MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode:దీప, శౌర్యలపై పారు ప్రేమ-దీప చావుకు ప్లాన్-నిజం తెలుసుకున్న కార్తీక్

Karthika Deepam 2 Today Episode:దీప, శౌర్యలపై పారు ప్రేమ-దీప చావుకు ప్లాన్-నిజం తెలుసుకున్న కార్తీక్

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఏప్రిల్ 2వ తేదీ)లో దీప, శౌర్యలపై ప్రేమ కురిపించిన పారు. ఫ్రస్టేట్ అయిన జ్యో. దీప చావుకు ముహుర్తం పెట్టిన జ్యో. డీఎన్ఏ రిపోర్ట్స్ చూసిన కార్తీక్. జ్యో ప్లాన్ తెలుసుకున్న కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే  

3 Min read
Author : Kavitha G
Published : Apr 02 2026, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కార్తీక దీపం 2 సీరయల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరయల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో జ్యోత్స్నను తగిలి శౌర్య కిందపడుతుంది. జ్యోత్స్న చెంప చెల్లుమనిపించి శౌర్యకు సారీ చెప్పమని అడుగుతుంది పారు. నేనుందుకు చెప్పాలి.. అదే నన్ను తగిలి కిందపడింది అంటుంది జ్యోత్స్న. పర్లేదు.. నాకేమి దెబ్బలు తగలలేదు వదిలెయ్ అంటుంది శౌర్య. దెబ్బ నీకు కాదు, నాకు తగిలింది.. జ్యోత్స్న సారీ చెప్పాల్సిందే అంటుంది పారు. సారీనే కదా చెప్పేయ్ జ్యోత్స్న అని ఫ్యామిలీ అంతా కూడా పారుకే సపోర్ట్ చేస్తుంది. దాంతో జ్యోత్స్న సారీ చెప్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
దీపపై పారు ప్రేమ
Image Credit : Jiohotstar

దీపపై పారు ప్రేమ

తర్వాత దీపను సోఫాలో కూర్చోబెట్టి, కిచెన్ లోకి వెళ్తుంది పారు. జ్యూస్ తో తిరిగి వచ్చిన పారును చూసి.. పారుకు మనుమరాలు అంటే ఎంత ప్రేమ కొట్టినా కూడా మళ్లీ జ్యూస్ తెచ్చిందని అంటాడు కార్తీక్. మనుమరాలి కోసమే తెచ్చాను అని జ్యూస్ గ్లాస్ దీపకు ఇస్తుంది పారు. అంతా షాక్ అవుతారు.

తను జ్యోత్స్న కాదు దీప అంటాడు శివన్నారాయణ. కొడుకు కూతురు మనుమరాలు అయినప్పుడు, మనుమడి భార్య కూడా మనుమరాలు అవుతుంది కదా అంటుంది పారు. అయినా కడుపుతో ఉన్న మనిషి జ్యూసులు తాగితే తప్పేంటి అని దీపకు జ్యూస్ ఇస్తుంది. దీప వద్దంటే.. నీకు అన్నీ నా పోలికలే అని నోరు జారుతుంది పారు. అంతా షాక్ అవుతారు. దీపకు నీ పోలికలు ఎలా వస్తాయి అని ప్రశ్నిస్తారు.

ఒకప్పుడు ఈ ఇంట్లో నేను పనిమనిషినే. ఇప్పుడు తను పనిమనిషే. ఆ స్థానంలో ఉన్న వాళ్ల బాధలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అందుకే పోలికలు కలిశాయని చెప్పాను అని కవర్ చేస్తుంది పారు. అందరి ముందు తాగితే దిష్టి తగులుతుంది, పైకి వెళ్లి జ్యూస్ తాగమని దీపను పంపిస్తుంది పారు.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: దీపపై పారు ప్రేమ- దీపపై జ్యోత్స్న మరో కుట్ర- పారు కాపాడుతుందా?
Related image2
Karthika Deepam 2 Today Episode: జ్యో ప్లాన్-కార్తీక్ డౌట్-పారు అతి ప్రేమ-జ్యో చెంప పగలకొట్టిన పారు
36
దీప చావుకు ముహుర్తం
Image Credit : Jiohotstar

దీప చావుకు ముహుర్తం

జ్యోత్స్న దీప దగ్గరకు వెళ్లి మా గ్రానీని ఏం చేశారు మీ భజన చేస్తోంది అని అడుగుతుంది జ్యోత్స్న. మనుషులు అన్నాక మారుతారు. ఒకప్పుడు మంచనీళ్లు కూడా ఇవ్వని పారిజాతం ఇప్పుడు జ్యూస్ తీసుకొచ్చింది అంటుంది దీప. నీ ఆరోగ్యం ఎలా ఉంది.. ఒకరిని కాపాడావు కదా అంటుంది జ్యోత్స్న. డౌట్ గా చూస్తుంది దీప. 

అంటే కడుపులో బిడ్డను ఫస్ట్ వద్దనుకొని ఆ తర్వాత కావాలి అనుకున్నారు కదా.. దాని గురించే మాట్లాడుతున్నాను అంటుంది జ్యోత్స్న. మీ అమ్మానాన్న బతికే ఉన్నారంటావు కదా ఎక్కడున్నారో తెలుసా అంటుంది జ్యోత్స్న. తెలిస్తే ముందు నీకే చెప్తాను అంటుంది దీప. మీ అమ్మానాన్న ఎవరో తెలిసే నాటికి నువ్వు ఉండవులే దీప అంటుంది జ్యోత్స్న. అనుమానంగా చూసి వెళ్లిపోతుంది దీప. నీ చావుకు ముహూర్తం పెట్టాను దీప. ఇదే నీకు ఆఖరి రోజు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

46
శౌర్యను చూసి మురిసిపోయిన పారు
Image Credit : Jiohotstar

శౌర్యను చూసి మురిసిపోయిన పారు

మరోవైపు శౌర్యను తన గదిలోకి పిలిచి చాక్లెట్స్ ఇస్తుంది పారు. సంతోషపడుతుంది శౌర్య. నాకు జ్యో రూమ్ లో ఆడుకోవాలని ఉంది.. కానీ తను తిడుతుంది అంటుంది శౌర్య. ఎందుకు తిడుతుంది పదా నేను ఉన్నాను కదా అని జ్యోత్స్న గదికి వెళ్తారు శౌర్య, పారు. శౌర్య బెడ్ మీద ఆడుకుంటూ ఉంటే పారు మురిసిపోతుంది. ఆ బెడ్ మీద దిండు కింద డీఎన్ఏ రిపోర్ట్స్ ఉంటాయి. అవి పారు కంటపడగానే... ఏంటివి అని తీసి చూస్తుంది. అవి ఇంగ్లీష్ లో ఉండటంతో చదవలేక ఎవరితో అయినా చదివించాలి అనుకుంటుంది.

56
కార్తీక్ షాక్
Image Credit : Jiohotstar

కార్తీక్ షాక్

అంతలో కార్తీక్ కనిపిస్తే ఇటు రా అని పిలిచి.. ఇందులో ఏముందో చదువు అంటుంది. కార్తీక్ డీఎన్ఏ రిపోర్ట్ చూసి షాక్ అవుతాడు. అంటే జ్యోత్స్నకు నిజం తెలిసే ఇదంతా చేస్తోందని మనసులో అనుకుంటాడు. అంతలో జ్యోత్స్న అక్కడికి వస్తుంది. మీరు నా గదిలో ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు అని చెప్పి, రిపోర్ట్స్ ని దిండుకింద పెట్టేస్తుంది పారు.

66
జ్యోత్స్న అనుమానం
Image Credit : Jiohotstar

జ్యోత్స్న అనుమానం

వాళ్లు వెళ్లాక జ్యోత్స్న దిండు కింద రిపోర్ట్స్ చెక్ చేస్తుంది. కవర్ ఎవరో తీసినట్లున్నారే అని అనుకుంటుంది. బావకు నిజం తెలిసిందా? ఒకవేళ తెలిస్తే నేను చేయాల్సిన పని చేసే టైం వచ్చినట్లే.. దీప ఎక్కడున్నావు, నీతోనే మొదలు పెట్టాలి అంటుంది జ్యోత్స్న. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: దీపపై పారు ప్రేమ- దీపపై జ్యోత్స్న మరో కుట్ర- పారు కాపాడుతుందా?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యో ప్లాన్-కార్తీక్ డౌట్-పారు అతి ప్రేమ-జ్యో చెంప పగలకొట్టిన పారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved