MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jananayagan Leak: దళపతి విజయ్ సినిమా మొత్తం ఔట్, జననాయగన్ లీక్ చేసింది ఎవరు? షాక్‌లో మూవీ టీమ్..

Jananayagan Leak: దళపతి విజయ్ సినిమా మొత్తం ఔట్, జననాయగన్ లీక్ చేసింది ఎవరు? షాక్‌లో మూవీ టీమ్..

సౌత్ స్టార్ హీరో దళపతి  విజయ్ నటించిన 'జననాయగన్' సినిమా థియేటర్లలో రిలీజ్ కాకముందే పైరసీ సైట్లలో ప్రత్యక్షమవడం సంచలనం రేపుతోంది. ఈ సినిమా విడుదల కాకుండా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇంతకీ విషయం ఏంటంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 10 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
దళపతి విజయ్ రిటైర్మెంట్..
Image Credit : X

దళపతి విజయ్ రిటైర్మెంట్..

గత 30 ఏళ్లుగా తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న దళపతి విజయ్, పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో 'జననాయగన్' తన చివరి సినిమా అని స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. కానీ సినిమా మాత్రం రిలీజ్ అవ్వలేదు.. 

27
బాలకృష్ణ సినిమాకు రీమేక్..
Image Credit : instagram

బాలకృష్ణ సినిమాకు రీమేక్..

ఈ సినిమాకు హెచ్. వినోద్  దర్శకత్వం వహించారు. ఇది బాలకృష్ణ హీరోగా తెలుగులో హిట్టయిన 'భగవంత్ కేసరి'కి రీమేక్. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విజయ్‌తో పాటు పూజా హెగ్డే, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, గౌతమ్ మీనన్, మమితా బైజు, నిళల్గళ్ రవి వంటి భారీ తారాగణం ఉంది. విజయ్‌కు ఇష్టమైన అనిరుధ్ సంగీతం అందించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటించారు.

Related Articles

Related image1
Balakrishna : పొద్దు పొద్దున్నే 3 గంటలకు.. బాలయ్య బ్యాడ్ హ్యాబిట్, ఎందుకు మానలేకపోతున్నాడంటే?
Related image2
ఉప్పల్ బాలు నెల సంపాదన ఎంత? బంధువులు ఎందుకు వెలివేశారు? టిక్ టాక్ స్టార్ లో మార్పుకు కారణం ఎవరో తెలుసా?
37
రిలీజ్ కు ముందే సంచలనం..
Image Credit : KVN Productions

రిలీజ్ కు ముందే సంచలనం..

నిజానికి 'జననాయగన్' సినిమా గత ఏడాది దీపావళికే విడుదల కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఈ ఏడాది పొంగల్‌కి వాయిదా వేశారు. జనవరి 9న రిలీజ్ అని ప్రకటించడంతో టికెట్ బుకింగ్స్ కూడా జోరుగా సాగాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
47
సెన్సార్ బోర్డు రూపంలో సమస్య..
Image Credit : X

సెన్సార్ బోర్డు రూపంలో సమస్య..

అయితే ఎవరూ ఊహించని విధంగా సెన్సార్ బోర్డు రూపంలో సినిమా విడుదలకు అడ్డంకి ఏర్పడింది. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం జరగడంతో, చిత్రబృందం కోర్టును ఆశ్రయించింది. దీంతో సమస్య పెద్దదై, 'జననాయగన్' పొంగల్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కోర్టు విచారణను ఆలస్యం చేయడంతో, సినిమా ప్రాజెక్ట్ ఆగిపోయింది. చివరకు చిత్రబృందం కేసును వాపస్ తీసుకుని, మళ్లీ సెన్సార్ కోసం పంపింది. ఇంతలోనే ఎన్నికల తేదీలు రావడంతో సినిమా పూర్తిగా మూలనపడింది.
57
ఎన్నికల పనుల్లో బిజీగా దళపతి..
Image Credit : Facebook

ఎన్నికల పనుల్లో బిజీగా దళపతి..

ప్రస్తుతం విజయ్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే 'జననాయగన్' సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో సంతోషంగా ఉన్న అభిమానులకు షాక్ తగిలింది. ఎవరూ ఊహించని విధంగా, మొత్తం సినిమాను పైరసీ సైట్లలో అప్‌లోడ్ చేశారు. కొందరు ఆ వీడియోలను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.
67
ఎలా లీక్ అయింది..?
Image Credit : Film Scene

ఎలా లీక్ అయింది..?

దయచేసి 'జననాయగన్' సినిమా క్లిప్స్‌ను ఎవరూ షేర్ చేయవద్దని, మీరితే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని ప్రముఖ సినీ విమర్శకుడు ప్రశాంత్ 'ఎక్స్' (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు కేవలం సెన్సార్ బోర్డు సభ్యులు మాత్రమే చూసిన ఈ సినిమా మొత్తం ఎలా లీక్ అయిందనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇది విజయ్ రాజకీయ ప్రత్యర్థుల పనేనని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మరికొందరేమో, విజయే స్వయంగా దీన్ని లీక్ చేయించి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
77
500 కోట్ల భారీ బడ్జెట్‌తో..
Image Credit : KVN Productions

500 కోట్ల భారీ బడ్జెట్‌తో..

సినిమా మొత్తం లీక్ అవ్వడంతో, గతంలో విజయ్ 'తలైవా' సినిమాకు ఎదురైన పరిస్థితే 'జననాయగన్'కు కూడా వస్తుందేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 'తలైవా' సినిమా తమిళనాడులో రిలీజ్ కాకముందే పైరసీ సీడీల రూపంలో లీక్ అయింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి అదే ప్రధాన కారణమైంది. ఇప్పుడు 'జననాయగన్'కు కూడా అదే పరిస్థితి వస్తుందేమోనని భయపడుతున్నారు. ఈ సినిమాను సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించడం గమనార్హం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Fauji-Prabhas: `ఫౌజీ` మూవీ సెట్‌లో అగ్నిప్రమాదం, ప్రభాస్‌కి ఎలా ఉందంటే? ఇయర్‌ ఎండ్‌లో పండగే
Recommended image2
Karthika Deepam 2 Today Episode: దీప కోపం- కార్తీక్‍కి బిగ్ షాక్- తాళి చేతిలో పెట్టి కట్టమన్న జ్యో
Recommended image3
ఉప్పల్ బాలు నెల సంపాదన ఎంత? బంధువులు ఎందుకు వెలివేశారు? టిక్ టాక్ స్టార్ లో మార్పుకు కారణం ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Balakrishna : పొద్దు పొద్దున్నే 3 గంటలకు.. బాలయ్య బ్యాడ్ హ్యాబిట్, ఎందుకు మానలేకపోతున్నాడంటే?
Recommended image2
ఉప్పల్ బాలు నెల సంపాదన ఎంత? బంధువులు ఎందుకు వెలివేశారు? టిక్ టాక్ స్టార్ లో మార్పుకు కారణం ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved