- Home
- Entertainment
- Apoorva: 10 వారాల నుంచి తేరగా తింటూ కూర్చుంటోంది, వర్షిణిని ఏకిపారేసిన అపూర్వ.. 10 నిమిషాలు దుమ్ము దుమారం
Apoorva: 10 వారాల నుంచి తేరగా తింటూ కూర్చుంటోంది, వర్షిణిని ఏకిపారేసిన అపూర్వ.. 10 నిమిషాలు దుమ్ము దుమారం
బిగ్ బాస్ హౌస్ లో 71వ రోజు నామినేషన్స్ ప్రక్రియ చాలా రసవత్తరంగా సాగింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఒక్కొక్కరుగా వచ్చి ఇంట్లో ఉన్న వారిని నామినేట్ చేసి వెళ్లారు.

Bigg Boss Telugu 10
బిగ్ బాస్ హౌస్ లో సోమవారం రోజు నామినేషన్స్ ప్రక్రియ చాలా వైవిధ్యంగా సాగింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ చేత నామినేషన్స్ ప్రక్రియని బిగ్ బాస్ చేయించారు. ఎలిమినేట్ అయిన వాళ్ళు ఒక్కొక్కరుగా రావడం.. ఒకరిని నామినేట్ చేసి వెళ్లడం జరిగింది. ముందుగా హౌస్ లోకి షాలిని ఎంట్రీ ఇచ్చింది.
ముకేశ్ ని ఉక్కిరి బిక్కిరి చేసిన మిథిలేష్
షాలిని నీతూని నామినేట్ చేసింది. నీతూ పిరికి వారు అని, ఫిజికల్ టాస్క్ లు ఆడలేరు అని షాలిని ఆరోపించి నామినేట్ చేసింది. ఆ తర్వాత హౌస్ నుంచి 15 లక్షలు ఎత్తుకుపోయిన మిథిలేష్ ఎంట్రీ ఇచ్చాడు. మిథిలేష్ ముకేశ్ ని నామినేట్ చేశాడు. ముకేశ్ ని బుల్లెట్స్ లాంటి ప్రశ్నలతో మిథిలేష్ ఉక్కిరి బిక్కిరి చేశారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ని పక్కన పెట్టి కూడా రోహిత్ తో ముకేశ్ డీల్ పెట్టుకున్నాడు. ఝాన్సీని సేవ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ స్వార్థం కోసం చేయలేదు. వర్షిణిని కాపాడడం కోసం ఝాన్సీని బలి చేశాడు అంటూ మిథిలేష్ తెలిపారు. దీనితో కాసేపు మిథిలేష్, ముకేశ్ మధ్య వాగ్వాదం జరిగింది.
10 వారాల నుంచి తేరగా తింటోంది
ఆ తర్వాత వచ్చిన దక్షి నీతూని నామినేట్ చేసింది. ఆ తర్వాత అపూర్వ తనదైన శైలిలో యాటిట్యూడ్ ప్రదర్శిస్తూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నేను ఇప్పుడు ఎవరిని నామినేట్ చేయబోతున్నాను అంటే.. హౌస్ లో 10 వారాల నుంచి తేరగా తింటూ, ఏపనీ చేయకుండా కూర్చుని ఉన్న ఒక వ్యక్తిని. ఆ వ్యక్తికి ఫిజికల్ టాస్క్ లు అంటే భయం. బి అండ్ పి అనే మాటలు మాట్లాడుతుంది.. ఆమె ఎవరో కాదు వర్షిణి అంటూ అపూర్వ చెలరేగిపోయింది.
ముకేశ్ పై సెటైర్లు
బిగ్ బాస్ అంటే పర్సనాలిటీ షో. అలాంటి షోలో బి అండ్ పి వాడడం ఏంటి అంటూ అపూర్వ దుమ్మెత్తి పోసింది. 10 నిమిషాల పాటు అపూర్వ వర్షిణికి ఊపిరి తీసుకుని గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో ముకేశ్ పై కూడా కొన్ని సెటైర్లువేసింది. ఆ తర్వాత వచ్చిన ఝాన్సీ.. దేబ్జానీని నామినేట్ చేసింది.








