MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌, కంటెస్టెంట్లు వీరేనా.. సరికొత్త ట్విస్ట్ తో

Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌, కంటెస్టెంట్లు వీరేనా.. సరికొత్త ట్విస్ట్ తో

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌కి రంగం సిద్ధమైంది. తాజాగా ప్రోమో వచ్చింది. ఈ సారి బిగ్‌ బాస్‌ దశావతారం చూడబోతున్నారని నాగార్జున ప్రకటించారు. మరోవైపు ఈ సారి అదిరిపోయే ట్విస్ట్ లు ఉండబోతున్నాయట. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Jun 08 2026, 07:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బిగ్‌ బాస్‌ తెలుగు 10 కి రంగం సిద్ధం
Image Credit : x/@starmaa

బిగ్‌ బాస్‌ తెలుగు 10 కి రంగం సిద్ధం

బిగ్‌ బాస్‌ తెలుగు 10కి రంగం సిద్ధమవుతుంది. ఇప్పటి వరకు తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే. గత డిసెంబర్‌లో బిగ్‌ బాస్‌ తెలుగు 9 ముగిసింది. కామన్‌ మ్యాన్‌ కళ్యాణ్‌ పడాల టైటిల్‌ విన్నర్ అయ్యాడు. అగ్నిపరీక్ష ద్వారా వచ్చి ఆయన విజేతగా నిలవడం విశేషం. ఇక పదవ సీజన్‌కి సంబంధించిన ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో ఈ షో స్టార్ట్ కాబోతుంది. కానీ ఇప్పట్నుంచే దానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బిగ్‌ బాస్‌ తెలుగు 10 ప్రోమో సాంగ్‌ ఔట్‌
Image Credit : x/@starmaa

బిగ్‌ బాస్‌ తెలుగు 10 ప్రోమో సాంగ్‌ ఔట్‌

బిగ్‌ బాస్‌ షోకి సంబంధించి మొదటగా ఒక ప్రోమో వస్తుంది. షో ఎలా ఉండబోతుందనేది నాగార్జున వివరిస్తారు. షో పై హైప్‌ ఇచ్చేలా ఈ ప్రోమోని కట్‌ చేస్తారు. ఇది ప్రతి సీజన్‌కి డిఫరెంట్‌గా ప్లాన్‌ చేస్తున్నారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా క్రియేటివిటీ చూపిస్తున్నారు. ఈ సారి కూడా సరికొత్తగా ప్లాన్‌ చేశారు. తాజాగా ఈ ప్రోమో వచ్చింది. నాగార్జున మీదనే ఈ ప్రోమో సాంగ్‌ని డిజైన్‌ చేశారు. దీనికి ఆర్టిస్ట్, ర్యాప్‌ సింగర్‌ నోయల్‌ సాంగ్‌ కంపోజ్‌ చేయడం విశేషం. ర్యాప్‌ స్టయిల్‌లో ఈ సాంగ్‌ని డిజైన్‌ చేశారు. తాజాగా దీన్ని విడుదల చేశారు. బిగ్‌ బాస్‌ దశావతారం పేరుతో దీన్ని రిలీజ్‌ చేయడం విశేషం. 

36
బిగ్‌ బాస్‌ దశావతారం
Image Credit : x/@starmaa

బిగ్‌ బాస్‌ దశావతారం

ఇందులో నాగార్జున చెబుతూ, బిగ్‌ బాస్‌ ఎన్నో యుద్ధాల్ని గెలిచిన రాజ్యమే కాదు, ఎంతో మంది హృదయాల్ని గెల్చుకున్న మహా సామ్రాజ్యం. ఆ మహా సామ్రాజ్యం గురించి రూల్‌ చేసే నేను కాదు, లవ్‌ చేసే అభిమానులు చెబుతారు` అని నాగార్జున ఇంట్రో ఇచ్చారు. బిగ్‌ బాస్‌ తెలుగు 10 కోసం నోయల్‌ కంపోజ్‌ చేసిన సాంగ్‌ని చూపించారు. బిగ్‌ బాస్‌ స్పెషాలిటీని వివరిస్తూ ఈ పాట సాగింది. ఒత్తిడి రిలీఫ్‌ బిగ్‌ బాస్‌ అని, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ షో ఉంటుందని తెలిపారు. ఎండింగ్‌లో నాగ్‌ చెబుతూ, చెరగని ప్రస్థానం, తరగని అభిమానం బిగ్‌ బాస్‌ సొంతం, ఈ ప్రస్థానంలో ఇంకో కొత్త ఛాప్టర్‌కి సాక్ష్యం కాబోతుంది. ఈ సారి మీరు చూడబోయేది బిగ్‌ బాస్‌ దశావతారం. ఆటలో సవాల్‌ కాదు, ఆటే సవాల్‌` అని ముగించారు నాగార్జున. ఈ సీజన్‌పై ఆసక్తిని పెంచారు.

46
ప్రోమో సాంగ్‌పై నోయల్‌ కామెంట్‌
Image Credit : x/@starmaa

ప్రోమో సాంగ్‌పై నోయల్‌ కామెంట్‌

 ఇక ప్రోమో సాంగ్‌ని తాను కంపోజ్‌ చేసిన విషయాన్ని నోయల్‌ పంచుకున్నాడు. `బిగ్‌ బాస్‌ సీజన్‌ 10 అధికారిక ప్రోమో సాంగ్‌ని నేనే స్వరపరిచానని చెప్పడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. బిగ్‌ బాస్‌ ఏ సీజన్‌కైనా ఇదే మొదటి ప్రోమో సాంగ్‌ అనే నేను భావిస్తున్నాను. చాలా కాలం తర్వాత నాగార్జున, మొత్తం బిగ్‌ బాస్‌ టీమ్‌ని కలవడం ఆనందంగా ఉంది. ఇదొక మరువలేని క్షణం, ఈ అవకాశం ఇచ్చినందుకు టీమ్‌కి ధన్యవాదాలు` అని చెబుతూ, బిగ్‌ బాస్‌ టీమ్‌తో దిగిన ఫోటోలను పంచుకున్నారు నోయల్‌. ఇందులో నాగార్జున కూడా ఉన్నారు.

56
అగ్నిపరీక్ష సీజన్‌ 2 షురూ
Image Credit : x/@starmaa

అగ్నిపరీక్ష సీజన్‌ 2 షురూ

గత సీజన్‌ మాదిరిగానే ఈ సారి కూడా అగ్నిపరీక్ష నిర్వహించనున్నారని తెలుస్తోంది. సీజన్‌ 2 పేరుతో దీన్ని నిర్వహించబోతున్నారట. దీని ద్వారా కామన్‌ మ్యాన్‌ని ఎంపిక చేయనున్నారట. అయితే ఈ సారి కాస్త ఎక్కువ మందికి అవకాశం ఇచ్చే ఛాన్స్  ఉందని తెలుస్తోంది. లాస్ట్ టైమ్‌ ఏడుగురుకి ఛాన్స్ ఇచ్చారు. ఈ సారి ఆ సంఖ్య పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అగ్నిపరీక్ష సీజన్‌ 2కి శివాజీ, గీతా మాధురి, రాహుల్‌ సిప్లిగంజ్‌ జడ్జ్ లుగా వ్యవహరిస్తారని సమాచారం. అగ్నిపరీక్షకి సంబంధించిన ప్రకటన త్వరలో వస్తుంది, ఆ తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో నాలుగైదు లేయర్స్ లో ఫిల్టర్‌ చేస్తారు. చివరికి వారితో అగ్ని పరీక్ష నిర్వహించి, అందులోనుంచి కంటెస్టెంట్లని ఎంపిక చేస్తారు. మరి ఈ సారి ఎవరు వస్తారనేది చూడాలి.

66
సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరేనా?
Image Credit : x/@starmaa

సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరేనా?

ఇదిలా ఉంటే పదవ సీజన్‌లో బిగ్‌ బాస్‌ షోకి సెలబ్రిటీ విభాగంలో ఎవరు కంటెంస్టెంట్లుగా రాబోతున్నారనేది చూస్తే తేజస్విని గౌడ, శివకుమార్‌, ఈటీవీ ప్రభాకర్‌గానీ, ఆయన కొడుకు చంద్రహాస్‌గానీ వచ్చే అవకాశం ఉందట. అలాగే పల్లవి గౌడ, ఎక్స్ ప్రెస్‌ హరి, జబర్దస్త్ నూకరాజు, రాకింగ్‌ రాకేష్‌, నందూస్‌ వరల్డ్ నందూ, పండు మాస్టర్‌, ఆట సందీప్‌ భార్య జ్యోతి, రాయల్‌ మెక్‌ రమణ, వాసంతి కృష్ణన్‌ భర్త పవన్‌ కళ్యాణ్‌, రైటర్‌ కడలి సత్యనారాయణ, వంటి వారు రాబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిలో కొందరికి బిగ్‌ బాస్‌ టీమ్‌ నుంచి కాల్స్ వచ్చాయని, కొందరు ట్రై చేస్తున్నారని సమాచారం. మరి వీరిలో ఎంత మంది ఎంపిక అవుతారో చూడాలి. రెగ్యూలర్‌ షో మాత్రం సెప్టెంబర్‌ మొదటి వారంలోనే ప్రారంభం కానుందని సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shooting Deaths: షూటింగ్ స్పాట్‌లోనే ప్రాణాలు వదిలారు! కెమెరా ముందు జరిగిన 8 విషాదాలు
Recommended image2
Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?
Recommended image3
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Related Stories
Recommended image1
Sudigali Sudheer: తన హీరోయిన్‌ని పరిచయం చేసిన సుడిగాలి సుధీర్‌.. బిగ్‌ బాస్‌ బ్యూటీతో రొమాన్స్
Recommended image2
నయనతార సంసారంలోకి ఒకప్పటి ఐటెమ్‌ క్వీన్‌ ఎంట్రీ.. విఘ్నేశ్ శివన్‌ గురించి ఎమోషనల్‌ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved