MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • TV
  • Podarillu Today Episode మార్చి 13: చక్రి నుంచి విడాకులు అడిగిన మహా, గాయత్రికి పెళ్లి సెటిల్

Podarillu Today Episode మార్చి 13: చక్రి నుంచి విడాకులు అడిగిన మహా, గాయత్రికి పెళ్లి సెటిల్

Podarillu Today Episode మార్చి 13: పోలీస్ స్టేషన్ నుంచి అన్నదమ్ములంతా ఇంటికి చేరుతారు. ఇక గాయత్రికి పెళ్లి సెటిల్ అవుతుంది. మహా.. చక్రికి పెద్ధ షాక్ ఇస్తుంది. ఇక రోజు పొదరిల్లు ఎసిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

5 Min read
Author : Haritha Chappa
Published : Mar 13 2026, 10:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పురుషోత్తమ్ కి ఎస్ఐ వార్నింగ్
Image Credit : Jio hotstar

పురుషోత్తమ్ కి ఎస్ఐ వార్నింగ్

పొదరిల్లు నేటి ఎపిసోడ్ లో ఎస్ఐ.. పురుషోత్తమ్ ను బాగా తిడతాడు. పురుషోత్తం పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళతానని అడుగుతాడు. ‘ఎక్కడికి వెళ్తావు తప్పుడు కేసు పెట్టిన నిన్ను రక్షించాలా? మీ అమ్మాయి నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది. అసలు తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని నీ మీదే కేసు పెట్టాల్సింది. వేరే గొడవలు అడ్డుపెట్టుకొని మళ్ళీ ఆ ఫ్యామిలీ జోలికి వెళ్తే నువ్వు దుబాయ్ వెళ్ళకుండా వీసా సీజ్ చేస్తాను’ అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఎస్సై. తర్వాత పోలీసులు పురుషోత్తంలో స్టేషన్ నుంచి పంపించేస్తారు. ఇంటికి వచ్చిన పురుషోత్తం, తాయారు, రమణయ్య ముగ్గురు కూడా గాయత్రిని ఎంతో బాధ పెడతారు. తాయారు గాయత్రిని కొడుతుంది. పురుషోత్తం ‘ఆడపిల్లవి కాబట్టి బతికి పోయావు. ఆ పోలీసు అందరి ముందు నన్ను ఎన్నెన్ని మాటలు అన్నాడో తెలుసా. అందరి ముందు నా పరువు తీసి పడేసావ్. నాకు విలువ లేకుండా చేసావ్. నీకోసమా నేను ఎన్నాళ్లు కష్టపడ్డాను’ అంటూ గాయత్రిని తిడతాడు. తాయారు గాయత్రిని తిడుతూ ‘నీ పెళ్లి కోసం మీ నాన్న ఎంతో కష్టపడి దేశం కానీ దేశంలో డబ్బు కూడబెడితే నువ్వు వాడి వెనక తిరుగుతావాఈ’ అంటూ తిడుతుంది. ఈ లోపు పెళ్లివారు గాయత్రిని చూసుకునేందుకు వస్తారు. తాయారు ‘ఇప్పుడు పెళ్లి చూపులకు వచ్చి పెళ్లికి నీకు ఇష్టమే అన్నట్టు ఉండకపోయవనుకో ఆ మాధవ్ ని చంపేస్తా’ అని అంటుంది. తాయారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

మరోపక్క నారాయణ కత్తి నూరుతూ ఉంటాడు. ‘నా పెద్ద కొడుకుని కొట్టిస్తుందా? దాని సంగతి చెబుతాను’ అంటూ కత్తి నూరుతాడు. ఈలోపు నలుగురు కొడుకులు, మహా అక్కడికి వస్తారు. ఏం చేస్తున్నావని అడుగుతాడు చక్రి. ‘నా పెద్ద కొడుకుని కొట్టిన దాన్ని చంపేస్తాను’ అని అంటాడు. మమ్మల్ని వదిలేశారు కదా నువ్వు ఎందుకు వాళ్ళని చంపడం, మహాలక్ష్మి వల్లే మమ్మల్ని రిలీజ్ చేశారు అని మాధవ్ అంటాడు. దాంతో నారాయణ కూడా మహాను చాలా పొగిడేస్తాడు. ఇక మహా.. మాధవ్ కి దిష్టి తీసి బొట్టు పెట్టి ఇంట్లోకి వెళ్ళమని చెబుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గాయత్రి పెళ్లి సెటిల్
Image Credit : Jio hotstar

గాయత్రి పెళ్లి సెటిల్

గాయత్రిని చూడడానికి పెళ్లివారు వస్తారు. పురుషోత్తం వాళ్ళని ఇంట్లోకి తీసుకువెళతాడు.తాయారు వచ్చి అందరికీ టీలు ఇస్తుంది. తర్వాత గాయత్రి దగ్గరికి వెళ్లి మెడలో నెక్లెస్ వేసుకోమని చెబుతుంది. కానీ గాయత్రి వేసుకోవడానికి ఇష్టపడదు. గాయత్రిని పెళ్లివారి దగ్గరికి తీసుకొస్తుంది తాయారు. గాయత్రి పెళ్లి వారికి బాగా నచ్చేస్తుంది. రమణయ్య మాట్లాడుతూ ‘నా మేనకోడలికి అన్ని పనులు వచ్చు. వంట అద్భుతంగా చేస్తుంది’ అని పొగిడేస్తాడు. గాయత్రి సీరియస్ గా ఉండడంతో పెళ్లి కొడుకు తల్లి ‘అమ్మాయి ముఖంలో చిరునవ్వు కానీ, సిగ్గుపడడం కానీ ఏమీ లేవు.. ఆమెను ఈ పెళ్లి చూపుల్లో బలవంతంగా కూర్చొబెట్టారా’ అని అడుగుతుంది. ‘అదేమీ లేదు. ఆయన దుబాయిలో ఉన్నారు. ఇది కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. అందుకే కాసేపు ఇద్దరం ఒకరినొకరు పట్టుకొని ఏడ్చాము. అందుకే అలా ఉంది’ అని సర్ది చెబుతుంది తాయారు. తమ అమ్మాయి నచ్చిందో లేదో చెప్పమని అడుగుతుంది తాయారు. దానికి పెళ్ళికొడుకు నచ్చిందని చెబుతాడు. కాకపోతే మీ అమ్మాయి అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకోమని చెబుతాడు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. 

దానికి పురుషోత్తం మా అమ్మాయికి మేమెంత చెబితే అంత.. మా ఇష్టమే తన ఇష్టం అని అంటాడు. దానికి పెళ్ళికొడుకు ఆ మాట మీ అమ్మాయి నోటితో చెప్పించండి అని అంటాడు. కానీ గాయత్రికి బావా గుర్తొచ్చి అలా ఉండిపోతుంది. తర్వాత ఇష్టమే అని చెబుతుంది. దాంతో అందరూ సంతోషిస్తారు. మంచి ముహూర్తం చూసి మీకు కబురు చేస్తామని చెబుతాడు రమణయ్య. రెండు కుటుంబాలు వెంటనే తాంబూలాలు మార్చుకుంటాయి.

ఇక్కడి నుంచి సీన్ మాధవ్ ఇంటికి మారుతుంది. మహా నీళ్లు తెచ్చి మాధవ్ కి ఇస్తుంది. మహా మాట్లాడుతూ ‘పెద్ది ఈరోజు నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. అన్ని పనులు నేనే చూసుకుంటాను’ అని చెబుతుంది. అప్పుడు మాధవ్ థాంక్స్ చెబుతాడు. ‘ఇంతకాలం మా ఇంటిని పట్టించుకున్న వాళ్లే లేరు. మా ఇంటి మంచి చెడ్డలు ఎవరూ చూడలేదు. నువ్వు ఒక్కదానివే మా అందరి గురించి ఆలోచించి మమ్మల్ని విడిపించడానికి ప్రయత్నించావు. చివరికి సాధించావు. నిన్ను చూస్తుంటే ఓ పక్క సంతోషంగా.. మరో పక్క గర్వంగా ఉందమ్మా. ఇంటికి కోడలు వస్తే దీపం పెడుతుంది. కానీ నువ్వు మా ఇంటికి దీపానివి అయ్యావు’ అని అంటాడు. చక్రి మాట్లాడుతూ ‘మహా గారు మీరు గ్రేట్ అండి, చాలా గ్రేట్. మంచి పాయింట్ పట్టుకొని పోలీసులతో ఆడుకున్నారు’ అని అంటాడు. 

దానికి మహా ‘నేను కాదు గ్రేట్.. గాయత్రినే గ్రేట్. మీరు ఇంత తొందరగా బయటికి రావడానికి కారణం గాయత్రి. ఆమె పెద్దిని ఇష్టపడుతోంది.. వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి తను ఎంత కష్టపడుతుందో చెప్పడానికి వచ్చింది. అది తన తప్పేమీ కాదు’ అని అంటుంది మహా. దానికి చక్రి ‘ధైర్యం లేనప్పుడు ప్రేమించడం ఎందుకు? ఇంట్లో వాళ్ళని ఒప్పించలేనప్పుడు ప్రేమించకూడదు’ అని అంటాడు. మాధవ్ మాట్లాడుతూ ఇంకా ఆ విషయం గురించి మాట్లాడకండి అని సర్ది చెబుతాడు.

34
గాయత్రికి క్లాసు పీకిన మహా, నారాయణ
Image Credit : Jio hotstar

గాయత్రికి క్లాసు పీకిన మహా, నారాయణ

మహా ఫోన్ లో ఏదో వెతుకుతూ ఉంటుంది. అప్పుడే చక్రి వస్తాడు. మహా తన ఆధార్ కార్డు దొరకడం లేదని చెబుతుంది. దాంతో చక్రి విసిగిపోతాడు. ఈలోపు అక్కడికి గాయత్రి వస్తుంది. మాధవ్ బావ లేడా అని అడుగుతుంది. ‘నావల్ల బావ పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చింది’ అని అంటుంది గాయత్రి. దానికి మహా మాట్లాడుతూ ‘మాధవ్ బావ ఒక్కడే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడా.. అన్నదమ్ములు అందరూ వెళ్లారు. కాలేజీకి వెళ్లే కన్నా కూడా వెళ్ళాడు’ అని అంటుంది. గాయత్రి దానికి మాట్లాడుతూ ‘నన్ను క్షమించండి.. మా ఇంట్లో నాకు పెళ్లి చూపులు జరిగాయి. వాళ్లు కూడా వచ్చి చూసుకొని వెళ్లారు’ అని చెబుతుంది. 

దానికి మహా ‘మరి ఈ టైంలో ఎందుకు వచ్చావు? ఇది నీ మేనమామ ఇల్లు ఎప్పుడైనా రావచ్చు.. కానీ పరిస్థితులను బట్టి అర్థం చేసుకుని రావాలి. ఆరోజు కూడా నువ్వు రావడం వల్ల ఎంత పెద్ద సమస్య అయిందో తెలుసు కదా. పోలీసులు వీళ్లను తీసుకెళ్లారు. వీధంతా చూసారు. ఎంత పరువు తక్కువ? ఇన్ని సమస్యలు వస్తాయని తెలిసి కూడా ఇక్కడికి ఎందుకు వచ్చావు. మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకోవచ్చుగా’ అంటుంది మహా. దానికి గాయత్రి నాకు మా బావ అంటే ప్రాణం మర్చిపోలేకపోతున్నాను అని చెబుతుంది. దానికి మహా ‘పెళ్లి చూపుల్లో కూర్చున్నావు కదా అలాగే పెళ్లి పీటల పైన కూర్చో. వాళ్ళు పెళ్లి చేసేస్తారు. నిజానికి పెద్ది నీ నిర్ణయం కోసమే చూస్తున్నాడు. నువ్వు మీ పెద్దవాళ్ళని ఎదిరించి బయటికి వచ్చే ధైర్యం చేయడం లేదు. ఏది చేసినా ఈ సమయంలోనే చేయాలి. కేవలం ఇష్టం, ప్రేమ అని చెప్పుకొని తిరిగితే కుదరదు. నువ్వు ధైర్యం చేయకపోతే జీవితాంతం ఇద్దరూ బాధపడాలి. ప్రపంచంలో ఎవరికీ ఇష్టం లేని పెళ్లి చేసే హక్కు లేదు’ అంటుంది మహా. అది విని గాయత్రి నేను వెళ్ళిపోతున్నాను అని బయటికి రాబోతుంది. కానీ గుమ్మం దగ్గర నారాయణ నిల్చుని ఉంటాడు. 

నారాయణ మాట్లాడుతూ ‘ఇప్పుడు ఏడుస్తున్నావు.. ఇన్నాళ్లు ఏడ్చావ్.. నీకు నా కొడుకు కావాలా? ధైర్యం చెయ్. మిగతాదంతా నేను నా కొడుకులు, నా కోడలు పిల్ల చూసుకుంటాం. లేదంటే నీ కర్మ. నీకు దమ్ముంటే నా కొడుకు కావాలంటే ధైర్యంగా బయట గుమ్మం నుంచి వెళ్ళు. లేదంటే పిరికి దాన్ని అనుకుంటే ఈ దొడ్డిదారి నుంచి వెళ్ళు. మళ్లీ నీకు రావడానికి దారి ఉండదు. మూసుకుపోయి ఉంటుంది. తేల్చుకో’ అంటాడు. గాయత్రి దొడ్డిదారిలోంచి బయటికి వెళుతుంది.

44
చక్రిని విడాకులు అడిగిన మహా
Image Credit : Jio hostar

చక్రిని విడాకులు అడిగిన మహా

ఈ లోపు మహాకి ఫోన్ వస్తుంది. నాకు పనుంది వెళ్ళాలి అంటూ బయటికి వెళుతుంది. మహా క్యాబ్ రాగానే అందులో ఎక్కి వెళ్ళిపోతుంది. వెనకే చక్రి కూడా వెళ్తాడు. మహా ఒక రెస్టారెంట్ లో కూర్చుని తన వదినతో మాట్లాడుతుంది. ‘ఎందుకు మహా ఈ పెళ్లి చేసుకున్నావ్? నిజంగా నువ్వు చక్రిని ప్రేమిస్తున్నావా? చక్రిని ఎప్పుడు లవ్ చేసావ్? ఈ విషయం గురించి నాకెందుకు చెప్పలేదు’ అని అడుగుతుంది. అప్పుడు మహా మాట్లాడుతూ నేను ప్రేమించానని ఎప్పుడు చెప్పాను అంటూ జరిగిందంతా చెబుతుంది. ఇంకో ఆప్షన్ లేక చక్కని పెళ్లి చేసుకున్నానని, మాది బొమ్మల పెళ్లి అని అంటుంది మహా. మహాను వెతుక్కుంటూ వచ్చిన చక్రి వారిద్దరిని చూస్తాడు. మహా వదిన మాట్లాడుతూ ‘ఇదంతా ముందే ఎందుకు చెప్పలేదు’ అని అడుగుతుంది. దానికి మహా మీరు నాకు కనీసం చెప్పే అవకాశం ఇచ్చారా? నేను ఏ తప్పు చేయలేదని మీకు చెప్పే ప్రయత్నం చేసినా కూడా అవకాశం ఇవ్వలేదు కదా అని అంటుంది. నేటితో ఇక్కడ ఎపిసోడ్ ముగిసిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో మహా మాట్లాడుతూ చక్రిని విడాకులు తీసుకుందామని అడుగుతుంది. దీంతో చక్రి షాకవుతాడు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Related Stories
Recommended image1
Rotten Meat: రెస్టారెంట్లో మీరు తింటున్న మటన్ మంచిదేనా? 300 కిలోల కుళ్లిన మాంసం పట్టుకున్న పోలీసులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved