MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • దళపతి విజయ్ కి సపోర్ట్ గా చిరంజీవి , జన నాయగన్ సినిమా లీక్ పై మెగాస్టార్ సంచనల కామెంట్స్..

దళపతి విజయ్ కి సపోర్ట్ గా చిరంజీవి , జన నాయగన్ సినిమా లీక్ పై మెగాస్టార్ సంచనల కామెంట్స్..

జన నాయగన్ సినిమా లీక్ వివాదంలో దళపతి విజయ్ కు సపోర్ట్ గా నిలిచారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ఈసినిమాకు సబంధించిన కీలక సన్నివేశాలు లీక్ అవ్వడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 11 2026, 07:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సినిమాలు వదిలి రాజకీయాల్లోకి విజయ్..
Image Credit : Asianet News

సినిమాలు వదిలి రాజకీయాల్లోకి విజయ్..

గత 30 ఏళ్లుగా తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు దళపతి విజయ్. ఇక సినిమాలను వదిలేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో 'జననాయగన్' తన చివరి సినిమా అని స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. కానీ సినిమా మాత్రం రిలీజ్ అవ్వలేదు. సెన్సార్ సమస్య వల్ల సినిమా రిలీజ్ అగిపోయినా.. రాజకీయ కారణాలు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బాలకృష్ణ సినిమాకు రీమేక్..
Image Credit : X/TVKCampaigns

బాలకృష్ణ సినిమాకు రీమేక్..

ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. ఇది బాలకృష్ణ హీరోగా తెలుగులో హిట్టయిన 'భగవంత్ కేసరి'కి రీమేక్. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విజయ్‌తో పాటు పూజా హెగ్డే, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, గౌతమ్ మీనన్, మమితా బైజు, నిరళ్గల్ రవి వంటి భారీ తారాగణం ఉంది. విజయ్‌కు ఇష్టమైన అనిరుధ్ సంగీతం అందించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటించారు.

Related Articles

Related image1
రాజమౌళి ని డిస్సపాయింట్ చేసిన చిరంజీవి సినిమా, రామ్ చరణ్ తో పూర్తి చేసిన జక్కన్న..
Related image2
Jananayagan Leak: దళపతి విజయ్ సినిమా మొత్తం ఔట్, జననాయగన్ లీక్ చేసింది ఎవరు? షాక్‌లో మూవీ టీమ్..
36
మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ..
Image Credit : Asianet News

మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ..

దళపతి విజయ్ నటించిన జన నాయగన్ సినిమా లీక్ వివాదం చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో సినీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిణామంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో స్పందిస్తూ.. చిరు ఓ పోస్ట్ పెట్టాడు.

46
సోషల్ మీడియాలో మెగాస్టార్ పోస్ట్..
Image Credit : Asianet News

సోషల్ మీడియాలో మెగాస్టార్ పోస్ట్..

సోషల్ మీడియాలో చిరంజీవి ఏమన్నారంటే..? '' సినిమా నిర్మాణం అనేది నమ్మకం, సమష్టి కృషి, ఎన్నో కలల సమాహారం.. ‘జన నాయగన్’ వంటి భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన సన్నివేశాలు లీక్ కావడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇలాంటి ఘటనలు ఒక సినిమాకే కాదు, మొత్తం చిత్ర పరిశ్రమపై ప్రభావం చూపుతాయి.ఈ తరహా లీకులు సృజనాత్మకతను దెబ్బతీసే ప్రమాదం ఉంది.సినిమా కోసం కష్టపడే వందలాది మంది శ్రమ వృథా కాకుండా ఉండేందుకు పైరసీని అరికట్టాల్సిన అవసరం ఉంది'' అని చిరంజీవి అన్నారు.

The unfortunate leak of #Jananayagan is something that deeply concerns me.
Cinema is built on trust, effort, and the collective dreams of many.

Such incidents affect all of us in the industry and remind us how crucial it is to protect our creative work.

We stand one with KVN…

— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2026

56
ఇండస్ట్రీ సీరియస్ గా తీసుకోవాలి
Image Credit : Facebook / chiranjeevi

ఇండస్ట్రీ సీరియస్ గా తీసుకోవాలి

మెగాస్టార్ ఇంకేమన్నారంటే? ''ఈ ఘటనను సినిమా ఇండస్ట్రీ అంతా చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఈ నష్టాన్ని తగ్గించేందుకు, బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు తమ పూర్తి సపోర్ట్  ఉంటుంది.సినీ పరిశ్రమలో ఉన్న ప్రతిఒక్కరూ సినిమాను గౌరవించి, పరిరక్షించేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. చివరగా, “పైరసీని చంపేద్దాం.. సినిమాను బతికిద్దాం” అంటూ తన సందేశాన్ని ముగించారు.

66
వాయిదా పడుతూ..
Image Credit : Sathiyam News, KVN Productions

వాయిదా పడుతూ..

ప్రస్తుతం ఈ లీక్ ఘటనపై సినీ వర్గాలు, అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి 'జననాయగన్' సినిమా గత ఏడాది దీపావళికే విడుదల కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఈ ఏడాది పొంగల్‌కి వాయిదా వేశారు. జనవరి 9న రిలీజ్ అని ప్రకటించడంతో టికెట్ బుకింగ్స్ కూడా జోరుగా సాగాయి. 

అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.కానీ సెన్సార్ సమస్య వల్ల రిలీజ్ ఆగిపోయింది. ఇక ఎలక్షన్ కోడ్ వల్ల రిలీజ్ అవుతుందో లేదో అన్న అనుమానంలో మూవీ టీమ్ ఉన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Recommended image2
Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Recommended image3
Bigg Boss 10 Mukesh Gowda: రిషిగా బుల్లితెరని ఊపేశాడు, ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌ షేక్‌.. ముఖేష్‌ గౌడ గ్రాండ్‌ ఎంట్రీ
Related Stories
Recommended image1
రాజమౌళి ని డిస్సపాయింట్ చేసిన చిరంజీవి సినిమా, రామ్ చరణ్ తో పూర్తి చేసిన జక్కన్న..
Recommended image2
Jananayagan Leak: దళపతి విజయ్ సినిమా మొత్తం ఔట్, జననాయగన్ లీక్ చేసింది ఎవరు? షాక్‌లో మూవీ టీమ్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved