MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • TV
  • Brahmamudi: ఇందు ఎగ్జామ్ కు వెళ్తుందా? రాజు ల్యాప్ టాప్ అమ్ముతాడా?

Brahmamudi: ఇందు ఎగ్జామ్ కు వెళ్తుందా? రాజు ల్యాప్ టాప్ అమ్ముతాడా?

Brahmamudi: ఎగ్జామ్ వెళ్లేందుకు ఇందుకు టైం అవుతున్నా రేఖ ఇంట్లోనే ఉండటంతో వెళ్లలేకపోతుంది. దేవుడితో మాట్లాడుతూ తన కష్టాలను చెప్పుకుంటుంది. మరోవైపు రాజు ల్యాప్ టాప్ అమ్మేందుకు ప్రయత్నిస్తాడు. మరి ఇందు ఎగ్జామ్ కు వెళ్తుందా? రాజు ల్యాప్ టాప్ అమ్ముతాడా? 

3 Min read
Author : Nandini Arava
| Updated : Mar 06 2026, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
బ్రహ్మముడి
Image Credit : Jio Hotstar

బ్రహ్మముడి

ఆఫీసుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తమ్ముడు వెంకటేశ్వర్లును చూసి రాజు కొంత అసహనంగా మాట్లాడుతాడు. అదే సమయంలో తండ్రి అతనిని మందలిస్తూ, వాడు ఉద్యోగం చేసి ఇంటికి సహాయం చేస్తున్నాడు… నువ్వు మాత్రం ఏ పని చేయకుండా భూమికి భారంగా ఉండిపోయావని అంటాడు. దానికి రాజు తాను ఇన్వెస్ట్ మెంట్ అని చెబుతాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
కొడుకు బాగుపడాలని తండ్రి తిట్లు
Image Credit : Jio Hotstar

కొడుకు బాగుపడాలని తండ్రి తిట్లు

అయితే లాభాలు ఎప్పుడొస్తాయో అని తండ్రి అడిగిన ప్రశ్నకు…ఫ్యూచర్ లో వస్తాయని రాజు సమాధానమిస్తాడు. ఎంత తిట్టినా నువ్వు జన్మలో మారవంటూ తండ్రి రాజును తిడతాడు. అప్పు తీసుకుని మూడు సంవత్సరాలు తిరిగి చెల్లించకపోతే అది రద్దు అవుతుందనే తన వాదనను రాజు చెబుతాడు. కొడుకి మాటల్లో తెలివి కనిపిస్తోందని తల్లి లక్ష్మి సంతోషపడిపోతుంది. తండ్రి మాత్రం బిజినెస్ చేయడం ఇష్టం లేదని, తాను ఎలాంటి సహాయం చేయనని చెప్పేస్తాడు. తండ్రి మాటలకు చిరాకు పడి టిఫిన్ కూడా తినకుండా ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లిపోతాడు రాజు. రాజును తిడితే ఎందుకు అని లక్ష్మి తన భర్తపై కోపమవుతుంది.

Related Articles

Related image1
Hair Growth: ఎక్కువ ఖర్చు లేకుండా జుట్టు అందంగా పెరగాలా? ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ తింటే చాలు
Related image2
Gunde Ninda Gudi Gantalu: శివని కాపాడబోయి చిక్కుల్లో బాలు, బాలు అరెస్ట్, ఏడేళ్ల జైలు శిక్ష..?
37
ఎగ్జామ్ కు టైం అవుతున్నా వెళ్లలేక ఇందు ఇబ్బందులు
Image Credit : Jio Hotstar

ఎగ్జామ్ కు టైం అవుతున్నా వెళ్లలేక ఇందు ఇబ్బందులు

ఇదిలా ఉండగా మరోవైపు ఇంట్లో ఇందు వంట పనుల్లో బిజీగా ఉంటుంది. పరీక్ష సమయం దగ్గరపడుతున్నా వెళ్లే అవకాశం లేకపోవడంతో కంగారుపడుతుంది. రేఖ ఇంట్లో లేకపోతే తాను ఎగ్జామ్‌కు వెళ్లేదాన్ని కదా అని అనుకుంటుంది. ఈలోపు రేఖ, ఆమె భర్త భూషణ్ కూడా టిఫిన్ చేయడానికి కిందికి వస్తారు. డైనింగ్ టేబుల్ పై అప్పుల విషయంపై ఇద్దరి మధ్య చర్చ జరుగుతుంది. చక్రి దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమని అతను పదే పదే అడుగుతున్నాడని రేఖ చెప్తుంది. అతనితో మాట్లాడమని చెప్పినా భూషణ్ అతను వినే పరిస్థితిలో లేడని చెబుతాడు. వెంటనే రేఖ క్లబ్‌లో ఆడుతూ తీసుకున్న అప్పుల గురించి మాట్లాడుతూ భర్తను తిడుతుంది. అప్పుడే ఇందు దోశె తీసుకొస్తే రేఖ దాన్ని వద్దని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ కావాలని చెప్తుంది. ఎగ్జామ్ కు టైం అయిపోతున్నా ఇందు మళ్లీ కిచెన్‌లోకి వెళ్తుంది. 

47
ఒక పరీక్షకు బదులు మరో సబ్జెక్టు చదువుతూ అత్తకు దొరికిపోయిన ఐశ్వర్య
Image Credit : Jio Hotstar

ఒక పరీక్షకు బదులు మరో సబ్జెక్టు చదువుతూ అత్తకు దొరికిపోయిన ఐశ్వర్య

ఆస్తి సొంతం చేసుకునేందుకు హెల్ప్ చేస్తావని నిన్ను పెళ్లి చేసుకుంటే ఇప్పుడు భారంలా మారిపోయావని భర్తను రేఖను మందలిస్తుంది. ఎప్పుడు టైంకు వెళ్లే రేఖ వెళ్లకపోవడంతో ఇందు కంగారు పడుతుంది. ఇదిలా ఉండగా ఐశ్వర్యకు కూడా ఈరోజు పరీక్ష ఉందని గుర్తొచ్చిన ఇందు... ఆమెకు ఏం టిఫిన్ పెట్టాలని రేఖను అడుగుతుంది. ఐశ్వర్య ఇంకా పడుకునే ఉందని తెలిసి రేఖ కోపంగా ఆమె గదికి వెళుతుంది. అయితే అక్కడ ఐశ్వర్య చదువుతూ కనిపిస్తుంది. తెల్లవారే 3 గంటలకు లేచానని యోగా, జిమ్ చేసానని, సిలబస్ ముందే పూర్తి చేసేశానని, రివిజన్ చేస్తున్నానన ఐశ్వర్య చెబుతుంది. అంత ఇంటెలిజెంట్ అయితే పది బ్యాక్‌లాగ్‌ల సంగతేంటని రేఖ ప్రశ్నిస్తుంది. ఈరోజు ఒక ఎగ్జామ్ ఉంటే...మరో సబ్జెక్టు ఎలా చదువుతున్నాని ప్రశ్నించడంతో దొరికిపోతుంది. చివరకు త్వరగా రెడీ అయితే ఎగ్జామ్ హాల్ దగ్గర దించి ఆఫీసుకు వెళ్తానని రేఖ చెబుతుంది. 

57
పాత ల్యాప్ ట్యాప్ రాజు చావు తెలివితేటలు
Image Credit : Jio Hotstar

పాత ల్యాప్ ట్యాప్ రాజు చావు తెలివితేటలు

ఇంకోవైపు రాజు తన బైక్ దగ్గర ఫ్రెండ్‌తో మాట్లాడుతుంటాడు. లాప్‌టాప్ రిపేర్ చేశావా అని అడిగితే, దాన్ని అమ్మే ప్లాన్ చేస్తున్నానని చెబుతాడు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో రూ.50 వేలకు పెట్టానని, కొనేవారిని మాటలతో ఆకట్టుకోవాలని రాజు అంటాడు. కస్టమర్‌తో కలుసుకునేందుకు ఖరీదైన హోటల్ మిలాన్‌ను ఎంపిక చేస్తాడు. అలాంటి చోట కలిస్తే మన మాటలకు విలువ పెరుగుతుందని రాజు చెప్పడంతో ఫ్రెండ్ ఆశ్చర్యపోతాడు.

67
దేవుడి బాధలు చెప్పుకుంటున్న ఇందు
Image Credit : Jio Hotstar

దేవుడి బాధలు చెప్పుకుంటున్న ఇందు

ఇదే సమయంలో ఇందు దేవుడి ముందు తన బాధను చెప్పుకుంటుంది. ఐశ్వర్య చదవకపోయినా అన్నీ ఇచ్చి తనకు మాత్రం పరీక్ష రాసే అవకాశం కూడా రావడం లేదని బాధపడుతుంది. ఈ సమయంలో స్వాతి, అపర్ణ ఇద్దరూ ఇందుకు సహాయం చేయాలని ఒక చిన్న ప్లాన్ వేస్తారు.

స్వాతి తన డ్రెస్ స్టిచ్చింగ్ కు ఇవ్వాలనే పేరుతో ఇందును బయటకు పంపే ప్రయత్నం చేస్తుంది. భ్రమరాంబ ముందు ఇదంతా డ్రామా ప్లే చేస్తారు. 

77
ఇందు ఎగ్జామ్ రాస్తుందా?
Image Credit : Jio Hotstar

ఇందు ఎగ్జామ్ రాస్తుందా?

మరి ఈ ప్లాన్ నిజంగా వర్కవుట్ అవుతుందా? ఇందు ఎగ్జామ్‌కు వెళ్తుందా? రాజు తన తెలివితో లాప్‌టాప్‌ను ఎక్కువ ధరకు అమ్మగలడా? అన్న ఉత్కంఠతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
Hair Growth: ఎక్కువ ఖర్చు లేకుండా జుట్టు అందంగా పెరగాలా? ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ తింటే చాలు
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: శివని కాపాడబోయి చిక్కుల్లో బాలు, బాలు అరెస్ట్, ఏడేళ్ల జైలు శిక్ష..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved