- Home
- Entertainment
- Swetha Naidu Remuneration: 5 వారాలకు శ్వేత నాయుడు బిగ్ బాస్ పారితోషికం ఇదే.. గట్టిగానే కొట్టిందిగా
Swetha Naidu Remuneration: 5 వారాలకు శ్వేత నాయుడు బిగ్ బాస్ పారితోషికం ఇదే.. గట్టిగానే కొట్టిందిగా
బిగ్ బాస్ తెలుగు 10 పదో వారంలో శ్వేత నాయుడు ఎలిమినేట్ అయ్యింది. మరి ఐదు వారాలు ఉన్న ఆమెకి ఎంత పారితోషికం దక్కింది అనేది చూస్తే, గట్టిగానే పొందిందని చెప్పొచ్చు.

శ్వేత నాయుడు ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ అనేక ట్విస్ట్ లు, టర్న్ లతో సాగుతోంది. ప్రారంభంలో ట్విస్ట్ లు, టర్న్ లు చాలానే చూశాం. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఆ జోరు తగ్గింది. ఇప్పుడు మళ్లీ నార్మల్‌కి వచ్చింది. పెద్దగా ఇంట్రెస్ట్ క్రియేట్ కావడం లేదు. చాలా చప్పగా సాగుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో పదోవారం ఎండింగ్ సెలబ్రేషన్ మూడ్‌లో సాగింది. దాదాపు మూడు గంటలపాటు ఈ ఎపిసోడ్‌ని ప్లాన్ చేశారు. కంటెస్టెంట్లకి సపోర్ట్ చేయడానికి సెలబ్రిటీలు, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఈ క్రమంలోనే ఎలిమినేషన్ కూడా జరిగింది. పదోవారం ఊహించినట్టుగానే శ్వేత నాయుడు ఎలిమినేట్ అయ్యింది.
కంటెంట్ ఇవ్వడంలో ఫెయిల్ అయిన శ్వేత నాయుడు
శ్వేత నాయుడు డాన్సర్. పలు డాన్సు షోస్‌లో మెప్పించింది. సెలబ్రిటీ హోదాలోనే హౌజ్‌లోకి అడుగుపెట్టింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఐదో వారంలో ఆమె ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చిన ఐదు వారాల్లోనే ఎలిమినేట్ అయ్యింది. కానీ ఐదు వారాలు ఉండటమే ఎక్కువ అనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఎందుకంటే శ్వేత నాయుడు కంటెంట్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యింది. హౌజ్‌లో సైలెంట్‌గా ఉంటోంది. ఆమె నుంచి బయటకు కంటెంట్ రావడం లేదు. దీంతో శ్వేత హౌజ్‌లో అనవసరం అనే కామెంట్స్ వినిపించాయి.
శ్వేత నాయుడు బిగ్ బాస్ పారితోషికం
అన్నట్టుగానే ఆమె ఈ(పదో)వారం ఎలిమినేట్ అయ్యింది. మరి శ్వేత నాయుడు పారితోషికం ఎంత అనేది ఆసక్తికరంగా మారింది. ఆమెకి వారానికి రూ.1.50లక్షలు పారితోషికం నిర్ణయించారట. ఐదు వారాలు ఉండటంతో రూ.7.50లక్షలు రెమ్యూనరేషన్ రూపంలో అందుకోబోతుంది. టాక్స్ లు పోను ఏడు లక్షల వరకు ఆమెకి పారితోషికం అందుతుందని చెప్పొచ్చు. జస్ట్ ఐదు వారాలకు ఏడు లక్షలు అంటే మామూలు విషయం కాదు. సైలెంట్‌గా ఉన్నా గట్టిగానే కొట్టింది శ్వేత నాయుడు. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వారిలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు, ఇంకా ముగ్గురు రామకృష్ణ, శివకుమార్, నీతూ నటరాజ్ ఉన్నారు. వీరితోపాటు ప్రస్తుతం హౌజ్‌లో త్రిగుణ్, ముఖేష్, దేబ్జానీ, రామ్ ప్రసాద్, నరేష్, వంశీ, సుధీర్, వర్షిణి, అమన్ ఉన్నారు. వచ్చే ఐదు వారాల్లో రెండు డబుల్ ఎలిమినేషన్లకి ఛాన్స్ ఉంది.













