MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Patas Praveen: ఫైమాతో లవ్‌ బ్రేకప్‌పై ఓపెన్‌ అయిన పటాస్‌ ప్రవీణ్‌.. దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్‌

Patas Praveen: ఫైమాతో లవ్‌ బ్రేకప్‌పై ఓపెన్‌ అయిన పటాస్‌ ప్రవీణ్‌.. దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్‌

జబర్దస్త్ లేడీ కమెడియన్‌ ఫైమాతో లవ్‌ బ్రేకప్‌పై స్పందించాడు పటాస్‌ ప్రవీణ్‌. జబర్దస్త్ వర్షతో ఓపెన్ గా చెప్పాడు. అయితే ప్రేమ సెట్‌ కానంత మాత్రాన విడిపోవాల్సిన పనిలేదన్నాడు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 31 2026, 06:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పటాస్‌ ప్రవీణ్‌తో ఫైమా లవ్‌ స్టోరీ
Image Credit : instagram/@patas_praveen_official

పటాస్‌ ప్రవీణ్‌తో ఫైమా లవ్‌ స్టోరీ

జబర్దస్త్ కమెడియన్లు పటాస్‌ ప్రవీణ్‌, ఫైమా ప్రేమించుకున్న విషయం తెలిసిందే. `పటాస్‌` ప్రోగ్రామ్‌ నుంచి వీరిద్దరు కలిసి జర్నీ చేశారు. జబర్దస్త్ లోకి వచ్చాక తమ మధ్య బాండింగ్‌ బాగా పెరిగింది. ప్రేమలో పడ్డారు. ఫైమా.. బిగ్‌ బాస్‌ షోలోకి వచ్చినప్పుడు కూడా ప్రవీణ్‌తో ప్రేమలో ఉన్నట్టు తెలిపింది. ఆయనతో పలు తీపిగుర్తులను గుర్తు చేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రవీణ్‌తో ఫైమా బ్రేకప్‌
Image Credit : instagram/@patas_praveen_official

ప్రవీణ్‌తో ఫైమా బ్రేకప్‌

బిగ్‌ బాస్‌ షో నుంచి బయటకు వెళ్లాక వీరిద్దరి మధ్య ఆ బాండింగ్‌ సరిగా లేదని తెలిసింది. ఆ తర్వాత కొన్ని రోజులకే వీరిద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నారనే వార్తలు వచ్చాయి. బ్రేకప్‌ కారణాలు తెలియకపోయినా, ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్‌ సమస్య ఉన్నట్టు తెలిసింది. ప్రవీణ్‌కి, తనకు వ్యక్తిగత సమస్యలున్నాయని, అవి బయటకు చెప్పుకోలేం అని, అందుకే దూరం కావాల్సి వచ్చిందని ఫైమా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తన వద్దకు వచ్చి పర్సనల్‌గా మాట్లాడితే బాగుండేదని ఫైమా చెప్పింది.

34
ఫైమాతో బ్రేకప్‌పై పటాస్‌ ప్రవీణ్‌ రియాక్షన్‌
Image Credit : instagram/@patas_praveen_official

ఫైమాతో బ్రేకప్‌పై పటాస్‌ ప్రవీణ్‌ రియాక్షన్‌

దీనిపై తాజాగా పటాస్‌ ప్రవీణ్‌ రియాక్ట్ అయ్యాడు. జబర్దస్త్ వర్ష నిర్వహిస్తున్న కిస్సిక్‌ టాక్‌ షోలో పాల్గొన్న ప్రవీణ్‌.. తన బ్రేకప్‌ గురించి నీకు కూడా తెలుసు అని చెప్పాడు. `నేను నిన్ను ఇష్టపడ్డాను, నువ్వు నన్ను ఇష్టపడు, పడకపో, నువ్వు ఒక క్లారిటీతో ఉన్నావు, నేను కూడా ఒక క్లారిటీతో ఉంటే అయిపోతుంది కదా. బెస్ట్ ఫ్రెండ్‌లా ఉండొచ్చు. మంచి సపోర్ట్ దొరుకుతుంది. నేను దానిమీదనే ఉన్నాను, ఇప్పుడు మేమిద్దరం బాగానే ఉన్నాం` అని తెలిపారు పటాస్‌ ప్రవీణ్‌. ఫైమాతో తాను బాగానే ఉన్నానని, కానీ తమ మధ్య ప్రేమ లేదని ఆయన చెప్పకనే చెప్పాడు.

44
వంశీతతో  పటాస్‌ ప్రవీణ్‌ మ్యారేజ్‌
Image Credit : instagram/@patas_praveen_official

వంశీతతో పటాస్‌ ప్రవీణ్‌ మ్యారేజ్‌

ప్రేమ స్నేహం నుంచే స్టార్ట్ అవుతుంది, ఫ్రెండ్‌ లవర్‌ అయినప్పుడు లవర్‌ ఫ్రెండ్‌ ఎందుకు కాకూడదు అని తెలిపారు ప్రవీణ్‌. అమ్మాయితో బ్రేకప్‌ అయ్యిందంటే ఆ అమ్మాయితో నీకు సెట్‌ కాదు అని దేవుడు హింట్‌ ఇస్తున్నట్టే లెక్క. అమ్మాయి మైండ్‌ సెట్‌, నీ మైండ్‌ సెట్‌ ఒక్కటి కాదు, విడిపోతేనే బెటర్‌ అని చెప్పినట్టు లెక్క. అలా అనుకుంటే అంతా హ్యాపీ అని తెలిపాడు ప్రవీణ్‌. ప్రస్తుతం ప్రవీణ్‌ జబర్దస్త్ షోతోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తూ బిజీగా ఉన్నాడు. అంతేకాదు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయట. ఇదిలా ఉంటే ఈ నెలలోనే ప్రవీణ్‌.. కడెం వంశితని పెళ్లి చేసుకున్నాడు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Related Stories
Recommended image1
Gayatri Gupta: వంద సార్లకుపైగా రేప్‌ అటెంప్ట్, సొంత తండ్రినే దారుణం.. నరకం చూసిన నటి
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved