నయనతార ఎంతో ఇష్టంగా చూసే టీవీ సీరియల్ ఏంటో తెలుసా?
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉండే హీరోయిన్ నయనతార. కాని ఎంత బిజీగా ఉన్నా ఆమె ఒక టీవీ సీరియల్‌ని ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ చేయకుండా చూస్తారని మీకు తెలుసా? ఇంతకీ ఎంటా సీరియల్.

బుల్లితెరపై సీరియల్స్ కు ప్రజల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. దీని కారణంగా వారంలో ఏడు రోజులు సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. ఎమోషన్స్ తో ఫ్యామిలీ ఆడియన్స ను ఆకర్షించడం అనే ఫార్ములాతోనే టెలివిజన్ మేకర్స్ అద్భుతమైన TRPలను సాధిస్తున్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం వరకు పొంగల్, దీపావళి వంటి పండుగ రోజులలో స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉండేవి. కాని ఇప్పుడు ఎంత పెద్ద పండగ వచ్చినా సీరియల్స్ ప్రసారం చేయడం మాత్రం మానడం లేదు. సీరియల్స్ కు డిమాండ్ అంతగా పెరిగింది.
బుల్లితెరపై సీరియల్స్ ఆడియన్స్ లో ఇంత విస్తృతంగా ప్రాచుర్యం పొందడానికి ప్రధాన కారణం వాటి స్క్రీన్ ప్లే, క్షణ క్షణం ఉత్కంఠ పుట్టించే విధంగా, ట్విస్ట్ ల మీద ట్విస్ట్ ఉండేలా వాటిని తెరకెక్కిస్తున్నారు. సినిమా లాగే సీరియల్స్ కూడా ఏం జరుగుతుందో అనే అంచనాను రేకెత్తించే స్క్రీన్ ప్లేతో ప్రసారం అవుతున్నాయి.
అందువల్ల పెద్దలు మాత్రమే కాకుండా పిల్లలు,యంగ్ స్టార్స్ కూడా సీరియల్స్ కు అలవాటుపడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సినిమా తారలు కూడా కొంతమంది సీరియల్స్ కు అలవాటు పడ్డారు.
స్టార్ హీరోయిన్ నయనతార కూడా టీవీ సీరియల్ చూడటానికి చాలా ఇష్టపడుతుంది. ఆమె ఏ సీరియల్ ను ఇష్టంగా చూస్తుందో తెలుసా? నయనతారకు ఇష్టమైన సీరియల్ కు సబంధించిన సమాచారం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
గత నాలుగు సంవత్సరాలుగా సన్ టీవీలో విజయవంతంగా ప్రసారం అవుతున్న కాయల్ సీరియల్ ను వదలకుండా చూస్తుందట నయనతార. సంజీవ్ - చైత్ర రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సీరియల్ నయనతారకు చాలా ఇష్టం.
నయనతార ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా కాయల్ సీరియల్ ను చూస్తుంది. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7.30 గంటలకు సన్ టీవీలో కాయల్ ప్రైమ్ టైమ్ సీరియల్ గా ప్రసారం అవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సీరియల్ TRP లో కూడా ముందంజలో ఉంది. నయనతార కాయల్ సీరియల్ చూడటానికి ఇష్టపడుతుందనే విషయం తెలిసి.. ఆ సీరియల్ టీమ్ కూడా ఎంతో సంతోషించారు.
ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే.. పెళ్లి తరువాత కూడా ఫుల్ బిజీగా ఉంది లేడీ సూపర్ స్టార్. ప్రస్తుతం ఆమె మూక్కుతి అమ్మన్' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. దీనితో పాటు, నయన్ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్'లో కూడా నటిస్తోంది. అంతే కాదు తెలుగులో ఆమె మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తోంది. వీటితో పాటు మలయాళంలో కూడా రెండు సినిమాల్లో నటిస్తోంది నయనతార.