MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • రాజమౌళి ని డిస్సపాయింట్ చేసిన చిరంజీవి సినిమా, రామ్ చరణ్ తో పూర్తి చేసిన జక్కన్న..

రాజమౌళి ని డిస్సపాయింట్ చేసిన చిరంజీవి సినిమా, రామ్ చరణ్ తో పూర్తి చేసిన జక్కన్న..

చిరంజీవికి పెద్ద అభిమాని స్టార్ డైరెక్టర్ రాజమౌళి. ఆయన సినిమాలో ఒక ఎమోషనల్ సీన్.. ఏడిపించి.. చివరకు డిస్సపాయింట్ చేసింది. దాంతో జక్కన్న రామ్ చరణ్ తో ఆసీన్ చేసి.. ఆ లోటును పూర్తి చేసుకున్నాడు. ఇంతకీ ఏంటా సినిమా? ఏంటా సీన్..?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 10 2026, 10:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చరిత్ర తిరగరాసిన దర్శకుడు..
Image Credit : SS Rajamouli\Twitter

చరిత్ర తిరగరాసిన దర్శకుడు..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గతంలో ఎవరికి పెద్దగా తెలియదు, బాలీవుడ్, కోలీవుడ్.. మన ఇండస్ట్రీని తక్కువ చేసి చూసేవారు. ఆ పరిస్థితిని బాహుబలి సినిమాతో మార్చి, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని దేశవ్యాప్తంగా పెంచి.. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గౌరవం తెచ్చిపెట్టిన దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి. 

ఆయన బాటలో నడిచి మరికొంత మంది దర్శకులు మన తెలుగు సినిమాకు వన్నెతెచ్చారు. పాన్ ఇండియా సినిమాలతో మన తెలుగు హీరోలు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని శాసిస్తున్నారు. ఇదంతా రాజమౌళి వల్లే సాధ్యం అయ్యింది. అంతే కాదు తెలుగు సినిమాకు మొదటి ఆస్కార్ సాధించిన ఘనత కూడా రాజమౌళిదే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాజమౌళిపై తెలుగు సినిమాల ప్రభావం..
Image Credit : Asianet News

రాజమౌళిపై తెలుగు సినిమాల ప్రభావం..

రాజమైళి చిన్నతనం నుంచి సినిమా వాతవరణంలో పెరిగారు. ఆయన మన తెలుగు దర్శకులు, నటీనటుల నుంచి చాలా నేర్చుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, తో పాటు తనకు ఎంతో ఇష్టమైన మహానటి సావిత్రి నటన, చిరంజీవి ఇండస్ట్రీలో ఎదిగిన విధానం.. ఆయన కృషి.. ఇలా రాజమౌళి ఎదుగుదలతో ఎంతో మంది ఇన్స్పిరేషన్ ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నుంచి రాజమౌళి చాలా నేర్చుకున్నారు. ఆయన సినిమాలంటే జక్కన్నకు చాలా ఇష్టం. మెగాస్టార్ గురించి చాలా సందర్భాల్లో రాజమౌళి గొప్పగా చెప్పారు. ఇక ఆయన సినిమాల గురించి మాట్లాడుతూ.. ఓ సారి ఎమోషనల్ అయ్యారు.

Related Articles

Related image1
Meena : 10 కోట్ల ఇల్లును 100 కోట్లకు అమ్మేసిన హీరోయిన్, మీనా మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా
Related image2
ఉప్పల్ బాలు నెల సంపాదన ఎంత? బంధువులు ఎందుకు వెలివేశారు? టిక్ టాక్ స్టార్ లో మార్పుకు కారణం ఎవరో తెలుసా?
35
చిరంజీవి సినిమా చూసి నిరాశచెందిన జక్కన్న
Image Credit : Asianet News

చిరంజీవి సినిమా చూసి నిరాశచెందిన జక్కన్న

చిరంజీవి సినిమా గురించి రాజమౌళి మాట్లాడుతూ.. '' నేను చిరంజీవిగారికి పెద్ద అభిమానిని. ఆయన సినిమాలన్నీ నేను చూశారు. ఓసారి కొండవీటి దొంగ సినిమా చూస్తున్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను. ఆ సినిమాలో మునిగిపోయి చూస్తున్నా.. కొన్ని సీన్స్ చూస్తూ ఏడ్చేస్తున్నా.. అందులో ఒక సన్నివేశం ఉంటుంది. హీరో కష్టంలో ఉంటే.. అతని గుర్రం వచ్చి కాపాడుతుంది. అప్పుడు ఆ సీన్ అంతటితో కట్ అయ్యింది. అది చూసి నేను చాలా డిస్సపాయింట్ అయ్యాను. అసలు అక్కడ గుర్రానికి.. హీరోకి మధ్య ఎమోషనల్ సీన్ ఉండాలి కదా'' అని జక్కన్న అన్నారు.

45
రామ్ చరణ్ తో పూర్తి చేసిన రాజమౌళి..
Image Credit : facebook.com/SSRajamouli

రామ్ చరణ్ తో పూర్తి చేసిన రాజమౌళి..

రాజమౌళి మాట్లాడుతూ.. '' కొండవీటి దొంగ సినిమాలో గుర్రం చావు నుంచి హీరోను కాపాడుుతంది. అప్పుడు గుర్రానికి, హీరోకి మధ్య ఎమోషనల్ సీన్ ఉండాలి కదా.. దానికి కృతజ్ఞత తెలపాలి కదా.. అక్కడ నేను చాలా డిస్సపాయింట్ అయ్యాను. అప్పటి నుంచి నా మనసులో అది ఉండిపోయింది. దాన్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని అనుకున్నాను. లక్కీగా రామ్ చరణ్ తో మగధీర సినిమా చాన్స్ వచ్చింది. అప్పుడు అలాంటి సీన్ ఇందులో పెట్టి.. గుర్రం రామ్ చరణ్ ను కాపాడగానే అతను దాన్ని ప్రేమగా నిమురుతూ.. కృతజ్ఞతలు తెలుపుతాడు.. అప్పుడు ఆ సీన్ కంప్లీట్ అయినట్టు అనిపించింది. '' అని రాజమౌళి అన్నారు.

55
మహేష్ బాబుతో వారణాసి బిజీలో జక్కన్న
Image Credit : youtube/@ScreenRantPlus

మహేష్ బాబుతో వారణాసి బిజీలో జక్కన్న

ఎంత ఘనత సాధించినా.. రాజమౌళి మాత్రం చాలా సింపుల్ గా, కూల్ గా కనిపిస్తుంటారు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘వారణాసి సినిమాను రూపొందిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కొనసాగతోంది. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి, అనుకున్న తేదీకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీ.. 2027 సమ్మర్ లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Recommended image2
Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసింది? షాకింగ్ నిజాలు
Recommended image3
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Related Stories
Recommended image1
Meena : 10 కోట్ల ఇల్లును 100 కోట్లకు అమ్మేసిన హీరోయిన్, మీనా మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా
Recommended image2
ఉప్పల్ బాలు నెల సంపాదన ఎంత? బంధువులు ఎందుకు వెలివేశారు? టిక్ టాక్ స్టార్ లో మార్పుకు కారణం ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved