- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: జ్యోపై విరుచుకుపడ్డ దీప- జ్యో మరో కుట్ర- సుమిత్ర చావుకు ప్లాన్?
Karthika Deepam 2 Today Episode: జ్యోపై విరుచుకుపడ్డ దీప- జ్యో మరో కుట్ర- సుమిత్ర చావుకు ప్లాన్?
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (జనవరి 7వ తేదీ)లో త్వరలో చావబోతున్నట్లు మాట్లాడిన సుమిత్ర. దీపపై పారు, జ్యో ఫైర్. గట్టిగా ఇచ్చిపడేసిన దీప. నిజం చెప్పే రోజు దగ్గరపడిందన్న పారు. మరో కుట్రకు సిద్ధమైన జ్యోత్స్న. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో సుమిత్రను ఇలా చూడలేకపోతున్నాను అని కన్నీరు పెట్టుకుంటాడు దశరథ. తనని అర్థం చేసుకోకుండా ఆ రోజు మాటలతో హింసించి ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేశాను. తను వెళ్లాక కానీ తన విలువ తెలియలేదు నాకు. ఇప్పుడు తనకే ఇంత పెద్ద వ్యాధి వచ్చింది. దీని గురించి తనతో ఎలా చెప్పాలి రా అని ఏడుస్తాడు దశరథ. అత్తకు ఏం కాదు. నువ్వు కంగారు పడకు మామయ్య అంటాడు కార్తీక్.
దీప నువ్వైనా చెప్పు
ఇంతలో సుమిత్ర కళ్లు తెరిచి... మీరు నాతో ఏం చెప్పాలండి అని అడుగుతుంది. ఎందుకు అందరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఏం జరుగుతోంది? దీప నువ్వైనా చెప్పు అంటుంది. ఏవండీ మీకు ఏమైంది? మీరు ఎందుకు నన్ను చావుకు దగ్గరగా ఉన్న మనిషిని చూస్తున్నట్లు చూస్తున్నారు అంటుంది. అమ్మగారు మీరు అలా మాట్లాడకండి అంటుంది దీప. ఏమైందో నీకు గుర్తులేదా? కళ్లు తిరిగి కిందపడ్డావు. డాక్టర్ వచ్చి ట్రీట్ మెంట్ చేసింది. నువ్వు రెస్ట్ తీసుకో అత్త అంటాడు కార్తీక్.
నా కూతురికి చెప్పొద్దు
నా దగ్గర మీరు ఏదో దాస్తున్నారు. ఎంతకాలం దాస్తారో దాయండి. నాకు మాత్రం మీరు అంత దూరం అవుతున్నట్లు, మిమ్మల్ని వదిలి ఎక్కడికో వెళ్లిపోతున్నట్లు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి అని చెప్తుంది సుమిత్ర. ఆ మాటలు విని ఎమోషనల్ అవుతారు అంతా. జ్యోత్స్న పెళ్లి నా కల అండి. తన పెళ్లి అయ్యే వరకు నాకు ఏం కాదు అని దశరథతో చెప్తుంది సుమిత్ర.
ఒక వేళ నాకు ఏదైనా సమస్య ఉంటే దాని గురించి నా కూతురికి చెప్పనని మాట ఇవ్వండి అంటూ మళ్లీ కళ్లు తిరిగి పడిపోతుంది సుమిత్ర. ఏంటి ఈ పరిస్థితి అని బాధపడుతాడు దశరథ. అత్తకు ఏం కాదు. తన ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డువేస్తామని దశరథకు ధైర్యం చెప్తాడు కార్తీక్.
దీపను బయటకు గెంటేయ్
బయట నిలబడి ఏడుస్తూ ఉంటుంది దీప. పారు, జ్యోత్స్న దీపను చూసి ఇది ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతోంది అనుకుంటారు. ఈ ఇంట్లో సగం దరిద్రాలకు కారణం ఇదే గ్రానీ ముందు దీన్ని బయటకు గెంటేయ్ అంటుంది జ్యోత్స్న. ఏంటమ్మా.. నీ కన్నతల్లికే ఏదో నయం కాని జబ్బు వచ్చినట్లు అంతలా ఏడుస్తున్నావ్? నీ ఓవరాక్షన్ చూసి డాక్టర్ కూడా నువ్వే సుమిత్ర కూతురు అనుకుంది అంటుంది పారు. అనుకుంటే ఏమైంది? అని కోపంగా అంటుంది దీప. పుట్టగానే అమ్మను పోగొట్టుకున్న అనాథవి నువ్వు. మా మమ్మీ నీకు అమ్మ ఎలా అవుతుంది. హద్దుల్లో ఉండమని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న.
స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది దీప. సుమిత్రమ్మ ఎన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారో నీకు తెలుసా? ఏ రోజైనా నువ్వు పట్టించుకున్నావా? నేను ఈ ఇంటి మంచి కోరుకునే మనిషిని కాబట్టి ఆవిడకు ఏం కావొద్దు అని కోరుకుంటున్నాను. మీకు మనుషుల మీద ప్రేమలు ఉండవు కాబట్టి ఎవరు ఎక్కడపోయినా మీకు బాదలేదు అంటుంది దీప.
నీలాంటిది కోరుకుంటే నా తల్లి చస్తుంది కానీ బ్రతకదు అంటుంది జ్యోత్స్న. ఆ మాట వినగానే కోపంతో ఊగిపోతుంది దీప. నువ్వు అసలు మనిషివేనా... తల్లి మీద కన్నప్రేమ లేకపోయినా పెంచిన ప్రేమైనా ఉండాలి కదా అంటుంది. షాక్ అవుతారు పారు, జ్యోత్స్న. పెంచిన ప్రేమ ఏంటి అని తిరిగి ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. తల్లి బిడ్డను పెంచుతుంది కదా.. ఆ ప్రేమ గురించి చెప్తున్నాను అంటుంది దీప. జ్యోత్స్న దీపపైకి వెళ్తుండగా.. లోపలికి లాక్కెళ్తుంది పారు.
జ్యోత్స్న మరో కుట్ర
నువ్వు కూతురు కాదు అనే విషయం బయటపడుతుందేమోనని నాకు భయంగా ఉందే అంటుంది పారు. ఇప్పుడు తప్పించుకునే అవకాశమే లేదు అంటుంది జ్యోత్స్న. శివన్నారాయణ కాళ్ల మీద పడి నిజం చెప్పే టైమ్ దగ్గర పడిందేమో అని భయపడుతుంది పారు. నిజం చెప్తే నిన్ను కచ్చితంగా చంపేస్తారు అంటుంది జ్యోత్స్న. నిన్ను మాత్రం ఏం చేస్తారో తెలియదు. కానీ ఇంట్లో ఉండనివ్వరు అంటుంది పారు.
మమ్మీకి వచ్చిన వ్యాధికంటే కూడా నా భయం పెద్దగా అనిపిస్తోంది. ట్రీట్మెంట్ జరగపోతే ఆవిడ ఎంతకాలం బ్రతుకుతుందో తెలియదు కానీ.. జరిగితే మనం ఇప్పుడే పోతాం. నేను ఓ నిర్ణయానికి వచ్చాను గ్రానీ అంటుంది జ్యోత్స్న. ఏంటది అని అడుగుతుంది పారు. చెప్పను. నేను అన్నింటికి తెగించాను. ఇంట్లో ఏదైనా జరగొచ్చు. కానీ నేను ఓటమిని ఒప్పుకోను అని కొత్త కుట్రకు తెరతీస్తుంది జ్యోత్స్న. ఇది మళ్లీ ఏదో తప్పు చేయబోతుంది అని కంగారు పడుతుంది పారు.
అసలు దోషి జ్యోత్స్ననే
మరోవైపు బయట కారు దగ్గర ఉన్న నిలబడి ఉంటాడు శ్రీధర్. తండ్రి దగ్గరకు వెళ్తాడు కార్తీక్. ఏంటి మాస్టారు బయటకు వచ్చేశారు అంటాడు కార్తీక్. నేను ఏదో చెప్పడానికి వచ్చాను. ఇక్కడ ఇంకేదో జరిగింది అంటాడు శ్రీధర్. నీకు చెప్పాను కదా ఫైల్స్ మిస్ అయ్యాయని.. అవి కాశీ తీశాడు. స్వప్నకు దొరికాయి అని చెప్తాడు శ్రీధర్. అయితే జ్యోత్స్న.. కాశీ, వైరాలను ఇరికించి తెలివిగా తప్పించుకుంది అంటాడు కార్తీక్. అలాంటి మనిషి గురించి మామయ్య గారెకి నిజం చెప్పకపోతే ఎలా అంటాడు శ్రీధర్.
వీటి అవసరం రాకపోవచ్చు
ఇప్పుడు వద్దు మాస్టారు. ఇంట్లో పరిస్థితి చూసావు కదా.. జ్యోత్స్ననే అత్తను కాపాడాలని డాక్టర్ చెప్పింది. ఈ పరిస్థితిలో తాత జ్యోను ఎలా బయటకు పంపిస్తాడు. ఈ పైల్స్ నీ దగ్గరే పెట్టుకో. వీటి అవసరం ఎప్పుడో వస్తుందో అప్పుడే బయటపెడతాం. నా అంచనా ప్రకారం వీటి అవసరం రాకపోవచ్చు అంటాడు కార్తీక్. అదేంటి అని అడుగుతాడు శ్రీధర్.
అత్తకు బోన్ మ్యారో ఇవ్వాల్సింది జ్యోత్స్న కాదు, దీప. అప్పుడు జ్యో కన్న కూతురు కాదనే నిజం బయటపడుతుంది అని మనసులో అనుకుంటాడు కార్తీక్. ఏం లేదు కానీ దీపను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లండి మాస్టారు. అత్త గురించి తెలిసిన దగ్గరినుంచి తను బాధపడుతూనే ఉంది అంటాడు కార్తీక్. సరే నేను ఇక్కడే ఉంటాను. వెళ్లి తనని పంపించు అంటాడు శ్రీధర్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

