MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • థియేటర్లలో 100 రోజులు ఆడిన చిరంజీవి అట్టర్‌ ఫ్లాప్‌ మూవీ ఏంటో తెలుసా? ఆరేళ్లు తీస్తే నిండా ముంచిందా?

థియేటర్లలో 100 రోజులు ఆడిన చిరంజీవి అట్టర్‌ ఫ్లాప్‌ మూవీ ఏంటో తెలుసా? ఆరేళ్లు తీస్తే నిండా ముంచిందా?

మెగాస్టార్‌ చిరంజీవి తన కెరీర్‌లో ఒక మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రాణం పెట్టారు, కానీ అది డిజాస్టర్‌ ఫలితాన్ని చవిచూసింది. బట్‌ థియేటర్ లో మాత్రం వంద రోజులు ఆడటం విశేషం. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Jun 17 2025, 08:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వంద రోజులు ఆడిన చిరంజీవి డిజాస్టర్‌ మూవీ
Image Credit : Asianet News

వంద రోజులు ఆడిన చిరంజీవి డిజాస్టర్‌ మూవీ

మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్‌ చేసిన మూవీస్‌ ఉన్నాయి. అదే సమయంలో డిజాస్టర్లు కూడా ఉన్నాయి. కానీ ఓ మూవీ విషయంలో మాత్రం విచిత్రమైన అనుభవం ఎదురైంది.

చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన ఒక సినిమా డిజాస్టర్‌ రిజల్ట్ ని చవిచూసింది. కానీ ఇది థియేటర్లలో మాత్రం వంద రోజులు ఆడింది. మరి ఆ సినిమా ఏంటి? ఆ కథేంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
`అంజి` సినిమా కోసం ఎంతో కష్టపడ్డ చిరంజీవి
Image Credit : our own

`అంజి` సినిమా కోసం ఎంతో కష్టపడ్డ చిరంజీవి

చిరంజీవి తన జీవితంలో ఎక్కువ కష్టపడిన మూవీ `అంజి`. ఈ సినిమా కోసం ఆయన సుమారు ఆరేళ్లు టైమ్‌ కేటాయించారు. షూటింగ్‌ కోసం ఎంతో కష్టపడ్డాడు. కొన్నేళ్లపాటు ఒకే డ్రెస్‌ వేసుకుని షూటింగ్‌లో పాల్గొన్నారు. సుమారు రెండేళ్లపాటు చిత్ర క్లైమాక్స్ తీయడానికే పట్టింది.

 అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. చిరంజీవి పారితోషికం కూడా తీసుకోలేదు. అడ్వాన్స్ తప్ప, ఆ తర్వాత ఆయన రిలీజ్‌ వరకు పారితోషికం అడగలేదు, దాన్ని ప్రొడక్షన్‌ కోసం ఖర్చు చేయాలని తెలిపారు. అంతేకాదు ఐదేళ్లపాటు ఇతర సినిమాల డేట్స్ అడ్జస్ట్ చేసి ఈ చిత్రానికి కేటాయించారు.

Related Articles

Related image1
పవన్‌ కళ్యాణ్‌ కోసం మేకప్‌ లేకుండా నటించిన రేణు దేశాయ్‌.. ఆయనతో ఫేవరేట్‌ సీన్‌ వెల్లడించిన మాజీ భార్య
Related image2
బాలకృష్ణ నా ముందే నా భార్యకి ఫోన్‌ చేశాడు, మామూలోడు కాదు.. బాలయ్య రియాలిటీ బయటపెట్టిన నటుడు
36
తెలుగు సినిమాల్లోనే అత్యంత భారీ వీఎఫ్ఎక్స్ తో వచ్చిన `అంజి`
Image Credit : our own

తెలుగు సినిమాల్లోనే అత్యంత భారీ వీఎఫ్ఎక్స్ తో వచ్చిన `అంజి`

`అంజి` సినిమా అప్పట్లోనే భారీ వీఎఫ్‌ఎక్స్ తో రూపొందిన మూవీ. భారీ బడ్జెట్‌ మూవీ కూడా. తెలుగు సినిమాలోనే ఇదొక రికార్డుగా చెప్పొచ్చు. దర్శకుడు కోడి రామకృష్ణ విజన్‌కిది ప్రతిబింబం. శ్యాంప్రసాద్‌ రెడ్డి నిర్మించారు. 

ఈ మూవీని చిరంజీవి కోసమే చేశారు. శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి చిరంజీవితో ఓ మూవీ చేయాలనుకున్నారు. చిరంజీవి మంచి ఫాంటసీ మూవీ చేయాలనే ఆసక్తిని వెల్లడించారు. ఈ విషయాన్ని కోడిరామకృష్ణకి చెప్పారు. కానీ అప్పటికే కమర్షియల్‌ హీరోగా రాణిస్తున్న, ఆ విభాగంలో పీక్‌లో ఉన్న చిరంజీవికి ఇలాంటి సినిమా సెట్‌ అవుతుందా? అనే అనుమానం దర్శకుడిలో ఉంది. 

చిరంజీవితోనూ ఈ విషయాన్ని పంచుకున్నారు. కానీ మెగాస్టార్‌ తాను చేస్తానని చెప్పారు. దీంతో ఆయన కోసమే ఈ మూవీని రెడీ చేశారు దర్శకుడు కోడి రామకృష్ణ. అందుకే చిరు కూడా ఎంత కష్టమైనా, ఎన్ని రోజులు లేట్‌ అయినా ఈ మూవీ కోసం ప్రాణం పెట్టి పనిచేశారు.

46
షూటింగ్‌కే ఆరేళ్లు పట్టిన `అంజి`
Image Credit : print shot

షూటింగ్‌కే ఆరేళ్లు పట్టిన `అంజి`

వీఎఫ్‌ఎక్స్ వల్ల ఈ మూవీ షూటింగ్‌ డిలే అయ్యింది. ఆ గ్రాఫిక్స్ రావడానికి కూడా చాలా టైమ్‌ పట్టింది. హాలీవుడ్‌ స్టూడియోస్‌ ఈ మూవీ కోసం పనిచేశాయి. నిర్మాత శ్యాంప్రసాద్‌ రెడ్డి సైతం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించారు. చిరంజీవి ఫస్ట్ టైమ్‌ తమ బ్యానర్‌లో చేస్తున్న మూవీ కావడంతో ఆయన చాలా పర్సనల్‌గా తీసుకున్నారు. 

అందుకే ఖర్చు విషయంలోనూ రాజీపడలేదు. సుమారు రూ.25-30కోట్లు పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పట్లో ఇది హైయ్యెస్ట్ బడ్జెట్‌ మూవీ. ఇది పూర్తి కావడానికి ఆరేళ్లు పట్టింది. ఎట్టకేలకు 2004 జనవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

56
సంక్రాంతికి వచ్చి డిజాస్టర్‌గా నిలిచిన `అంజి`
Image Credit : print shot

సంక్రాంతికి వచ్చి డిజాస్టర్‌గా నిలిచిన `అంజి`

సంక్రాంతి సీజన్‌ కావడంతో భారీ సినిమాలున్నాయి. ఓ వైపు బాలయ్య `లక్ష్మీనరసింహ` చిత్రం ఉంది. మరోవైపు ప్రభాస్‌ `వర్షం` చిత్రం విడుదలైంది. ఆ నెక్ట్స్ డే `అంజి` విడుదలైంది.ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. కానీ మొదటి రోజుతోనే ఆ అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. 

మూవీ ఆడియెన్స్ ఆశించిన స్థాయిలో లేదు. దీంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్‌ అయ్యారు. మూవీ డిజాస్టర్‌గా మారిపోయింది. ముప్పై కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి బిజినెస్‌ కూడా బాగానే అయ్యింది. బయ్యర్లంతా నష్టపోవాల్సి వచ్చింది. 

కానీ ఈ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్ లో జాతీయ అవార్డు, రెండు నంది అవార్డులు వరించాయి. దర్శకుడు కోడి రామకృష్ణ మాత్రం దీన్ని తన కెరీర్‌లో బెస్ట్ మూవీగానే చెబుతారు. ఆడియెన్స్ కి నచ్చకపోయినా, టెక్నీకల్‌గా ఇదొక బ్రిలియంట్‌ ఫిల్మ్ అనేది ఆయన అభిప్రాయం.

66
కానీ ఆ థియేటర్ లో మాత్రం వంద రోజుల సెలబ్రేషన్‌
Image Credit : chiranjeevi

కానీ ఆ థియేటర్ లో మాత్రం వంద రోజుల సెలబ్రేషన్‌

డిజాస్టర్‌ ఫలితాన్ని చవిచూసిన `అంజి` చిత్రం థియేటర్‌లో మాత్రం వంద రోజులు ఆడటం విశేషం. ఇది చిరంజీవి ఫ్యాన్‌ బేస్‌కి, ఆయన ఇమేజ్‌కి, క్రేజ్‌కి నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ మూవీ నెల్లూరు రామరాజు థియేటర్లో వంద రోజులు ఆడింది. అక్కడ ఇది శతదినోత్సవం జరుపుకుంది. 

ఇలా `అంజి` మూవీ ఈ విషయంలో ఒక అరుదైన రికార్డుని సాధించిందని చెప్పొచ్చు. ఇక చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఇది కూడా సోషియో ఫాంటసీగా తెరకెక్కుతోంది. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. 

ఈ మూవీ కూడా భారీ వీఎఫ్‌ఎక్స్ తో రూపొందుతోంది. వాటి కారణంగానే డిలే అవుతుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది. వీఎఫ్‌ఎక్స్ విషయంలో టీమ్‌ సాటిస్ఫై అయితే గానీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించే అవకాశం లేదట. మరి ఆ డేట్‌ ఎప్పుడు వస్తుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kavya Kalyanram:కీరవాణి కొడుకుతో రిలేషన్ షిప్ కన్ఫర్మ్ చేసిన బలగం నటి.. తమ్ముడి సినిమా నుంచే మొదలైందా ?
Recommended image2
Veta Movie: చిరంజీవి పవర్‌ఫుల్‌ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా.. 40 ఏళ్ల తర్వాత మరోసారి వేట షురూ
Recommended image3
Agnipariksha: అగ్నిపరీక్ష కంటెస్టెంట్లు ఫైనల్‌.. బిగ్‌ బాస్‌ హౌజ్‌కి వెళ్లే కామనర్స్ వీళ్లే?
Related Stories
Recommended image1
పవన్‌ కళ్యాణ్‌ కోసం మేకప్‌ లేకుండా నటించిన రేణు దేశాయ్‌.. ఆయనతో ఫేవరేట్‌ సీన్‌ వెల్లడించిన మాజీ భార్య
Recommended image2
బాలకృష్ణ నా ముందే నా భార్యకి ఫోన్‌ చేశాడు, మామూలోడు కాదు.. బాలయ్య రియాలిటీ బయటపెట్టిన నటుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved