- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: కార్తీక్ చెంపపై కొట్టిన తాత-నిజం చెప్పిన డాక్టర్-జ్యో గుట్టు రట్టు?
Karthika Deepam 2 Today Episode: కార్తీక్ చెంపపై కొట్టిన తాత-నిజం చెప్పిన డాక్టర్-జ్యో గుట్టు రట్టు?
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (జనవరి 6వ తేదీ)లో కార్తీక్ పై రెచ్చిపోతారు జ్యో, పారు. కార్తీక్ ని చెంపపై కొడుతాడు శివన్నారాయణ. ఫైల్స్ తో ఎంట్రీ ఇస్తాడు శ్రీధర్. రక్తం కక్కుకొని పడిపోతుంది సుమిత్ర. నిజం చెప్తుంది డాక్టర్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో డాక్టర్ హారిక చెప్పిన విషయం నువ్వు చెప్తావా? లేక నన్ను చెప్పమంటావా అని అడుగుతాడు శివన్నారాయణ. తాతకు నిజం తెలిసిపోయింది ఇక చెప్పక తప్పదు అని మనసులో అనుకుంటాడు కార్తీక్. డాక్టర్ హారిక.. కార్తీక్ మీతో ఏం చెప్పలేదా? ఈ పాటికి చెప్పి ఉండాలే అన్నారు. ఇప్పుడు చెప్పు డాక్టర్ నీతో ఏం చెప్పారు? నువ్వు మా దగ్గర ఏం దాచావు? ఎందుకు దాచావు అని అడుగుతాడు శివన్నారాయణ.
కార్తీక్ ని నిలదీసిన తాత
మీరు ఇచ్చిన చనువు వల్లే వాడికి మీరంటే లెక్కలేకుండా పోయింది అంటుంది పారు. వత్తాసు పలుకుతుంది జ్యోత్స్న. నీ తప్పులు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి జ్యోత్స్న అని మనసులో అనుకుంటాడు కార్తీక్. మరోవైపు ఫైల్స్ పట్టుకొని కారులో వస్తుంటాడు శ్రీధర్. బావకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని బాధపడుతుంది దీప. నా కొడుకుకో లేదా కోడలికో ఏదో జరిగింది. అదేంటో నువ్వు చెప్పట్లేదు అని కంగారు పడతాడు శివన్నారాయణ.
పడిపోయిన సుమిత్ర
ఆ నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని చెప్పలేదు తాత అంటాడు కార్తీక్. నేను తట్టుకోలేను అంటే ఏదో పెద్ద సమస్యే వచ్చిందని కంగారు పడతాడు శివన్నారాయణ. నువ్వు కంగారు పడకు. ఏం జరిగిందో చెప్తాను అని కార్తీక్ మొదలు పెట్టగానే సుమిత్ర అక్కడికి వచ్చి ఏమైందని అడుగుతుంది. నువ్వు, దశరథ మెడికల్ టెస్టులు చేయించుకున్నారు కదా.. మీ ఇద్దరిలో ఒకరికి సమస్య ఉంది. అది కార్తీక్ మన దగ్గర దాచాడని పారు, సుమిత్రతో చెప్తుంది.
నేను అప్పుడే అనుకున్నాను. వీడు ఏదో దాస్తున్నాడని అని అంటుంది సుమిత్ర. ఎవరికి ఏం కాలేదు? నేను ఏ నిజం దాచలేదని కార్తీక్ మాట మారుస్తాడు. ఇప్పటివరకు చెప్తాను అని మళ్లీ ఏం లేదు అంటున్నావు అని సీరియస్ అవుతాడు శివన్నారాయణ. నా కొడుక్కి ఏమైందో లేదో చెప్తావా లేదా అని కార్తీక్ చెంపపై కొడుతాడు. అప్పుడే ఫైల్స్ తో ఎంట్రీ ఇస్తాడు శ్రీధర్. మా ఆయనకు ఏమైందో చెప్పరా అని సుమిత్ర దగ్గుతూ దగ్గుతూ రక్తం కక్కుకొని కింద పడిపోతుంది. అంతా షాక్ అవుతారు.
పరధ్యానంలో కాంచన
మరోవైపు కార్తీక్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది కాంచన. గట్టిగా పిలుస్తుంది అనసూయ. ఏంటి చెల్లెమ్మ ఇక్కడే ఉన్నావు. అన్నిసార్లు పిలిచినా పలకట్లేదు. ఏం ఆలోచిస్తున్నావు అంటుంది అనసూయ. కార్తీక్ ఏదో విషయం చెప్పడానికి మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు మళ్లీ ఏ సమస్య వచ్చి ఉంటుంది అక్క అని అడుగుతుంది కాంచన. కార్తీక్ బాబు చెప్పడానికి ఆలోచిస్తున్నాడంటే ఏదో పెద్ద విషయమే అయ్యుంటుంది. కానీ తను చెప్పేవరకు వెయిట్ చెయ్ అన్నట్లు చెప్తుంది అనసూయ.
నిజం చెప్పిన డాక్టర్
డాక్టర్ హారిక శివన్నారాయణ ఇంటికి వచ్చి సుమిత్రకు ట్రీట్ మెంట్ చేస్తుంది. నా భార్య గురించి నా దగ్గర ఏ నిజం దాచావని కార్తీక్ ను దశరథ నిలదీస్తాడు. మనిషి పోయేవరకు నిజం చెప్పకూడదు అనుకున్నావా అని అంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు కార్తీక్. తనపై ఎందుకు అరుస్తున్నావు. అదే మాట నేను అడుగుతున్నాను చెప్పరా అని కార్తీక్ కాలర్ పట్టుకుంటాడు దశరథ.
అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి మీరు ఎంత అడిగినా కార్తీక్ చెప్పడు అంటుంది. సుమిత్ర గురించి తెలిస్తే దశరథ గారు తట్టుకోలేరని కార్తీక్ కు మాత్రమే సుమిత్ర గారి హెల్త్ కండీషన్ గురించి చెప్పాను అంటుంది డాక్టర్. నా కోడలికి ఏమైందని అడుగుతాడు శివన్నారాయణ. సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అని డాక్టర్ చెప్పగానే అంతా షాక్ అవుతారు. కంగారు పడతారు.
జ్యో, పారులకు దిమ్మతిరిగే షాక్
మీరు ధైర్యంగా ఉండండి. తనకు ట్రీట్మెంట్ చేస్తే తగ్గే స్టేజ్ లోనే వ్యాధి ఉంది. అయితే సుమిత్ర గారికి బోన్ మ్యారో ట్రాన్స్ ప్లంటేషన్ చేయాల్సి ఉంటుంది. సుమిత్రకు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఉన్నారా? అని అడుగుతుంది డాక్టర్. ఎవరూ లేరు కానీ మాకు ఒక కూతురు ఉందని చెప్తాడు దశరథ. ఓకే ఈవిడను చూడగానే సుమిత్ర కూతురని అనుకున్నాను అని దీపను చూసి అంటుంది డాక్టర్. తను దీప, కార్తీక్ భార్య అని చెప్తాడు శివన్నారాయణ. జ్యోత్స్నను చూపించి తనే సుమిత్ర కూతురు.. ఈ ఇంటికి ఏకైక వారసురాలు అని చెప్తాడు.
అయితే సుమిత్రను కాపాడేది జ్యోత్స్ననే. బోన్ మ్యారోను జ్యోత్స్న ఇవ్వొచ్చు. డోనర్ ఇంట్లోనే ఉంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు అంటుంది డాక్టర్. ఒకవేళ మ్యాచ్ కాకాపోతే ఎలా అని అడుగుతుంది పారు. జ్యోత్స్న కన్న కూతురు కాబట్టి కచ్చితంగా మ్యాచ్ అవుతుంది. కాకపోతేనే మ్యాచ్ కాదని డాక్టర్ హారిక్ చెప్పడంతో జ్యో, పారు షాక్ అవుతారు. నిజం ఇలా బయటపడబోతుందా? ఇక మా ఇద్దరినీ ఎవ్వరూ కాపాడలేరు అని మనసులో అనుకుంటుంది పారు. మీరంతా ధైర్యంగా ఉండి సుమిత్రకు నిజం చెప్పమని చెప్పి వెళ్లిపోతుంది డాక్టర్.
కార్తీక్ కి సారీ చెప్పిన తాత, మామ
నేను ఏమనుకొని వచ్చాను? ఇక్కడ ఏం జరిగింది? డెస్టినీ అంటే ఇదేనేమో అని మనసులో అనుకుంటాడు శ్రీధర్. కార్తీక్ ని క్షమించమని అడుగుతారు శివన్నారాయణ, దశరథ. నువ్వు నన్ను కోపంతో కొట్టలేదు తాత, నీ కొడుక్కి ఏమైపోతుందోననే బాధతో కొట్టావు అంటాడు కార్తీక్. ఈ తాతను అర్థం చేసుకున్నందుకు థాంక్స్ రా అని చెప్తాడు శివన్నారాయణ.
ఇప్పటివరకు ఈ నిజాన్ని ఎలా భరించావురా అని ఎమోషనల్ అవుతాడు దశరథ. అత్తకు ఏం కాదు అని దశరథకు ధైర్యం చెప్తాడు కార్తీక్. ముందు లోపలికి వెళ్లి అత్తను చూద్దాం పదండి అంటాడు కార్తీక్. నేను ఇక లోపలికి రాలేను అని వెళ్లిపోతాడు శ్రీధర్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

