- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: జ్యోకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పారు- జ్యో, పారుల మధ్య మొదలైన యుద్ధం
Karthika Deepam 2 Today Episode: జ్యోకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పారు- జ్యో, పారుల మధ్య మొదలైన యుద్ధం
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఏప్రిల్ 9వ తేదీ)లో తాను కార్తీక్ భార్యను అని పూజారితో చెప్పిన జ్యో. దీపను తీసుకొని గుడికి వచ్చి జ్యోకు షాకిచ్చిన పారు. దీప జోలికి రావద్దని జ్యోకు పారు వార్నింగ్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో జ్యోత్స్నను గుడికి తీసుకువెళ్లమని కార్తీక్ కి చెప్తుంది సుమిత్ర. వాళ్ల పెళ్లి రోజు అని చెప్తే అర్థం కాదా.. అయితే దీపను కూడా తీసుకువెళ్లండి అంటాడు దశరథ. ముగ్గురు కలిసి వెళ్లకూడదని మీరే చెప్పారు కదా డాడీ అంటుంది జ్యోత్స్న. అయితే నేను కూడా వస్తాను అంటుంది పారు. ఇక మీరే వెళ్లండి అని డ్రామా చేస్తుంది జ్యోత్స్న. అత్తయ్య గారు మీరు ఉండండి. ఇలా వెళ్లి, అలా వస్తారు. నువ్వు తీసుకెళ్లురా అని కార్తీక్ కి చెప్తుంది జ్యోత్స్న. సరే అంటాడు కార్తీక్. పదా బావ వెళ్దామని కార్తీక్ చేయి పట్టుకుంటుంది జ్యోత్స్న. దీని వ్యవహారం ఏదో తేడాగా ఉందే అని మనసులో అనుకుంటుంది పారు.
జ్యో కన్నింగ్ ప్లాన్
గుడి దగ్గర కారు ఆపుతాడు కార్తీక్. లోపలికి వెళ్దాం పదా అంటుంది జ్యోత్స్న. నేను రాను, సంకల్పం నీది.. వెళ్లి పూజ చేసుకో అంటాడు కార్తీక్. నిన్ను లోపలికి ఎలా రప్పించాలో నాకు తెలుసు అని గుడిలోకి వెళ్తుంది జ్యోత్స్న. లోపలికి వెళ్లి పూజారితో తమ పెళ్లి రోజు అని అబద్ధం చెప్తుంది జ్యోత్స్న. మా ఆయన నా మీద అలిగి బయటే ఉన్నాడు అని చెప్తుంది. ముందు ఆయన్ని లోపలికి రప్పించు. మీ పేరు మీద అర్చన చేయిస్తాను అని చెప్తాడు పూజారి. జ్యోత్స్న కార్తీక్ కి ఫోన్ చేసి కారులో పూల సజ్జా మర్చిపోయాను.. లోపలికి తీసుకు రమ్మని చెప్తుంది. తప్పక తీసుకెళ్తాడు కార్తీక్.
కార్తీక్ షాక్
కార్తీక్ లోపలికి రాగానే ఏమయ్యా ఈ రోజు నీ పెళ్లి రోజే కదా అని అడుగుతాడు పూజారి. అవును అని చెప్తాడు కార్తీక్. ఎన్ని కోపాలున్నా భార్యను దూరం పెట్టద్దు.. మంచిది కాదు అని జ్యోత్స్నను ఉద్దేశించి చెప్తాడు పూజారి. షాక్ అవుతాడు కార్తీక్. తను నా భార్య కాదు అంటాడు. అందరూ కలిసి జ్యోత్స్నే కార్తీక్ భార్య అంటారు. కార్తీక్ వాదిస్తున్న పట్టించుకోరు.
జ్యో షాక్
అంతలో దీపతో ఎంట్రీ ఇస్తుంది పారు. షాక్ అవుతుంది జ్యోత్స్న. దీపను కార్తీక్ పక్కన నిలబెట్టి.. తను నా మనుమడి భార్య అని చెప్తుంది పారు. నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావని జ్యోత్స్నను అడుగుతాడు పూజారి. ఏదో చెప్పి కవర్ చేస్తుంది జ్యోత్స్న. దీప, కార్తీక్ ల పేరు మీద అభిషేకం చేయిస్తుంది పారు.
శివన్నారాయణ సంతోషం
మరోవైపు శివన్నారాయణ, దశరథ, సుమిత్ర మాట్లాడుకుంటూ ఉంటారు. పారిజాతం ఎక్కడికి వెళ్లింది అంటాడు శివన్నారాయణ. దీపను తీసుకొని గుడికి వెళ్లింది నాన్న అని చెప్తాడు దశరథ. నువ్వు వీలునామా మార్చి రాయించినప్పుడు నాకు కోపం వచ్చింది కానీ.. ఆ తర్వాతే జ్యోత్స్నలో మార్పు మొదలైంది అంటాడు శివన్నారాయణ. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పారిజాతం కూడా మారిపోయింది. మనకు మంచి రోజులు మొదలైనట్లు ఉన్నాయి అంటాడు శివన్నారాయణ. అవును మామయ్య అంటుంది సుమిత్ర.
జ్యో, పారు చాలెంజ్
కార్తీక్, దీపలకు ప్రసాదం ఇచ్చి మీరు ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని తినండి అని చెప్పి జ్యోత్స్న దగ్గరకు వెళ్తుంది పారు. మెడలో తాళి లేదు, కాలికి మెట్టెలు లేవు. కార్తీక్ నీ మొగుడు అంటే పంతులు ఎలా నమ్మాడే అని అంటుంది పారు. ఆడుకునే వయసులో బావను చూపించి అతనే నీ మొగుడు అంటే నేను నమ్మలేదా అంటుంది జ్యోత్స్న. ఇప్పుడు కార్తీక్, దీప భర్త. వాళ్ల మధ్యలోకి రాకు. దీప జోలికి వస్తే నేను ఊరుకోను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది పారు.
నువ్వు ఎందుకు వాళ్ల సైడ్ కి వెళ్లావు. బావ నిన్ను తోలు బొమ్మను చేసి ఆడుకుంటున్నాడు అంటుంది జ్యోత్స్న. నేను గేమ్ చేంజర్ ని అంటుంది పారు. ఇక నిన్ను భరించే ఓపిక నాకు లేదు. ఆఖరి సారి చెప్తున్నా, దీప జోలికి రాకు అంటుంది పారు. దీప నీ సొంత మనుమరాలా? ఎందుకు ఓ అనామకురాలు కోసం నాతో గొడవ పడుతున్నావు అంటుంది జ్యోత్స్న. దీప ఎవరో తెలుసా? అని చెప్పబోయి ఆగిపోతుంది పోరు. ఎవరో చెప్పు అంటుంది జ్యోత్స్న. దీప, కార్తీక్ భార్య. కార్తీక్, కాంచన కొడుకు, కాంచన నా భర్త కూతురు అంటే నాకు కూతురే. అప్పుడు దీప నా మనుమరాలే కదా అంటుంది పారు.
అయితే నాతో యుద్ధానికి సిద్ధం అంటున్నావా అంటుంది జ్యోత్స్న. అవును అంటుంది పారు. ఓ మనుమరాలి చేతిలో ఓడిపోయిన నాన్నమ్మలా మిగిలిపోతావు అంటావు అంటుంది జ్యోత్స్న. నువ్వే ఓ నానమ్మ చేతిలో ఓడిపోయిన మనుమరాలిగా మిగిలిపోతావు అంటుంది పారు.
దీప కోపం
మరోవైపు కార్తీక్, దీప మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి ఎంత ధైర్యం కాకపోతే నా భర్తని తన భర్త అని అందరితో చెప్పుకుంటుంది అంటుంది దీప. తను అలా చెప్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. నేను చెప్తే ఎవ్వరు వినలేదు. అయినా పారు గట్టిగానే ఇచ్చిందిలే అంటాడు కార్తీక్. వీళ్ల మాటలు పక్కనుంచి వింటుంది జ్య అందరికి నిన్ను భర్త అని చెప్తుంటే ఏం చేస్తున్నావని కార్తీక్ ను అడుగుతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

