- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ చేతికి ప్రూఫ్స్-కడుపులో బిడ్డపై దీప ఒట్టు-కార్తీక్ కంగారు
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ చేతికి ప్రూఫ్స్-కడుపులో బిడ్డపై దీప ఒట్టు-కార్తీక్ కంగారు
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (జనవరి 5వ తేదీ)లో ఫైల్స్ మిస్ అయిన విషయం కార్తీక్ తో చెప్తాడు శ్రీధర్. నిజం చెప్పకపోతే నా కడుపులో ఉన్న బిడ్డపై ఒట్టే అంటుంది దీప. జ్యో నిజ స్వరూపం తెలుసుకుంటాడు శ్రీధర్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో సుమిత్ర గురించి డాక్టర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని బాధపడుతాడు కార్తీక్. దీప పాల గ్లాస్ పట్టుకొని వస్తుంది. హాస్పిటల్ కి వెళ్లి వచ్చిన దగ్గరి నుంచి నువ్వు అదోలా ఉన్నావు బావ. రిపోర్ట్ గురించి అడిగితే చెప్పట్లేదు. లోలోపలే ఏడుస్తున్నావు. నీ బాధ నాకు అర్థమవుతోంది.
మా అమ్మకు ఏమైంది? అసలు నువ్వు ఎందుకంతా బాధపడుతున్నావు అని కార్తీక్ ని అడుగుతుంది దీప. అయింది, మీ అమ్మకు కాదు నీకు అంటాడు కార్తీక్. నాకు ఏమైంది అంటుంది దీప. ప్రతిదాన్ని అనుమానించడం మొదలు పెట్టావు. ఎవ్వరికీ ఏం కాలేదు. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండమని చెప్తాడు కార్తీక్.
ఫైల్స్ మిస్ అయ్యాయి
ఇంతలో కార్తీక్ కి శ్రీధర్ ఫోన్ చేస్తాడు. జ్యోత్స్న తప్పు చేసిందని ప్రూవ్ చేసే ఫైల్స్ మిస్ అయ్యాయని చెప్తాడు. అలా ఎలా జరుగుతుంది? వాటిని తీయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అయినా మీరు అంత నిర్లక్ష్యంగా ఉండడం ఏంటి అని కోపంగా అడుగుతాడు కార్తీక్.
ఆఫీస్ లో నా క్యాబిన్ లోనే పెట్టాను. ఎవరు తీశారో తెలియట్లేదు రా అని కంగారు పడతాడు శ్రీధర్. ఎవరు చేసి ఉంటారో బాగా ఆలోచించమని చెప్పి కాల్ కట్ చేస్తాడు కార్తీక్. ఏమైందని అడుగుతుంది దీప. ఫైల్స్ మిస్ అయ్యాయట. మాస్టారు తప్పు చేశారు అంటాడు కార్తీక్.
నీ భర్తపై నీకు నమ్మకం లేదా?
మీ నాన్న ఏం తప్పు చేశారు అంటూ వాళ్ల దగ్గరికి వస్తుంది కాంచన. ఆఫీసులో ఏవో ముఖ్యమైన ఫైల్స్ మిస్ అయ్యాయట అంటాడు కార్తీక్. మీ నాన్న మళ్లీ ఆఫీసుకు వెళ్తున్నారా అంటుంది కాంచన. తాతే వెళ్లమన్నారు అంటాడు కార్తీక్. మా నాన్నకు మీ నాన్న మీద నమ్మకం బాగానే ఉంది అంటుంది కాంచన.
నీ భర్తపై నీకు నమ్మకం లేదా అంటాడు కార్తీక్. ఉంది, కానీ మీ నాన్నపై ఉంది అంటుంది కాంచన. రెండింటికీ తేడా లేదమ్మా.. నీకు భర్త అయితేనే నాకు తండ్రి అయ్యాడు అంటాడు కార్తీక్. నా మనసుకు నచ్చని కొన్ని బంధాలకు నేను దూరంగానే ఉంటానులే అని చెప్పి వెళ్లిపోతుంది కాంచన.
స్వప్న చేతిలో ప్రూఫ్స్
మరోవైపు బట్టలు సర్దుతూ ఉంటుంది స్వప్న. తన బట్టల పక్కన కాశీ బట్టలు చూసి ఫీల్ అవుతుంది. ఒకప్పుడు నువ్వు నా పక్కన లేకపోతే బతకలేనేమో అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నీ బట్టలు కూడా నా బట్టల పక్కన ఉండడం నాకు నచ్చట్లేదు అని వాటిని బయటకు తీస్తుంది. వాటిలో నుంచి ఫైల్స్, పెన్ డ్రైవ్ బయటపడతాయి. ఇవి జ్యోత్స్న రెస్టారెంట్ ఫైల్స్ కదా.. కాశీ నాన్నకు ఇవ్వడం మర్చిపోయాడేమో అని శ్రీధర్ కి తెచ్చి ఇస్తుంది స్వప్న.
నిజం తెలుసుకున్న శ్రీధర్
కూతురు తెచ్చిన ఫైల్స్ చూసి షాక్ అవుతాడు శ్రీధర్. అల్లుడి చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అంటాడు. ఏమైందని అడుగుతుంది కావేరి. జ్యోత్స్న సీఈఓగా ఉన్నప్పుడు ఆ కంపెనీ అకౌంట్స్ లో చేసిన మోసాన్ని బయటకు తీసి ఫైల్ రెడీ చేశా. వాటిని కాశీ నాకు తెలియకుండా తీసుకొచ్చాడు. నా అల్లుడు నా నమ్మకాన్ని అమ్మేశాడు. అంటే అసలు కల్ప్రిట్ వైరా కాదు జ్యోత్స్న. ఇవన్నీ చేయించింది జ్యోత్స్నే. అందరిముందు తన నిజస్వరూపం బయటపెడుతా అని శివన్నారాయణ ఇంటికి బయల్దేరుతాడు శ్రీధర్.
ప్రిపేర్ గా ఉండాలి కదా..
మరోవైపు స్కూల్ లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది నాన్న.. మీరు అమ్మ రావాలి అని చెప్తుంది శౌర్య. ఇంకా చాలా టైం ఉంది కదా అప్పుడే చెప్తున్నావు ఎందుకు అంటాడు కార్తీక్. మీరు ప్రిపేర్ గా ఉండాలి కదా అని శౌర్య అనడంతో ఆలోచనల్లో పడతాడు కార్తీక్. తల్లిని, భార్యను, కూతురిని ఒక దగ్గర కూర్చొబెట్టి వాళ్లకు టిఫిన్ తినిపిస్తాడు.
బావ నువ్వు మాతో ఏదైనా చెప్పాలా అని అడుగుతుంది దీప. మనిషి జీవితంలో రెండు రకాల సమస్యలు ఉంటాయి. ఒకటి ఆరోగ్య సమస్య. రెండు ఆర్థిక సమస్య. ఒకటి మన సహనానికి పరీక్ష పెడితే, మరొకటి మన గుండె ధైర్యానికి పరీక్ష పెడుతుంది అని అంటాడు. ఇప్పుడు ఏమైందిరా అని అడుగుతుంది కాంచన. ఏం కాలేదు అని మాట మార్చుతాడు కార్తీక్.
బిడ్డ మీద ఒట్టే
దీప, కార్తీక్ దగ్గరికి వెళ్లి నువ్వు నిజం చెప్పకపోతే నా కడుపులో ఉన్న బిడ్డ మీద ఒట్టు ఉంటుంది. కోపంగా రియాక్ట్ అవుతాడు కార్తీక్. నీ మాట వెనక్కి తీసుకో అంటాడు. లేదు అంటుంది దీప. ఆ నిజాన్ని నువ్వు భరించలేవు దీప అంటాడు కార్తీక్. అమ్మకు ఏమైందని అడుగుతుంది దీప.
డాక్టర్ ముందు చెప్పినట్లు అత్తకు ఒంట్లో బాలేదు. చిన్న ఆరోగ్య సమస్య. హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అని చెప్తాడు కార్తీక్. చిన్న సమస్యకు నువ్వు ఇంతలా ఆలోచించవు బావ. నిజం చెప్పు. అమ్మకు ఏం కాదు కదా అంటుంది దీప. ఏం కాదు. ముందు ఈ విషయాన్ని తాతకు చెప్పి ఆ తర్వాత ఇంట్లో వాళ్ల అందరికీ చెప్పాలి అంటాడు కార్తీక్. సరే పదా వెళ్దాం అంటుంది దీప.
నిజం తెలుసుకున్న శివన్నారాయణ
మరోవైపు కార్తీక్ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు శివన్నారాయణ. కార్తీక్ దీప ఇంట్లోకి రాగానే.. నువ్వు ఏదైనా మర్చిపోయావా కార్తీక్ అని అడుగుతాడు. లేదు తాత అంటాడు కార్తీక్. సుమిత్ర మెడికల్ రిపోర్ట్స్ చూపించి.. వీటిని నువ్వు కావాలనే కారులో మర్చిపోయావు కదా అంటాడు శివన్నారాయణ. ఇంట్లో పెట్టాలి అనుకొని మర్చిపోయాను తాత అంటాడు కార్తీక్.
నేను ఎవరినీ అంత ఈజీగా నమ్మనురా. ఈ ఫైల్ ఓపెన్ చేశా.. అందులో డాక్టర్ హారిక గారి ఫోన్ నెంబర్ ఉంది. ఆమెకు కాల్ చేశా. డాక్టర్ హారిక ఏం చెప్పారో నువ్వు చెప్తావా? లేక నన్ను చెప్పమంటావా? అని అడుగుతాడు శివన్నారాయణ. కంగారు పడతాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

