- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode:కేక్‌లో విషం కలిపిన జ్యో-దీపకు తినిపించిన సుమిత్ర-దీపకు ఏం జరిగింది?
Karthika Deepam 2 Today Episode:కేక్‌లో విషం కలిపిన జ్యో-దీపకు తినిపించిన సుమిత్ర-దీపకు ఏం జరిగింది?
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఏప్రిల్ 4వ తేదీ)లో దీప గురించి పొగిడిన పారు. కేకులో విషం కలిపిన జ్యో. దీపకు తినిపించిన సుమిత్ర. మాటలతో మాయ చేసిన కాశీ. జ్యోకు షాక్ ఇచ్చిన కార్తీక్. మనసులో మాట బయటపెట్టిన జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్‌లో దీపలాంటి అమ్మాయి ఇంట్లో ఉంటే దేవుడిముందు దీపం వెలిగినట్లే అంటుంది పారు. ఇది పార్టీలా లేదు ఒకరిని ఒకరు పొగుడుకోవడానికి కలుసుకున్నట్లు ఉంది అంటాడు కార్తీక్. అందుకే ఇక్కడితో దీనికి ఫుల్ స్టాప్ పెడుతున్నాను బావ. ఇప్పుడు మా మమ్మీ కేక్ కట్ చేస్తుంది అంటుంది జ్యో.
దీన్ని నేనే స్పెషల్‌గా రెడీ చేశాను అని.. దానిలో విషం కలిపిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. కార్తీక్, దాసు కేకులో విషం కలిపినట్లు తెలుసుకొని టెన్షన్ పడుతుంటారు. నువ్విలా టెన్షన్ పడుతుంటే చూడటం నాకు చాలా హ్యాపీగా ఉంది బావ అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
కార్తీక్ టెన్షన్
సుమిత్ర కేక్ కట్ చేసి, ఫస్ట్ జ్యోత్స్నకే పెట్టబోతుంది. టెన్షన్ పడుతుంది జ్యోత్స్న. దశరథ ఆగు సుమిత్ర. ముందు కేకు దీపకు పెట్టు అంటాడు. కరెక్ట్ గా నా మనసులో ఉన్న మాట చెప్పావు డాడీ అంటుంది జ్యోత్స్న. ఎందుకులే మామయ్య జ్యోత్స్నకే పెట్టనివ్వండి అంటాడు కార్తీక్.
సుమిత్ర బతకడానికి జ్యోత్స్న ఎంత కారణమో, దీప కూడా అంతే కారణం. దీప కూడా నా కూతురు లాంటిదే. ముందు దీపకు పెట్టు సుమిత్ర అంటాడు దశరథ. సుమిత్ర దీపకు కేకు తినిపిస్తుంది. కార్తీక్ టెన్షన్ పడతాడు.
జ్యోత్స్న షాక్
ఈ కేకులో నేను కలిపింది మాములు విషం కాదు బావ. తిన్న పది సెకన్లలోనే దీప చనిపోతుంది. నువ్వు నిజం ఎవరితో చెప్పుకోలేక లోలోపల ఏడుస్తూ ఉంటే నాకు భలే సంతోషంగా ఉందని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. నేను అనుకున్న పని అయిపోయింది. అని ఒకటి, రెండు అని లెక్కబెడుతుంది. దీపకు ఏం కాదు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.
జ్యో ప్లాన్ తిప్పికొట్టిన కార్తీక్
కార్తీక్ జ్యోత్స్న వైపు ఓ చూపు చూసి, సుమిత్ర దగ్గరకు వెళ్లి, అంతా నీ కూతురికేనా, నాకు కూడా తినిపించు అత్త అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్నకు దగ్గరగా వెళ్లి.. నువ్వు కేక్‌లో విషం కలపడం నేను చూశాను మరదలా. అప్పుడే ఆపితే నువ్వు ఇంకోటి ప్లాన్ చేసేదానివి. అందుకే ఆపలేదు. జస్ట్ కేక్ మార్చాను అని షాక్ ఇస్తాడు.
ఏం మాట్లాడుకుంటున్నారో మాకు కూడా వినిపించేలా మాట్లాడండి రా అంటాడు శివన్నారాయణ. జ్యోత్స్న కేకులో ఒకటి కలిపింది తాత అంటాడు కార్తీక్. ఏం కలిపింది అని అడుగుతాడు శివన్నారాయణ. చెప్పనా జ్యోత్స్న అని భయపెడతాడు కార్తీక్.
కాసేపు సస్పెన్స్ తర్వాత తన ప్రేమను కేకులో కలిపింది అని కవర్ చేస్తాడు. తర్వాత అంతా కలిసి ఓ సెల్ఫీ తీసుకుంటారు. మాస్టారు మీరు దీపను, శౌర్యను మీతోపాటు తీసుకెళ్లండి నేను తర్వాత వస్తాను అని చెప్తాడు కార్తీక్. జ్యోత్స్నతో నేను నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు.
కాశీ మాటలకు స్వప్న ఫిదా
మరోవైపు స్వప్న, వసంత్ లను కారులో గుడికి తీసుకెళ్తుంటాడు కాశీ. స్వప్న కట్టుకున్న చీర బాగుందని చెప్తాడు వసంత్. మీ సెలెక్షన్ చాలా బాగుంది అని చెప్తాడు. అనవసరంగా కట్టుకున్నాను అని మనసులో అనుకుంటుంది స్వప్న. ఈ చీరను తన బర్త్ డేకి నేనే గిఫ్ట్ గా ఇచ్చాను అని చెప్తాడు కాశీ.
స్వప్న గురించి చెప్పమని అడుగుతాడు వసంత్. దొరికిందే అవకాశంగా తనకు స్వప్నపై ఉన్న ప్రేమను, తనతో కలిసి ఉన్నప్పుడు తాను పొందిన సంతోషాన్ని గొప్పగా చెప్తాడు కాశీ. ఆ మాటలకు స్వప్నలో చిన్న పాజిటివ్ చేంజ్ కనిపిస్తుంది.
నువ్వొక నీచమైన తండ్రివి
మరోవైపు జ్యోత్స్న, కార్తీక్, దాసు మాట్లాడుకుంటూ ఉంటారు. నిజాలు తెలిసి కూడా నువ్వు భలే కవర్ చేస్తావు బావ అంటుంది జ్యోత్స్న. ఏంటి డీఎన్‌ఏ రిపోర్ట్స్ గురించి నిజాలా అని షాక్ ఇస్తాడు కార్తీక్. ఓ రిపోర్ట్స్ కూడా చూశావా... అందరూ కలిసి చాలా బాగా డ్రామా ఆడారు బావ అంటుంది జ్యోత్స్న. ఎవరిది డ్రామా అని, సీరియస్ అవుతాడు దాసు.
నువ్వు మాట్లాడకు, నువ్వొక నీచమైన తండ్రివి. నిజం ఎవరికి చెప్పనని మాటిచ్చి.. అందరికి చెప్పేశావు అంటుంది జ్యోత్స్న. నువ్వు కూడా అలాంటి కూతురివే అని తిరిగి కౌంటర్ ఇస్తాడు దాసు. మరి ప్రేమగా చూసుకున్న అమ్మానాన్నలను చంపాలనుకున్న నువ్వు నీచురాలు కాదా అంటాడు కార్తీక్. నేను ఎవరిని చంపాలనుకోలేదు అంటుంది జ్యోత్స్న.
మరి నాకు చేసింది ఏంటో అని అడుగుతాడు దాసు. ఆ రోజు నాకున్న టెన్షన్‌లో ఏం చేయాలో తెలియక కర్రతో కొట్టాను అంటుంది జ్యోత్స్న. మరి ఈ రోజు ఎందుకు కేకులో విషం కలిపావు అని అడుగుతాడు కార్తీక్. దీపను చంపాలి అనుకున్నాను అంటుంది జ్యోత్స్న. తను ఏం పాపం చేసింది, ఎందుకు చంపాలనుకుంటున్నావ్ అని అడుగుతాడు కార్తీక్.
దాసుపై ఉమ్మేసిన జ్యో
దీపే నాకు ఏది దక్కకుండా చేసింది, నిన్ను పెళ్లి చేసుకొని జీవితాంతం ఈ ఇంట్లో మహారాణిలా బ్రతికేదాన్ని అంటుంది జ్యోత్స్న. నా మాట వెంటే ఇప్పుడు కూడా మహారాణిలా బ్రతకొచ్చు అంటాడు దాసు. ఆపు, నేను నీ కూతురు అని తెలిశాక ఒక జత బట్టలైనా కొన్నావా? కొనలేవు, నా స్థాయి బట్టలు కొనాలంటే నీ జేబులు తడుముకోవాలి.
నువ్వు నా బతుకు బాగు చేస్తావా త్పూ.. అని ఉమ్మేస్తుంది జ్యోత్స్న. దాసు జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు. అరవకు నాన్న నేను ఊసింది నీ మీద కాదు. మన బతుకుల మీద. ఈ ఇంటి వారసురాలిగా ఉండాలన్నదే నా కోరిక. కాదు మా నానమ్మ కోరిక అని అంటుంది జ్యోత్స్న. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

