా నాయుడు సీజన్ 2` 32 లక్షల వ్యూస్ తో రెండో స్థానంలో ఉంది. జీయో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న `క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మేటర్` సిరీస్ 53 లక్షల వ్యూస్ తో మొదటి స్థానంలో ఉంది.