MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: సూపర్ సస్పెన్స్ ఎపిసోడ్- దీపను చంపబోయిన జ్యో- అయోమయంలో కార్తీక్

Karthika Deepam 2 Today Episode: సూపర్ సస్పెన్స్ ఎపిసోడ్- దీపను చంపబోయిన జ్యో- అయోమయంలో కార్తీక్

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఏప్రిల్ 3వ తేదీ)లో దీపను మేడ మీద నుంచి తోసేయబోయిన జ్యోత్స్న. ఆపిన కార్తీక్. ఫుడ్ లో విషం పెట్టినట్లు బెదిరించిన జ్యో. మంచిగా నటిస్తూనే దీప చావుకు మరో ప్లాన్ వేసిన జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...  

3 Min read
Author : Kavitha G
Published : Apr 03 2026, 09:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో కార్తీక్ హడావిడాగా దాసు దగ్గరికి వెళ్తాడు. అప్పటికే ఫోన్ లో మాట్లాడుతున్న దాసుతో మామయ్య నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. దాసు ఫోన్ కట్ చేసి ఏమైంది అల్లుడు? ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అంటాడు. జ్యోత్స్నకు నిజం తెలిసిపోయింది మామయ్య. తను డీఎన్ఏ టెస్టు చేయించింది అని చెప్తాడు. మరి నిజం తెలిసినా ఎందుకు సైలెంట్ గా ఉంది అంటాడు దాసు. జ్యోత్స్న సైలెంట్ గా లేదు మామయ్య. ఏదో పెద్ద ప్లానే చేస్తోంది అని కాసేపు ఆలోచించి, దీప ప్రమాదంలో ఉంది. వెంటనే కాపాడాలి అని దీప కోసం పరిగెడతాడు కార్తీక్. వెనకాలే వెళ్తాడు దాసు.

28
కార్తీక్ కంగారు
Image Credit : Jiohotstar

కార్తీక్ కంగారు

మరోవైపు దీప మేడ మీదకు వెళ్లి పూల మొక్కలకు నీళ్లు పడుతుంటుంది. జ్యోత్స్న కూడా మేడ మీదకు వెళ్తుంటుంది. కింద కార్తీక్ దీప కోసం వెతుకుతుంటాడు. పారును దీప కనిపించిందా అని అడిగితే లేదు రా అని చెప్తుంది. మరి జ్యోత్స్న అని అడిగితే ఇందాక మేడ మీదకు వెళ్లడం చూశాను అని చెప్తుంది. శౌర్యను అమ్మ ఎక్కడ అని అడిగితే.. పూల కోసం మేడ మీదకు వెళ్లిందని చెప్తుంది. కార్తీక్, దాసు కంగారుగా మేడ మీదకు పరుగెడతారు.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: జ్యో ప్లాన్-కార్తీక్ డౌట్-పారు అతి ప్రేమ-జ్యో చెంప పగలకొట్టిన పారు
Related image2
Karthika Deepam 2 Today Episode:దీప, శౌర్యలపై పారు ప్రేమ-దీప చావుకు ప్లాన్-నిజం తెలుసుకున్న కార్తీక్
38
దీపను తోసేయబోయిన జ్యోత్స్న
Image Credit : Jiohotstar

దీపను తోసేయబోయిన జ్యోత్స్న

దీపను వెనకాల నుంచి తోసేయాలి అనుకుంటుంది జ్యోత్స్న. కరెక్ట్ గా జ్యోత్స్న దీప దగ్గరికి వెళ్లేసరికి కార్తీక్ వచ్చి దీప అని గట్టిగా పిలుస్తాడు. షాకై వెనక్కి జరుగుతుంది జ్యోత్స్న. ఏంటి బావ కంగారు పడుతున్నావు. నేను దీపను మేడ మీద నుంచి తోసేస్తాను అనుకున్నావా అని అడుగుతుంది. నేను మరీ అలాంటి దాన్ని కాదు బావ. అంతకుమించి ప్రమాదకరమైనదాన్ని అంటుంది జ్యో. నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో ఇక్కడితో ఆపేయ్ అని జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. పద బావ కిందికి వెళ్లి మంచి భోజనం చేద్దాం. ఇది మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటుంది జ్యోత్స్న.

48
కార్తీక్ డౌట్
Image Credit : Jiohotstar

కార్తీక్ డౌట్

జ్యోత్స్న ఫుడ్ లో విషం పెట్టిందని అనుమానపడుతాడు కార్తీక్. దాని గురించి ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుంటాడు. ఇంతలో అందరూ భోజనానికి రెడీ అవుతుంటారు. కాసేపు ఆగండి తాత తిందాము అంటాడు కార్తీక్. మనకు స్పెషల్ గా భోజనాలు తెప్పించాను బావ.. అన్ని నేనే సెలెక్ట్ చేశాను అంటుంది జ్యోత్స్న. దాంతో కార్తీక్ ఇంకా టెన్షన్ పడుతుంటాడు. అందరూ తినడానికి కూర్చున్నాక.. ఈ రోజు అందరికీ నేనే వడ్డిస్తాను అంటుంది జ్యోత్స్న. తినే అన్నంలో విషం కలిపి అందరినీ చంపాలి అనుకుంటోందా అని డౌట్ పడతాడు కార్తీక్.

58
దీప ఎందుకు స్పెషల్ గెస్ట్
Image Credit : Jiohotstar

దీప ఎందుకు స్పెషల్ గెస్ట్

అందరికీ వడ్డించడం అంటే కష్టమేమో అంటాడు దశరథ. అయితే మన స్పెషల్ గెస్ట్ దీపకు వడ్డిస్తాను అంటుంది జ్యోత్స్న. దీప ఎందుకు స్పెషల్ గెస్ట్ అంటాడు శ్రీధర్. మా మమ్మీ ప్రాణాలు కాపాడింది దీపే కదా అంటుంది జ్యోత్స్న. అదేంటి నువ్వు కదా కాపాడింది అంటాడు శ్రీధర్. బావ దీనికి నువ్వు సమాధానం చెప్తావా.. నువ్వైతే కరెక్ట్ గా చెప్తావు అంటుంది జ్యోత్స్న. నువ్వు ఏదో అనుకొని ఉంటావు కదా.. నువ్వే చెప్పు అంటాడు కార్తీక్. ఈ రోజు దీప స్పెషల్ గెస్ట్ కాబట్టి ఫస్ట్ ముద్ద తనే తింటుంది. అవసరమైతే నేనే కలిపి తినిపిస్తాను అంటుంది జ్యోత్స్న. 

68
జ్యోత్స్న షాక్
Image Credit : Jiohotstar

జ్యోత్స్న షాక్

లేదు నేను తినిపిస్తాను అని పారు దీపకు తినిపించబోతుంది. కార్తీక్, పారును పిలిచి ఆగు పారు.. మొదటి ముద్ద దీప తినడం కంటే దీప, జ్యోత్స్నకు తినిపిస్తే సూపర్ గా ఉంటుంది. అది కదా స్పెషల్ అంటే అంటాడు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దీప జ్యోత్స్నకు తినిపిస్తుంది. జ్యోత్స్న తినడం చూసి కార్తీక్ షాక్ అవుతాడు. అంటే జ్యోత్స్న ప్లాన్ చేసింది ఇది కాదు ఇంకేదో ఉందని మనసులో అనుకుంటాడు. దీప, జ్యోత్స్నలను చూసి సుమిత్ర సంతోషపడుతుంది.

78
బావే పెళ్లికొడుకు
Image Credit : Jiohotstar

బావే పెళ్లికొడుకు

ఆ తర్వాత అందరూ హాల్లోకి వస్తారు. జ్యోత్స్నను పట్టుకొని మా సంతోషం కోసం ఇంత చేశావు. పెళ్లి కూడా చేసుకో అంటుంది సుమిత్ర. చేసుకుంటాను మమ్మీ పెళ్లి కొడుకు కూడా ఇక్కడే ఉన్నాడు అంటుంది జ్యోత్స్న. ఎవరు అని అంతా అడుగుతారు. అదిగే బావే నా పెళ్లి కొడుకు అని షాక్ ఇస్తుంది జ్యోత్స్న. మా బావ పెళ్లికొడుకు ఏంటి అని దీప కోపంగా అడుగుతుంది. కాస్త ఆగు దీప.. నన్ను పూర్తి చేయనివ్వు. బావే నాకు మంచి పెళ్లి కొడుకును సెలెక్ట్ చేస్తాడని చెప్తున్నాను అని కవర్ చేస్తుంది జ్యోత్స్న. మీ అమ్మానాన్న మంచి సంబంధం చూస్తారులే అంటుంది కాంచన.

88
పారు విజిల్
Image Credit : Jiohotstar

పారు విజిల్

జ్యోత్స్న పెళ్లై వెళ్లిపోతే.. దీపను దత్తత తీసుకోమని దశరథకు చెప్తాను. దీపను ఈ ఇంటి వారసురాలని చేస్తాను అని దాసుతో చెప్తుంది పారు. నీ ప్లాన్ సూపర్ అమ్మా అంటాడు దాసు. ఫ్యామిలీ అన్న తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. కానీ వాటిని అలాగే వదిలేస్తే మనుషుల మధ్య దూరం పెంచుకుంటూ పోతాయి అంటుంది జ్యోత్స్న.

ఆ మాటకు విజిల్ వేసి చాలా బాగా చెప్పావు అంటుంది పారు. దూరాన్ని ఎంత దగ్గర చేసుకుంటే అంత మంచిది. ఒక రకంగా చెప్పాలంటే దీప కూడా ఈ ఇంట్లో ఉండొచ్చు. దీప లాంటి ఒక మంచి అమ్మాయి ఇంట్లో ఉంటే దేవుడి గదిలో దీపం ఉన్నట్లే అంటుంది పారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu April 3 Episode: నా కాపురం కూల్చేశారంటూ తల్లిదండ్రులను కడిగి పారేసిన వల్లి, పాపం చందు
Recommended image2
Karthika Deepam 2 Today Episode:దీప, శౌర్యలపై పారు ప్రేమ-దీప చావుకు ప్లాన్-నిజం తెలుసుకున్న కార్తీక్
Recommended image3
Illu Illalu Pillalu April 2 Episode: వల్లి బాగోతం మొత్తం బట్టబయలు.. ఇంటి నుంచి గెంటేసిన చందు
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యో ప్లాన్-కార్తీక్ డౌట్-పారు అతి ప్రేమ-జ్యో చెంప పగలకొట్టిన పారు
Recommended image2
Karthika Deepam 2 Today Episode:దీప, శౌర్యలపై పారు ప్రేమ-దీప చావుకు ప్లాన్-నిజం తెలుసుకున్న కార్తీక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved