- Home
- Entertainment
- TV
- నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టా, దారుణమైన అవమానాలు ఫేస్ చేశా.. మంచు విష్ణు ఎమోషనల్, `కన్నప్ప` సక్సెస్ నాన్న కోసం
నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టా, దారుణమైన అవమానాలు ఫేస్ చేశా.. మంచు విష్ణు ఎమోషనల్, `కన్నప్ప` సక్సెస్ నాన్న కోసం
`కన్నప్ప` సినిమా కోసం ఆస్తులు తాకట్టు పెట్టినట్టు తెలిపారు మంచు విష్ణు. సర్వస్వం పెట్టి ఈ చిత్రాన్ని చేశానని, ఈ సక్సెస్ చూస్తుంటే ఎమోషనల్‌గా ఉందన్నారు.

`కన్నప్ప` సక్సెస్‌పై మంచు విష్ణు ఎమోషనల్ కామెంట్
``కన్నప్ప` సినిమా కోసం నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టాను. నా పేరుతో ఉన్న అన్ని ఆస్తులు బ్యాంక్‌లో పెట్టి ఫైనాన్స్ చేశాను. దేవుడిపైనే భారం వేసి ఈ మూవీని చేశాను. సక్సెస్ కొట్టడం తప్ప నాకు మరో ఆప్షన్ లేదు.
ఇప్పుడు రిజల్ట్ ని చూస్తుంటే, ఆడియెన్స్ స్పందన చూస్తుంటే ఎమోషనల్‌గా ఉంది` అని అన్నారు మంచు విష్ణు. ఆయన కన్నప్పగా నటించిన చిత్రం `కన్నప్ప`. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు.
ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్, మోహన్ బాబు వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది.
ప్రభాస్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటాను
సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోన్న నేపథ్యంలో శనివారం సాయంత్రం థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది టీమ్. ఇందులో మంచు విష్ణు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
సక్సెస్‌ని, ఆడియెన్స్ నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే ఎలా అనిపిస్తుందనే ప్రశ్నకి ఆయన భావోద్వేగాలను ఆపుకోలేకపోయారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ, ఇదంతా శివుడి ఆశిస్సుల వల్లే, శివలీల వల్లే సాధ్యమైందన్నారు.
ఆడియెన్స్ ఆశీర్వాదం వల్లే సాధ్యమైందని తెలిపారు. అంతేకాదు ప్రభాస్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. ఆయన ఎంట్రీ కంటే ముందే సినిమా లేచిందని, ఆయన ఎంట్రీతో సినిమా మరో స్థాయికి వెళ్లిందన్నారు.
ఎన్నో అవమానాలు ఫేస్ చేశాను
ఈ సందర్భంగా మరికొన్ని ఎమోషనల్ విషయాలను పంచుకున్నారు మంచు విష్ణు. చాలా కాలంగా తమకు సక్సెస్ లేదని, ఈ క్రమంలో అనేక అవమానాలు ఫేస్ చేసినట్టు తెలిపారు.
ట్రోల్స్, అవమానాలను ఫేస్ చేస్తూ ఇన్నాళ్లు వచ్చామని, వాటి అన్నింటికి `కన్నప్ప` సమాధానం చెప్పాలని తాము భావించినట్టు తెలిపారు.
ఓ వైపు సినిమా ప్రెజర్, మరోవైపు ఫైనాన్షియల్ ప్రెజర్, ఫ్యామిలీ ప్రెజర్, ఈ మూవీని తాను తీయగలనా అనే డౌట్, ఇలా నా కాళ్లకి వెయ్యి కేజీల బరువు కట్టేసి ఇప్పుడు పరిగెత్తు అన్నట్టుగా ఈ మూవీ జర్నీ సాగిందని,
తన ప్రెజర్‌ని చివరికి తన వైఫ్ కూడా పంచుకుందని, నా పరిస్థితిని, మా పరిస్థితిని చూసి వాళ్లంతా ఎమోషనల్ అయ్యారని, ఇప్పుడు ఈ స్పందన చూస్తూంటే కన్నీళ్లు ఆగడం లేదన్నారు మంచు విష్ణు.
`కన్నప్ప` సినిమా కోసం ఆస్తులన్నీ తాకట్టు పెట్టాను
రామ్‌గోపాల్ వర్మ పెట్టిన మెసేజ్‌కి కన్నీళ్లు వచ్చేశాయని తెలిపారు. ఇది నిజమేనా అనే నమ్మకం కలగడం లేదని, ఇది నిజమని నమ్మడానికి తనకు రెండు రోజులు పట్టిందన్నారు. అయితే ఈ మూవీ కోసం తనకు ఉన్నదంతా పెట్టేసినట్టు తెలిపారు మంచు విష్ణు.
తనపేరుతో ఉన్న ఆస్తులన్నీ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి ఫైనాన్స్ తీసుకున్నట్టు తెలిపారు. సర్వస్వం పెట్టి ఈ మూవీ చేశాను. తనకు హిట్ కొట్టడం తప్ప మరో ఆప్షన్ లేని స్థితిలో ఈ మూవీ చేసినట్టు తెలిపారు మంచు విష్ణు.
ఈ మూవీ ఆడకపోతే ఏంటి? అనే టెన్షన్ కూడా ఉందని, ప్రభుదేవగారు ఫోన్ చేసి ధైర్యం చెప్పారని, నాన్నగారిని బాగా చూసుకో అని చెప్పారని, 99.9శాతం హిట్ కొడుతున్నాం.
ఆ జీరో పాయింట్ వన్ శాతం దేవుడికి వదిలేయమన్నారు. ఆ స్థితిలో `కన్నప్ప`కి వస్తోన్న స్పందన, ఈ సక్సెస్ కొండంత ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చిందన్నారు మంచు విష్ణు.
`కన్నప్ప` నటుడిగా నాకొక విజిటింగ్ కార్డ్
`నా నటన గురించి ఇప్పటి వరకు `ఢీ` టైమ్‌లో బాగా చేశారని అన్నారు. ఆ తర్వాత రామ్‌గోపాల్ వర్మ మూవీ సమయంలో ప్రశంసలు వచ్చాయి. కానీ నేను బాగా చేస్తాను, ఇదిగో నేను అని నిరూపించడానికి `కన్నప్ప` నాకు ఒక విజిటింగ్ కార్డ్ లా ఉపయోగపడుతుంది.
ఇకపై ఈ మూవీని చూపిస్తాన`ని తెలిపారు మంచు విష్ణు. అదే సమయంలో తమకు చాలా ఏళ్లుగా సక్సెస్ లేదని, ఆ విషయంలో నాన్న(మోహన్ బాబు) కూడా ఎంతో మదన పడ్డారని, ఈ సక్సెస్ నాన్నకోసమని, ఈ విజయం నాన్నది అని ఎమోషనల్‌గా చెప్పారు మంచు విష్ణు.
ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందనే ముఖ్యం కాదు, ఎంత మందికి `కన్నప్ప` కథ రీచ్ అవుతుందనేది తనకు ముఖ్యమన్నారు. ఇప్పటి వరకు పదిహేను లక్షల టికెట్లు సేల్ అయినట్టు తెలిపారు మంచు విష్ణు. ఇది ఇంకా పెరుగుతుందని చెప్పారు.