MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: జ్యో ప్లాన్-కార్తీక్ డౌట్-పారు అతి ప్రేమ-జ్యో చెంప పగలకొట్టిన పారు

Karthika Deepam 2 Today Episode: జ్యో ప్లాన్-కార్తీక్ డౌట్-పారు అతి ప్రేమ-జ్యో చెంప పగలకొట్టిన పారు

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఏప్రిల్ 1వ తేదీ)లో పార్టీకి రావాలని దీపకు ప్రత్యేకంగా చెప్పిన జ్యో. వసంత్‍తో కలిసి గుడికి వెళ్లాలనుకున్న స్వప్న. దీపపై అతి ప్రేమ చూపించిన పారు. జ్యో చెంప చెల్లుమనిపించిన పారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : Apr 01 2026, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో ఇంటికి పిలిచి మళ్లీ ఏం చేస్తారో అంటుంది కాంచన. అలాంటిది ఏం ఉండదులే అమ్మా.. తల్లి క్షేమంగా ఇంటికి వచ్చినందుకు జ్యోత్స్న పార్టీ ఇస్తోందని తాత చెప్పాడు అంటాడు కార్తీక్. సరేలే.. పార్టీకి పిలిచారు కదా వెళ్లడం మన బాధ్యత అంటుంది కాంచన.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
షాక్ ఇచ్చిన స్వప్న
Image Credit : Jiohotstar

షాక్ ఇచ్చిన స్వప్న

మరోవైపు కాశీ, కావేరి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో ఆడవాళ్లు లేకపోవడం వల్ల కావచ్చు... ఆడవాళ్ల మనసు అర్థం కాని భాషలా మారిపోయింది అంటాడు కాశీ. స్వప్నతో నువ్వు నాకు కావాలి అంటున్నాను. కానీ ఎందుకు కావాలో చెప్పలేకపోతున్నాను అంటాడు కాశీ. అప్పుడే స్వప్న అక్కడకు వస్తుంది. రేపు మార్నింగ్ కాస్త త్వరగా రా గుడికి వెళ్లాలి అని చెప్తుంది కాశీతో.

ఆ మాటకు అంతా సంతోషిస్తారు. కానీ వచ్చేటప్పుడు వసంత్ ని పికప్ చేసుకొని రా అని షాక్ ఇస్తుంది స్వప్న. కోపంగా స్వప్న అని అరుస్తుంది కావేరి. మీరు ఓ సంబంధం చూశారు. తన గురించి తెలుసుకోవాలి కదా అంటుంది స్వప్న. సరే మేడం వస్తాను అని చెప్తాడు కాశీ. రోజులు బాగోలేవు. ఆడపిల్లలకు రక్షణ అవసరం. వెళ్తాను అత్తయ్య అంటాడు కాశీ.

37
కార్తీక్ డౌట్
Image Credit : Jiohotstar

కార్తీక్ డౌట్

మరోవైపు దీపకు జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమంటాడు కార్తీక్. కాల్ లిఫ్ట్ చేసి ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశావ్ అంటుంది దీప. కోపం ఇంకా తగ్గినట్లు లేదు అంటుంది జ్యోత్స్న. విషయం చెప్పు అంటుంది దీప. రేపు మా ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ ఉంది. నువ్వు తప్పకుండా రావాలి అంటుంది జ్యోత్స్న. అయినా నీ ఇంటికి నువ్వు రాకుండా ఎలా ఉంటావులే అని ఫోన్ కట్ చేస్తుంది జ్యోత్స్న. నీ ఇంటికి అనే మాట అంది అంటే జ్యోత్స్నకు ఏదో తెలిసింది. రేపు పార్టీలో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తోంది అని డౌట్ పడతాడు కార్తీక్.

47
ఇదే నీకు చివరి రాత్రి
Image Credit : Jiohotstar

ఇదే నీకు చివరి రాత్రి

జ్యోత్స్న దగ్గరకు వచ్చిన పారు.. రేపు పార్టీకి దీపను పిలిచావా అని అడుగుతుంది. ఇప్పుడే కాల్ చేసి ప్రత్యేకంగా ఆహ్వానించాను అంటుంది జ్యోత్స్న. పిలిచి మంచి పని చేశావు లేకపోతే నా చేతిలో అయిపోయేదానివి అని అక్కడినుంచి వెళ్లిపోతుంది పారు. అసలు ఈ గ్రానీకి ఏమైంది.. ఎందుకిలా ప్రవర్తిస్తోంది అని అనుకుంటుంది జ్యోత్స్న. ఈ రోజు హ్యాపీగా నిద్రపో దీప.. ఇదే నీకు చివరి రాత్రి అని అంటుంది.

57
నిజం బయటపడుతుంది
Image Credit : Jiohotstar

నిజం బయటపడుతుంది

మరుసటి రోజు ఉదయాన్నే గ్రానీ నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది జ్యోత్స్న. నాకంతా టైం లేదు దీప వాళ్లు వస్తున్నారు కదా వెల్ కమ్ చెప్పడానికి వెళ్తున్నాను అంటుంది పారు. షాక్ అవుతుంది జ్యోత్స్న. ఆ తర్వాత శివన్నారాయణతో మాట్లాడుతున్న దాసు దగ్గరికి వెళ్లి దీప వస్తుందో లేదో కాల్ చేసి కనుక్కో అంటుంది. ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నావు అంటాడు శివన్నారాయణ. ఏం లేదండి అంటుంది పారు. నువ్వు చేసే ఓవర్ యాక్షన్ చూస్తుంటే నిజం బయటపడేలా ఉంది అంటాడు దాసు. నేను చూసుకుంటానులేరా అంటుంది పారు.

67
పారు ప్రవర్తన చూసి షాక్
Image Credit : Jiohotstar

పారు ప్రవర్తన చూసి షాక్

కాసేపటికి కార్తీక్ ఫ్యామిలీ శివన్నారాయణ ఇంటికి వస్తుంది. పారు హ్యాపీగా ఎదురు వెళ్లి దీప, శౌర్యలను దగ్గరకు తీసుకుంటుంది. దీప మెడ బోసిగా ఉందని తన నెక్లెస్ వేయబోతుంది. దీప వద్దు పారిజాతం గారు అంటే.. పరాయి వాళ్లలా పారిజాతం గారు ఏంటి? నానమ్మ అని పిలువు అంటుంది పారు. అంతా షాక్ అవుతారు. నేను చూసేది మిమ్మల్నేనా అత్తయ్య గారు అంటాడు శ్రీధర్. బయట ఎంతసేపు మాట్లాడుకుంటారు. ఇంట్లోకి వెళ్దాం పదండి అంటాడు శివన్నారాయణ.

77
జ్యోత్స్న చెంప చెల్లుమనిపించిన పారు
Image Credit : Jiohotstar

జ్యోత్స్న చెంప చెల్లుమనిపించిన పారు

అంతా కలిసి ఇంట్లోకి వెళ్తారు. శౌర్యను నీకు ఏం కావాలి అని అడుగుతుంది పారు. ఐస్ క్రీమ్ కావాలి. నేనే తెచ్చుకుంటాను అని శౌర్య వెళ్తుండగా జ్యోత్స్నను తగిలి కిందపడుతుంది. పారు వెంటనే శౌర్యను లేపి జ్యోత్స్నపై సీరియస్ అవుతుంది. నేను కావాలని చేయలేదు. అదే నన్ను తాకి కిందపడింది అంటుంది జ్యోత్స్న. చూసి డాష్ ఇచ్చినా, చూడకుండా డాష్ ఇచ్చినా తప్పు తప్పే అని జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది పారు. శౌర్యకు సారీ చెప్పు అంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: సూపర్ ట్విస్ట్- కాంచన డౌట్- జ్యో డీఎన్ఏ టెస్ట్- పారుతో దాసు అబద్ధం
Recommended image2
Karthika Deepam 2 Today Episode: దీపపై పారు ప్రేమ- దీపపై జ్యోత్స్న మరో కుట్ర- పారు కాపాడుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved