MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: జ్యోకు కార్తీక్, పారు వార్నింగ్-కార్తీక్, దీపలను జ్యో విడదీస్తుందా?

Karthika Deepam 2 Today Episode: జ్యోకు కార్తీక్, పారు వార్నింగ్-కార్తీక్, దీపలను జ్యో విడదీస్తుందా?

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఏప్రిల్ 8వ తేదీ)లో దీపను జారిపడకుండా పట్టుకున్న జ్యో. పెద్ద గండం తప్పిందన్న ఫ్యామిలీ. జ్యోకు వార్నింగ్ ఇచ్చిన కార్తీక్, పారు. కార్తీక్, దీపలను విడదీసే ప్రయత్నం చేసిన జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే  

3 Min read
Author : Kavitha G
Published : Apr 08 2026, 07:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్ లో దీప ఫ్లోర్ మీద ఉన్న నూనెపై అడుగు వేసి జారి పడబోతుంది. జ్యోత్స్న పట్టుకుంటుంది. అందరూ దీప దగ్గరికి వచ్చి ఏం కాలేదుగా అని అడుగుతారు. కార్తీక్ మాత్రం జ్యోత్స్నను కోపంగా చూస్తాడు. కడుపుతో ఉన్న మనిషివి కాస్త చూసుకోవాలి కదా దీప.. ఆ మాత్రం జాగ్రత్త లేకపోతే ఎలా.. అంటుంది జ్యోత్స్న. నువ్వు పట్టుకోకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది అంటాడు శివన్నారాయణ. ఏదైతేనేమి నా కూతురికి పెద్ద గండం తప్పింది అని మనసులో అనుకుంటాడు దశరథ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
జ్యోకు కార్తీక్ వార్నింగ్
Image Credit : Jiohotstar

జ్యోకు కార్తీక్ వార్నింగ్

ఆ తర్వాత పక్కకు వెళ్లి నవ్వుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అందరూ నేను నిన్ను కాపాడానని అనుకుంటున్నారు. కానీ... నువ్వు నా వల్లే కింద పడబోయావు అని ఎవరికి తెలియదు అని నవ్వుకుంటుంది. అంతలో వెనుక నుంచి కార్తీక్ వచ్చి పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ తనని ఎవరు చూడట్లేదు అనుకుంటుంది అంటాడు కార్తీక్. మా ఇంట్లో పిల్లులు లేవు బావ అంటుంది జ్యోత్స్న. ఎందుకు లేదు ఒక దొంగ పిల్లి ఉంది. కానీ దాన్ని చేష్టలన్నీ నక్క చేస్టలే అంటాడు కార్తీక్. 

ఫ్లోర్ మీద వాటర్ పడ్డాయని అందరూ అనుకుంటున్నారు కానీ నాకు, దీపకు మాత్రమే తెలుసు అది నూనె అని. నువ్వు ఇలాంటివి చేయడం ఆపేస్తే మంచిది అంటాడు కార్తీక్. నీకు నాకు మధ్యలో ఎవరున్నా నేను అడ్డు తప్పిస్తాను బావ అంటుంది జ్యోత్స్న. సీరియస్ అవుతాడు కార్తీక్. అడ్డు తప్పించడం అంటే చంపేయడం కాదు బావ అంటుంది జ్యోత్స్న. ఇప్పటికే నువ్వు చాలా మెట్లు దిగావు. ఇంతకంటే దిగజారుకు అంటాడు కార్తీక్. నా దగ్గర కోల్పోవడానికి ఏం లేదు. నా గోల్ ఒక్కటే నిన్ను పెళ్లి చేసుకోవడం అంటుంది జ్యోత్స్న.

36
జ్యోపై మండిపడ్డ పారు
Image Credit : Jiohotstar

జ్యోపై మండిపడ్డ పారు

అప్పుడే వచ్చిన పారిజాతం జ్యోత్స్నపై మండిపడుతుంది. ఫ్లోర్ మీద నూనె ఎవరో పోశారో నాకు తెలియదు అనుకుంటున్నావా.. కొంచమైనా బుద్ధి ఉండాలి కడుపుతో ఉన్న మనిషిని పడేయాలి అనుకుంటావా అని సీరియస్ అవుతుంది పారు. నువ్వు వెళ్లి దీప సంగతి చూడు. నేను దీని తాట తీస్తాను అని చెప్పి కార్తీక్ ని పంపిస్తుంది. బరితెగించి మీద పడతానంటే ముక్కుతాడు వేసి వాయిస్తాను. ఇలాంటి పనులు మానుకుంటే మంచిదని గట్టిగా తిట్టి వెళ్లిపోతుంది పారు. ఈ గ్రానీకి ఏమైందని చిరాకు పడుతుంది జ్యోత్స్న. ఈ రోజు మీ పెళ్లి రోజు కదా బావ.. రెండు నిమిషాలు ఆగు మీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను అంటుంది.

46
దీపపై పారు ప్రేమ
Image Credit : Jiohotstar

దీపపై పారు ప్రేమ

మరోవైపు కిచెన్ లో పనిచేస్తూ ఉంటుంది దీప. ఈరోజు నువ్వు ఏ పని చేయకూడదు దీప.. అన్నీ పనులు నేనే చేస్తాను అంటుంది పారు. ఎందుకు అని అడుగుతుంది దీప. ఈ రోజు మీరు కొత్త పెళ్లి జంటలా ఉన్నారు. ముందు మీకు దిష్టి తీయాలి అంటుంది పారు. కొత్తపెళ్లి జంటలా కాదు.. మాది కొత్త పెళ్లి జంటే.. ఎందుకంటే మా మొదటి పెళ్లి రోజు అని చెప్తాడు కార్తీక్. ఇంత మంచి వార్తను ఇంత లేటుగా చెప్తావా అని ఇద్దర్నీ శివన్నారాయణ దగ్గరకు తీసుకెళ్తుంది పారు. ఏమండీ ఈ రోజు వీళ్ల పెళ్లి రోజట అని చెప్పగానే అందరూ విషెస్ చెప్తారు. మాట వరుసకు కూడా మాతో పెళ్లిరోజు అని చెప్పలేదు కదా అని ఫీల్ అవుతాడు దశరథ.

56
ఆశీర్వాదం తీసుకున్న దీప, కార్తీక్
Image Credit : Jiohotstar

ఆశీర్వాదం తీసుకున్న దీప, కార్తీక్

పారు వెళ్లి అక్షింతలు తీసుకొస్తే.. కార్తీక్ దీప కలిసి శివన్నారాయణ, పారు దగ్గర దశరథ, సుమిత్రల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సంతోషంగా బ్రతకండని దశరథ దీవిస్తాడు. మీ ఇద్దరికీ పెళ్లి రోజు గురించి చెప్పనందుకు నేను ఒక పనిష్‌మెంట్ ఇస్తున్నాను అంటాడు శివన్నారాయణ. నా కారు, లీవ్ ఇస్తున్నాను హ్యాపీగా బయటకు వెళ్లండి అంటాడు శివన్నారాయణ.

66
జ్యోత్స్న కొత్త ప్లాన్
Image Credit : Jiohotstar

జ్యోత్స్న కొత్త ప్లాన్

ఎక్కడికి అనుకుంటూ కిందకు వస్తుంది జ్యోత్స్న. ఇదేంటి కొత్త పెళ్లికూతురిలా చీర కట్టుకొని వచ్చింది అని మనసులో అనుకుంటుంది పారు. గుడికి వెళ్లాలి పద బావ అంటుంది జ్యోత్స్న. ఈ రోజు దీప కార్తీక్ ల పెళ్లి రోజు.. కార్తీక్ రాడు అని చెప్తాడు దశరథ. కావాలంటే నేను తీసుకెళ్తాను అంటాడు శివన్నారాయణ. నేను పెళ్లి చేసుకోవాలని సంకల్పించుకున్నాను. ఈరోజు గుడికి వెళ్తే మంచిదట. నా కోరిక నెరవేరుతుందట అని చెప్తుంది జ్యోత్స్న.

వాళ్ల పెళ్లి రోజు అని చెప్తుంటే అర్థం కావట్లేదా.. మీ మమ్మీని తీసుకొని వెళ్లు అంటాడు దశరథ. లేదు డాడీ నేను బావతో వస్తానని సంకల్పించుకున్నాను అంటుంది జ్యోత్స్న. కార్తీక్ రాడు అని గట్టిగా చెప్తుంది పారు. ఎందుకు రాడు, నా పెళ్లి కావడం మీకు ఇష్టం లేదా మమ్మీ అని సుమిత్రను అడుగుతుంది జ్యోత్స్న. అలా వెళ్లి ఇలా వస్తారు. వెళ్లనివ్వండి అత్తయ్య అంటుంది సుమిత్ర. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Recommended image2
Neethu Natraj: నటరాజ్ మాస్టర్ తో ప్రేమ,పెళ్లి.. తెలుగు అమ్మాయి కాదు కానీ.. నీతూ గురించి ఈ విషయాలు తెలుసా
Recommended image3
Dakkshi: కాస్టింగ్ కౌచ్ కష్టాలు దాటుకుని ఆర్జీవీ సినిమాలో ఛాన్స్.. బిగ్ బాస్ లోకి కరోనా వైరస్ బ్యూటీ దక్షి
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:కేక్‌లో విషం కలిపిన జ్యో-దీపకు తినిపించిన సుమిత్ర-దీపకు ఏం జరిగింది?
Recommended image2
Karthika Deepam 2 Today Episode:సంతోషంలో దీప, కార్తీక్-దీప కిందపడేలా నూనె పోసిన జ్యో-దీప జారిపడిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved