MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode:కార్తీక్, దీపలపై దశరథ ఫైర్-కార్తీక్ ఎమోషనల్-చావు బ్రతుకుల్లో సుమిత్ర

Karthika Deepam 2 Today Episode:కార్తీక్, దీపలపై దశరథ ఫైర్-కార్తీక్ ఎమోషనల్-చావు బ్రతుకుల్లో సుమిత్ర

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మార్చి 2వ తేదీ)లో కార్తీక్, దీపలను హంతుకులన్న దశరథ. అత్త చనిపోయినా పర్వాలేదా అన్న కార్తీక్. పారిజాతం పిన్నికి, మీకు తేడా లేదన్న దశరథ. సీరియస్ కండిషన్ లో సుమిత్ర. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : Mar 02 2026, 08:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో ఆపరేషన్ చేయడానికి నేను అస్సలు ఒప్పుకోను అంటాడు దశరథ. కార్తీక్ ఏదో చెప్పబోతుంటే, నువ్వు మాట్లాడకు అయినా, నా కూతురు కడుపులో బిడ్డను చంపడానికి నువ్వు ఎవడ్రా? అని కార్తీక్ పై సీరియస్ అవుతాడు దశరథ. అది కాదు నాన్న అని దీప మాట్లాడబోతుంటే అసలు నువ్వు తల్లివేనా? కడుపులో బిడ్డ చచ్చిపోయినా పర్వాలేదని డాక్టర్ కు ఎలా చెప్తావు అని దీపపై ఫైర్ అవుతాడు దశరథ.

నిన్ను చంపాలనుకున్న పారిజాతం పిన్నికి, నీ బిడ్డను చంపాలి అనుకున్న నీకు తేడా ఏంటీ? ఇద్దరూ హంతకులే అంటాడు దశరథ. కార్తీక్ ఏదో చెప్పబోతుంటే నువ్వు కూడా హంతకుడివేరా. బిడ్డలకు ఏదైనా అయితే తల్లడిల్లే తల్లిదండ్రులను చూశాను. కానీ మీలాంటి వాళ్లను నేను ఎక్కడా చూడలేదు. నువ్వు హాస్పిటల్ కి రావద్దు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. అందుకే నీ వెనకే వచ్చాను. నేను ఇక్కడకు రావడం మంచిదైంది. లేకపోతే నా కూతురు కడుపులో బిడ్డను నువ్వు చంపేసేవాడివి అని కార్తీక్ తో అంటాడు దశరథ.

27
అత్త చచ్చిపోయినా పర్వాలేదా..
Image Credit : Jiohotstar

అత్త చచ్చిపోయినా పర్వాలేదా..

అయితే ఒక మాట చెప్పు మామయ్య.. అత్త చచ్చిపోయినా పర్వాలేదా.. అని అడుగుతాడు కార్తీక్. సైలెంట్ అవుతాడు దశరథ. అత్త ప్రాణాలు కాపాడటానికి వేరే దారి ఉంటే నా బిడ్డను నేను ఎందుకు వదులుకుంటాను? నువ్వు చెప్పు.. అత్తను కాపాడటానికి మరో ఆప్షన్ ఉందా అని దశరథను అడుగుతాడు కార్తీక్. నేనేదో దీపను బలవంతంగా ఒప్పించి బిడ్డ ప్రాణాలు తీస్తున్నట్లు చెబుతున్నావు. 

నా బిడ్డపై నాకు ఆశలు ఉంటాయి. నా బిడ్డను చేతుల్లోకి తీసుకోవాలని నేను మాత్రం అనుకోనా? అని ఎమోషనల్ అవుతాడు కార్తీక్. నువ్వు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోనురా.. నా కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలు తీయొద్దు అంటాడు దశరథ. అయితే అత్త చచ్చిపోయినా పర్వాలేదని చెప్పు అంటాడు కార్తీక్. నీ భార్య పట్ల నీకు బాధ్యత లేదా? నీ భార్య నీ కళ్ల ముందే చచ్చిపోయినా పర్వాలేదా? నా బిడ్డ చనిపోతుందని నువ్వే ఇంత బాధపడితే, మేమెంత బాధపడాలి? అంటాడు కార్తీక్.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode:దీపకు కాలు అడ్డుపెట్టిన జ్యో-దశరథ ఉగ్రరూపం-పారు, జ్యోలకు బిగ్ షాక్
Related image2
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలకు బిగ్ షాక్- స్వప్న, కాశీ విడాకులు- దశరథ ఆవేదన
37
దశరథ ఎమోషనల్
Image Credit : Jiohotstar

దశరథ ఎమోషనల్

కూతురి త్యాగానికి కన్నీళ్లు పెట్టుకుంటాడు దశరథ. నువ్వు అసలు మా దగ్గరికి ఎందుకు వచ్చావు అమ్మా? ఈ తండ్రిని ఎందుకు కలిశావ్? ఇన్నేళ్లు కష్టాలు భరించావు. అవి చాలవి అన్నట్లు మరో కష్టం మోసేందుకు సిద్ధం అయ్యావు. నువ్వు నా కన్న కూతురివా.. లేక నా కన్న తల్లివా? నీ కాళ్లు మొక్కాలని ఉంది అని దీపకు చేతులెత్తి దండం పెడతాడు దశరథ. నువ్వు ఇంటికి వెళ్లి ఒకసారి అత్తను చూడు. అప్పుడు మా నిర్ణయం కరెక్ట్ అని నీకు అర్థమవుతుందని దశరథను అక్కడినుంచి పంపిస్తాడు కార్తీక్.

47
దీపను అడ్మిట్ చేయాలి
Image Credit : Jiohotstar

దీపను అడ్మిట్ చేయాలి

తర్వాత కార్తీక్, దీప కలిసి డాక్టర్ దగ్గరకు వెళ్తారు. ఏం నిర్ణయించుకున్నారు? అని అడుగుతుంది డాక్టర్. ఆపరేషన్ కు రెడీ చేయండి అని చెప్తాడు కార్తీక్. నేను ఎన్నో ఆపరేషన్లు చేశాను. కానీ ఎవరి విషయాన్ని ఇంత పర్సనల్ గా తీసుకోలేదు. మీకు హెల్ప్ చేయాలి అనుకున్నాను. కానీ నేను ఈ టెన్షన్ తీసుకోలేకపోతున్నాను కార్తీక్ అంటుంది డాక్టర్. ఇకపై మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్నీ నేను చూసుకుంటాను. మేం మా అత్తను కాపాడాలని అనుకున్నాం. ఆపరేషన్ కు దీప రెడీగా ఉంది, ఏర్పాట్లు చేయండి అని చెప్తాడు కార్తీక్. అయితే దీపను హాస్పిటల్ లో అడ్మిట్ చేయాలని చెప్తుంది డాక్టర్. సరే చేస్తాను అని చెప్పి ఇంటికి బయల్దేరుతారు కార్తీక్, దీప.

57
సీరయస్ కండిషన్లో సుమిత్ర
Image Credit : Jiohotstar

సీరయస్ కండిషన్లో సుమిత్ర

మరోవైపు సుమిత్రకు ఊపిరి ఆడకుండా దగ్గు వస్తుంది. దగ్గుతూ రక్తం కక్కుకున్న సుమిత్రను చూసి కంగారు పడతాడు దశరథ. అందరూ వస్తారు. జ్యోత్స్న ముందుకు వచ్చి బ్లెడ్ నేను క్లీన్ చేస్తానని అంటే, నువ్వు ముట్టుకోకు నేనే చేస్తానని చెప్తాడు దశరథ. ఇంతలో కార్తీక్, దీప కూడా వస్తారు. డాక్టర్ కు కాల్ చేసి ఆపరేషన్ కి రెడీ చేయమని చెప్పు దశరథ అంటాడు శివన్నారాయణ.

దశరథ దీప మొహం చూసి సైలెంట్ గా ఉంటాడు. మీరు కూడా రెగ్యులర్ చెకప్ కి వెళ్లాలి అన్నారు కదా ఏమైంది అని కార్తీక్ ని అడుగుతాడు శివన్నారాయణ. మాది ఏం లేదు. మామయ్యే చెప్పాలి అంటాడు కార్తీక్. అదేంటి అంటాడు శివన్నారాయణ. ఈ మధ్య దీప గురించి కూడా మామయ్యే చూసుకుంటున్నాడు అని చెప్తాడు కార్తీక్.

67
బిడ్డ క్షేమంగా ఉందా..
Image Credit : Jiohotstar

బిడ్డ క్షేమంగా ఉందా..

డాక్టర్ ఏం చెప్పారు దీప. బిడ్డ క్షేమంగా ఉందా? ఎదుగుదల బాగుందా.. అని అడుగుతుంది సుమిత్ర. ఇప్పుడు అవన్నీ నీకు ఎందుకు సుమిత్ర, నువ్వు పడుకో అంటాడ దశరథ. కళ్లు మూస్తే మళ్లీ తెరుస్తానో లేదో అని భయంగా ఉందండి అంటుంది సుమిత్ర. ఎమోషనల్ అవుతాడు దశరథ. అయినా నన్ను కాపాడుకోవడానికి నా కూతురు ఉంది కదా ధైర్యంగా నిద్రపోతాను అని నిద్రపోతుంది సుమిత్ర. 

77
దీప ఏడుపు
Image Credit : Jiohotstar

దీప ఏడుపు

త్వరగా డాక్టర్ తో మాట్లాడి ఆపరేషన్ కు ఏర్పాటు చేయించమని దశరథకు చెప్తాడు శివన్నారాయణ. అంతా అక్కడినుంచి వెళ్లిపోయాక.. తల్లిని, ఆమె వామిటింగ్ చేసుకున్న బ్లెడ్ ని చూసి ఏడుస్తుంది దీప. అంతటితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jabardasth Naresh Remuneration: జబర్దస్త్ నరేష్‌ ఈవెంట్‌కి తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా? చాలా ఖరీదైన కమెడియన్‌
Recommended image2
వెంకటేష్ వద్దన్నాడు.. బాలయ్య సై అన్నాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీ హిట్.. ఆ సినిమా ఏదంటే
Recommended image3
మహేష్ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో.. ఆ మూవీ ఏదంటే.?
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:దీపకు కాలు అడ్డుపెట్టిన జ్యో-దశరథ ఉగ్రరూపం-పారు, జ్యోలకు బిగ్ షాక్
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలకు బిగ్ షాక్- స్వప్న, కాశీ విడాకులు- దశరథ ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved