- Home
- Entertainment
- TV
- Podarillu Today Episode మార్చి 18: మహాకు షాకిచ్చిన చక్రి, ఇలా అయితే వారికి విడాకులు రావడం కష్టమే
Podarillu Today Episode మార్చి 18: మహాకు షాకిచ్చిన చక్రి, ఇలా అయితే వారికి విడాకులు రావడం కష్టమే
Podarillu Today Episode మార్చి 18: పొదరిల్లు నేటి ఎపిసోడ్లో చక్రి విడాకులు రాకుండా చేసేందుకు ప్లాన్ వేస్తాడు. విడాకులు రావని తెలిసి మహా షాక్ అవుతుంది. ఆధార్ కార్డు వల్ల విడాకులు కుదరవని చెబుతాడు లాయర్. ఇక పొదరిల్లు ఎసిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.

ఆధార్ కార్డు అడిగిన లాయర్
పొదరిల్లు నేటి ఎపిసోడ్ కథ మరింత ఉత్కంఠగా మారుతుంది. మార్చి 18 ఎపిసోడ్‌లో మహాలక్ష్మి, చక్రి మధ్య ఉన్న విడాకుల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇద్దరూ తమ సమస్యను ముగించుకోవాలని లాయర్ దగ్గరకు వెళ్లినా, అనూహ్యంగా పరిస్థితులు మారిపోతాయి. లాయర్ ఆధార్ కార్డు లేకుండా కేసు నమోదు చేయలేమని చెప్పడంతో మహాలక్ష్మి ఆశలు ఒక్కసారిగా కూలిపోతాయి. ఈ చిన్న అడ్డంకి పెద్ద సమస్యగా మారి, వారి జీవితాల్లో మరింత గందరగోళానికి దారి తీస్తుంది.
చక్రి పెద్ద ప్లాన్
ఈ పరిస్థితిని చక్రి మాత్రం తనకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. బయటకు చూస్తే అతను నిశ్శబ్దంగా ఉన్నట్టు కనిసిస్తాడు. లోపల మాత్రం ఓ ప్లాన్ సిద్ధం చేస్తాడు. ఒక కానిస్టేబుల్‌ను కలిసి విడాకులు ఆగిపోవడానికి సహాయం చేయమని కోరుతాడు. “మేము విడిపోవడం కాదు, మళ్లీ కలవాలి” అని చెప్పి అతడిని ఒప్పిస్తాడు. చక్రి మాటలు నమ్మిన కానిస్టేబుల్, వెంటనే మహాలక్ష్మికి ఫోన్ చేసి విడాకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తాడు. ఈ కాల్‌తో మహా పూర్తిగా షాక్‌కు గురవుతుంది. ఎవరు ఇలా చేస్తున్నారు? ఎందుకు అడ్డుకుంటున్నారు? అనే అనుమానాలు ఆమె మనసులో మొదలవుతాయి.
వదినతో మహా
ఇక మహాలక్ష్మి తన వదిన హారికకు ఫోన్ చేసి తన బాధను పంచుకుంటుంది. ఎక్కడికెళ్లినా ఆధార్ కార్డు అడుగుతున్నారని, తన పని ఎక్కడా పూర్తవడం లేదని చెబుతుంది. ఈ పరిస్థితుల్లో ఆమె చాలా ఫీల్ అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఉదయం లేచిన తర్వాత చక్రితో ఈ విషయాన్ని చెప్పగా, అతను మాత్రం తాను ఏమీ తెలియనట్టు నటిస్తాడు. ఈ వ్యవహారంలో చక్రి పాత్ర ఉందేమో అనే అనుమానం మహాకు కలుగుతుంది. కానీ ఆమెకు స్పష్టమైన ఆధారాలు లేకపోవడంతో మౌనంగా ఉండిపోతుంది.
వంట చేసిన మాధవ్
ఇక ఇంట్లోని ఇతర సన్నివేశాలు కూడా కథను ఆసక్తికరంగా మార్చుతాయి. మాధవ్ వంట చేస్తూ కుటుంబాన్ని కలిపే ప్రయత్నం చేస్తాడు. అందరూ కలిసి భోజనం చేసే సమయంలో బయటకు చూస్తే సంతోషంగా ఉన్నట్టు కనిపించినా, లోపల మాత్రం చక్రి, మహా మనసులో భావోద్వేగానికి గురవుతారు. మహా, చక్రి మధ్య ఉన్న దూరం ఇంకా తగ్గలేదు. కానీ చక్రి మాత్రం తన ప్రయత్నాన్ని ఆపడం లేదు. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో విడాకుల కథలో పెద్ద ట్విస్ట్ వచ్చిందని చెప్పాలి.

