MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode:సంతోషంలో దీప, కార్తీక్-దీప కిందపడేలా నూనె పోసిన జ్యో-దీప జారిపడిందా?

Karthika Deepam 2 Today Episode:సంతోషంలో దీప, కార్తీక్-దీప కిందపడేలా నూనె పోసిన జ్యో-దీప జారిపడిందా?

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఏప్రిల్ 7వ తేదీ)లో భార్యకు దిష్టి తీసిన కార్తీక్. కాంచన డౌట్. దీపపై ప్రేమ కురిపించిన పారు. పెళ్లి రోజు సంతోషంలో దీప, కార్తీక్. దీప కిందపడేలా ఫ్లోర్ మీద నూనె పోసిన జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : Apr 07 2026, 07:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్ లో దీపకు దిష్టి తీసి దేవుడి దగ్గర దీపారాధన చేయమంటాడు కార్తీక్. గండం నుంచి బయటపడితేనో, గండం ఉందని భయపడితేనో దిష్టి తీస్తారు.. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం జరిగింది రా అని అడుగుతుంది కాంచన. ఏం లేదులే అమ్మ కడుపుతో ఉన్న భార్య బయటి నుంచి వచ్చినప్పుడు దిష్టి తగులుతుందని నువ్వే చెప్పావు కదా.. అందుకే తీశాను అంటాడు కార్తీక్. 

అమ్మకు దిష్టి తగిలిందా నాన్న అని అడుగుతుంది శౌర్య. అవును అంటాడు కార్తీక్. ఎవరి దిష్టి తగిలిందని అడుగుతుంది శౌర్య. మనం అంటే నచ్చని వాళ్ల దిష్టి అని చెప్తాడు కార్తీక్. వీడు జ్యోత్స్న గురించి మాట్లాడట్లేదు కదా అని మనసులో అనుకుంటుంది కాంచన. అక్కడ బావ, జ్యోత్స్నతో మాట్లాడాడు కదా.. తన మాటలు బావను బాగా భయపెట్టి ఉంటాయి అని మనసులో అనుకుంటుంది దీప.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
అబద్ధం చెప్పిన కార్తీక్
Image Credit : Jiohotstar

అబద్ధం చెప్పిన కార్తీక్

ఆ తర్వాత బెడ్ మీద పడుకొని కార్తీక్ నే చూస్తూ ఉంటుంది దీప. ఏంటి మరదలా అలా చూస్తున్నావ్ అని అడుగుతాడు కార్తీక్. నువ్వు జ్యోత్స్నతో ఏం మాట్లాడవు బావ అని అడుగుతుంది దీప. ఏం లేదు అని జ్యోత్స్న పెళ్లి గురించి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటాడు కార్తీక్. చెప్పు బావా అని అడుగుతుంది దీప.

ఇంకేముంటుంది ఆస్తి గురించి అడిగింది అని చెప్తాడు కార్తీక్. నువ్వు అబద్దం చెప్తున్నావ్ అంటుంది దీప. తను నీ స్థానం కోరుకుంటోంది అని మనసులో అనుకుంటాడు కార్తీక్. జ్యోత్స్న లాంటి వ్యక్తుల గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. నువ్వు హాయిగా నిద్రపో అంటూ దీపను తన ఒడిలో పడుకోబెట్టుకుంటాడు కార్తీక్.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode:కేక్‌లో విషం కలిపిన జ్యో-దీపకు తినిపించిన సుమిత్ర-దీపకు ఏం జరిగింది?
Related image2
Karthika Deepam 2 Today Episode: సూపర్ సస్పెన్స్ ఎపిసోడ్- దీపను చంపబోయిన జ్యో- అయోమయంలో కార్తీక్
37
ప్రేమ కురిపించిన పారు
Image Credit : Jiohotstar

ప్రేమ కురిపించిన పారు

అప్పుడే కార్తీక్ కి పారు ఫోన్ చేస్తుంది. నా మనుమరాలు పడుకుందా అని అడుగుతుంది. అతి అనే పదానికి అర్థం నువ్వే పారు.. నా భార్య పడుకుందో లేదో తెలుసుకోవడానికి ఫోన్ చేసి మరి అడగాలా అని అంటాడు కార్తీక్. ఇది జ్యోత్స్న, నువ్వు కలిసి ఆడుతున్న నాటకమే కదా అంటాడు కార్తీక్. లేదురా నాది స్వచ్ఛమైన మనసు. నేను ప్రేమతోనే చేశాను అంటుంది పారు. సరేగాని దీపకు దిష్టి తీశావా అని అడుగుతుంది పారు. 

నా భార్యకు దిష్టి తీశానని నీకు ఎలా తెలుసు అంటాడు కార్తీక్. అయితే తీశావ్ అన్నమాట... మంచిది, అది చెప్పడానికే చేశాను రా.. అసలే ఆ జ్యోత్స్న కళ్లు మంచివి కావు అంటుంది పారు. అయినా అది నిన్ను వదిలిపెట్టేలా లేదురా, దాని పీడ పోవాలంటే.. ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి పంపించాలి అంటుంది పారు. సరే అంటాడు కార్తీక్. నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను.. దాని పెళ్లి చేయరా ఫస్ట్ అంటుంది పారు. సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు కార్తీక్.

47
మరో కుట్రకు ప్లాన్
Image Credit : Jiohotstar

మరో కుట్రకు ప్లాన్

నిద్రలో కలవరిస్తూ ఉంటుంది దీప. బావ రేపు మన పెళ్లిరోజు గుర్తుందా అని అడుగుతుంది దీప. గుర్తుంది మరదలా.. అదెలా మర్చిపోతాను అని అంటాడు కార్తీక్. మరోవైపు జ్యోత్స్న కూడా దీప కార్తీక్ పెళ్లి జరిగిన రోజును గుర్తు చేసుకుంటుంది. రేపు మీ మొదటి పెళ్లి రోజు కదా.. నా మెడలో పడాల్సిన తాళిని నా ముందే నీ మెడలో కట్టించుకున్నావు. ఆ రోజును ఎలా మర్చిపోతాను దీప అని కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న. బావ భార్యగా, ఈ ఇంటి వారసురాలిగా నాకు గుర్తింపు కావాలి.. అది కావాలంటే నువ్వు ఉండకూడదు. రేపే నీ మొదటి పెళ్లి రోజు, ఆఖరి పెళ్లిరోజు.. నీకు గుర్తుండి పోయే బహుమతి ఇస్తాను అని అనుకుంటుంది జ్యోత్స్న.

57
సంతోషంలో దీప, కార్తీక్
Image Credit : Jiohotstar

సంతోషంలో దీప, కార్తీక్

మరుసటి రోజూ దీప, కార్తీక్ చక్కగా రెడీ అయ్యి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటారు. నిండు నూరేళ్లు చల్లగా బతకండని కాంచన, శ్రీధర్ ఆశీర్వదిస్తారు. శౌర్య, తల్లిదండ్రుల కోసం ఒక డ్రాయింగ్ గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ తర్వాత డ్యూటీ కి వెళ్తామని కార్తీక్ అంటే కాంచన శ్రీధర్ అడ్డు పడతారు. ఈ రోజు సరదాగా బయటకు వెళ్దామంటాడు శ్రీధర్. లేదు మాస్టారు.. త్వరగా వెళ్లి త్వరగా వస్తామని చెప్పి వెళ్తారు కార్తీక్, దీప. వద్దన్నా వెళ్తున్నారు అని కాంచన కాస్త బాధపడుతుంది. పర్లేదులే కాంచన త్వరగా వచ్చేస్తారు లే, ఏం కాదు అంటాడు శ్రీధర్. నా భయమంతా ఆ జ్యోత్స్న గురించే అంటుంది కాంచన.

67
దీప కిందపడేలా జ్యో ప్లాన్
Image Credit : Jiohotstar

దీప కిందపడేలా జ్యో ప్లాన్

మరోవైపు గుమ్మం దగ్గర కింద నూనె పోస్తుంది జ్యోత్స్న. రా దీప నీకోసమే ఈ గుమ్మం వెయిట్ చేస్తోంది చంపడానికి కత్తులే అవసరం లేదు. కింద పడేలా చేసినా చాలు అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత వెళ్లి సోఫాలో కూర్చొని దీప కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. పారు హూషారుగా డ్యాన్స్ చేస్తూ హాల్లోకి వస్తుంది. డాన్స్ బాగా చేస్తున్నావు పారు అనుకుంటూ కార్తీక్ నూనెను దాటుకొని లోపలికి వస్తాడు.

77
దీప జారిపడిందా?
Image Credit : Jiohotstar

దీప జారిపడిందా?

పారును చూసిన శివన్నారాయణ.. కిందపడితే నడుము విరుగుతుంది అంటాడు. ఏదో మనుమడు సరదా పడితే చేశానులేండి అంటుంది పారు. సరదాగా అందరూ కలిసి ఒక గేమ్ ఆడాలనుకుంటారు. దీప ఏది బావ అని అడుగుతుంది జ్యోత్స్న. గులాబీ పువ్వు కోసుకోవడానికి ఆగింది అంటాడు కార్తీక్. దీప పువ్వు పెట్టుకొని ఇంట్లోకి వచ్చి నూనెపై అడుగు వేసి జారి పడబోతుంది. దీప దీప అనుకుంటూ అందరూ పరుగెడతారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:కేక్‌లో విషం కలిపిన జ్యో-దీపకు తినిపించిన సుమిత్ర-దీపకు ఏం జరిగింది?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: సూపర్ సస్పెన్స్ ఎపిసోడ్- దీపను చంపబోయిన జ్యో- అయోమయంలో కార్తీక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved