MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • TV
  • Illu Illalu Pillalu: రైస్ మిల్లుకు ఇక రామరాజు పూర్తిగా దూరం, అధికారం వల్లి తండ్రి చేతుల్లోకి...

Illu Illalu Pillalu: రైస్ మిల్లుకు ఇక రామరాజు పూర్తిగా దూరం, అధికారం వల్లి తండ్రి చేతుల్లోకి...

 Illu Illalu Pillalu: రైస్ మిల్లును ఎలాగైనా దక్కించుకోవాలని భాగ్యం కుట్ర మీద కుట్రలు చేస్తూ ఉంటుంది.భార్య మాట కాదనలేక రామరాజు రైస్ మిల్లుకు బయలుదేరతాడు. మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం... 

3 Min read
Author : ramya Sridhar
Published : Mar 07 2026, 10:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ధీరజ్ కి ప్రేమ సలహా..
Image Credit : Jio Hotstar

ధీరజ్ కి ప్రేమ సలహా..

కారు కి ఫైనాన్స్ దొరకలేదని ధీరజ్ బాధపడుతూ ఉంటాడు. అయితే.. కారు కొనడానికి తన నగలు ఇస్తానని ప్రేమ చెబుతుంది. అయితే.. ఆ నగల కారణంగా ఇంట్లో చాలా సార్లు గొడవలు అయ్యాయని ధీరజ్ వద్దు అంటాడు. అయితే.. మామయ్య కాళ్ల మీద పడితే.. ఆయనే ఇస్తారు కదా అని ప్రేమ అంటుంది. తన తండ్రి కాళ్ల మీద పడటానికి తనకు ఎలాంటి సమస్యలేదని కాకపోతే.. తన తండ్రి దగ్గర డబ్బులు మాత్రం తీసుకోను అని చెప్పేస్తాడు. అయితే.. మీ అక్క భర్త షూరిటీ తీసుకోవచ్చు కదా అని ప్రేమ సలహా ఇస్తుంది.. ఆ సలహా ధీరజ్ కి బాగా నచ్చుతుంది. సలహా ఇచ్చినందుకు ప్రేమకు థ్యాంక్స్ చెబుతాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అధికారం ఇడ్లీ చేతికి..
Image Credit : Jio Hotstar

అధికారం ఇడ్లీ చేతికి..

మరోవైపు ఇడ్లీ బాబాయి... రామరాజు కుర్చీలో కూర్చొని బిల్డప్ కొడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి రామరాజు వస్తాడు. తండ్రి రావడం చూసి చందూ చాలా సంతోషిస్తాడు. ఎప్పటిలానే మీరు రైస్ మిల్లు చూసుకోండి నాన్న అని చందూ అనబోతుంటే.. వల్లీ.. ఉరుక్కుంటూ వచ్చేసి.. చెప్పనీకుండా ఆపుతుంది. చందూ వాళ్ల నాన్నకు బాధ్యతలు ఇస్తుంటే... వల్లీ ఇవ్వనివ్వదు. మామయ్య గారు.. కాసేపు సరదాగా గాలి పీల్చుకోవడానికి వచ్చారు అని వల్లి పుల్ల వేస్తుంది. ఆ మాట విని రామరాజు కూడా ఇబ్బంది పడతాడు. చందూ, వాళ్ల మామయ్య తిరుపతి.. రామరాజు ని రోజూ మిల్లు కు రావాలని.. రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ.. వల్లి మళ్లీ బాధ గాయం రేపుతుంది. ‘ అసలే మామయ్య అమూల్య పెళ్లి విషయం, సాగర్ ఉద్యోగం విషయంలో చాలా బాధగా ఉన్నారు. మిల్లుకు వచ్చేవారు అందరూ బియ్యం రేటు కాకుండా.. మీ చిన్న కూతురు ఇలా చేసింది అంటగా, మీ కొడుకు ఇలా చేశాడు అంటగా అని అంటారు. ఆ మాటలకు మామయ్య ఇంకా ఎక్కువ బాధ పడతారు’ అని వల్లి అంటుంది. వెంటనే రామరాజు.. కూడా అవును నేను రోజూ రైస్ మిల్లుకు రాను అని చెబుతాడు.

ఇక వెంటనే.. వల్లి తన ప్లాన్ అమలులో పెడుతుంది. తన తండ్రి క్యాష్ కౌంటర్ లో కూర్చొని బాధ్యతలు చూసుకుంటాడు అని రామరాజుని ఒప్పిస్తుంది. కాదు అనలేక... రామరాజు సరే అంటాడు. కానీ.. తన బావ కుర్చీలో వల్లి తండ్రి కూర్చోవడం తిరుపతికి నచ్చదు. వల్లి మాత్రం.. ఇక జన్మలో మామయ్య గారు మిల్లులో అడుగుపెట్టరు అని సంతోషపడుతుంది.

మరోవైపు.. ఆఫీసులో తన కొలిగ్స్ అన్న మాటలు తలుచుకొని నర్మద బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో అత్తగారు కూడా తనతో మాట్లాడకపోవడం తలుచుకొని ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్తుంది. నర్మద అలా ఏడుస్తూ రావడం ధీరజ్, ప్రేమ చూస్తారు. ఎందుకు ఏడుస్తున్నావ్? ఏమైంది అని ప్రేమ, ధీరజ్ అడిగితే నర్మద మరింత ఏడుస్తుంది. ఆఫీసులో తనకు జరిగిన అవమానం, అత్తయ్య మాట్లాడకపోవడం అన్నీ చెప్పి మరింత బాధపడుతుంది. ఆమెను ఓదార్చి ఇంటికి తీసుకువస్తారు.

34
రామరాజుని అవమానించిన భద్రావతి..
Image Credit : Jio hotstar

రామరాజుని అవమానించిన భద్రావతి..

ఇక రామరాజు.. తమ దగ్గర బియ్యం తీసుకునే వారి దగ్గర కలెక్షన్ షాపులకు వెళ్లి తిరుపతిని పరిచయం చేస్తూ ఉంటాడు. వాళ్లతో రామరాజు మాట్లాడుతున్న సమయంలో ప్రేమ తండ్రి అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి కావాలని రామరాజు పరువు తీస్తాడు. ముఖ్యంగా అమూల్య చేసిన పని, సాగర్ ఉద్యోగం విషయం మొత్తం అందరికీ చెప్పి.. రచ్చ రచ్చ చేస్తాడు. భద్రావతి కూడా వచ్చి మరింత దారుణంగా అవమానిస్తుంది.

44
నర్మద పై కోపంతో.. వల్లిపై వేదవతి ప్రేమ..
Image Credit : Jio Hotstar

నర్మద పై కోపంతో.. వల్లిపై వేదవతి ప్రేమ..

ఇక.. తాను చేసిన కుట్ర ఫలించినందుకు వల్లి ఆనందంలో మునిగి తేలుతుంది. ఎగురుకుంటూ ఇంటికి వస్తుంది. అయితే.. ఆమెను చూసిన అత్త వేదవతి.. మామయ్య గారు రైస్ మిల్లు వచ్చారా అని అడుగుతుంది. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు అని వల్లి అబద్ధాలు చెబుతుంది. తర్వాత.. నర్మద, ప్రేమ కోపం తెప్పించేలా వల్లి మాట్లాడుతుంది.అప్పుడే.. అక్కడికి నర్మద, ప్రేమ వస్తారు.. నర్మద.. ప్రేమగా అత్తయ్య మీతో మాట్లాడాలి అని అంటే.. వేదవతి తిట్టిన తిట్టకుండా తిడుతుంది. కావాలని.. వల్లి మీద ప్రేమ కురిపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది..

కమింగప్ లో.. నర్మద, వేదవతి లను కలపడానికి ప్రేమ, ధీరజ్ ప్లాన్ వేస్తారు. మరి కలుపుతారో లేదో చూడాలి..

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image3
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Related Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: రోహిణీని ముప్పు తిప్పలు పెట్టిన బాలు, గుణ కుట్రలో ఇరుక్కుపోయిన శివ
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: శివని కాపాడబోయి చిక్కుల్లో బాలు, బాలు అరెస్ట్, ఏడేళ్ల జైలు శిక్ష..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved