MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: కాశీని పాముతో పోల్చిన స్వప్న- జ్యోతో ఆడుకున్న దాసు- పారు టెన్షన్

Karthika Deepam 2 Today Episode: కాశీని పాముతో పోల్చిన స్వప్న- జ్యోతో ఆడుకున్న దాసు- పారు టెన్షన్

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఫిబ్రవరి 26వ తేదీ)లో స్వప్నను తాచు పాముతో పోల్చిన స్వప్న. ఒక్క ఛాన్స్ ఇవ్వమన్న కాశీ. జ్యోతో ఆడుకున్న దాసు. జ్యో, పారులను శివన్నారాయణ దగ్గర ఇరికించిన కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. 

3 Min read
Author : Kavitha G
Published : Feb 26 2026, 07:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో.. వెళ్లమన్నాను కదా ఇంకా ఇక్కడే ఉన్నావు ఏంటి అని కాశీతో కోపంగా అంటుంది స్వప్న. ఎందుకు మేడం అంత కోపం..  నేను ఏమన్నాను అంటాడు కాశీ. భర్తతో తాచు పాము కథ చెప్పడం మొదలు పెడుతుంది స్వప్న. ఒక తాచుపాము చావు బతుకుల్లో ఉందని ఓ వ్యక్తి కాపాడితే.. కోలుకున్నాక అతన్నే కాటేసింది. అతను చనిపోయాడు. నువ్వు కూడా ఆ పాము లాంటి వాడివే. నిన్ను మరోసారి నమ్మి తప్పుచేయలేను అంటుంది స్వప్న.

దీప అక్క కూడా కార్తీక్ బావను ఎన్నోసార్లు బాధపెట్టింది. సుమిత్ర పెద్దమ్మ, దశరథ పెద్దనాన్నతో గొడవపడి ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. కానీ వాళ్లు ఎప్పుడూ దూరం కాలేదు కదా.. తిరిగి ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు. మళ్లీ కలిసిపోయారు. నువ్వు కూడా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా అంటాడు కాశీ. నన్ను కూడా జైలుకు పంపివ్వడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నావా? నేను నిన్ను ఈ జీవితంలో క్షమించను కాశీ అంటుంది స్వప్న.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
జ్యోతో ఆడుకున్న దాసు
Image Credit : Jiohotstar

జ్యోతో ఆడుకున్న దాసు

మరోవైపు దాసును కలిసి కోపంగా మాట్లాడుతుంది జ్యోత్స్న. కూతురితో ఓ ఆట ఆడుకుంటాడు దాసు. దీప గురించి మా డాడీకి చెప్పావా అని అడుగుతుంది జ్యోత్స్న. అలా దశరథ అన్నయ్య నీతో చెప్పాడా అని అడుగుతాడు దాసు. దీప తన కూతురు అని తెలిస్తే ఎలా ప్రవర్తిస్తారో, మా డాడీ ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నాడు అంటుంది జ్యోత్స్న. వాళ్లు మనుషులు వారిలో మానవత్వం ఉంది. అందుకే అలా ఉంటారు అంటాడు దాసు.

నేను నిజంగా దశరథ కూతురినా? కాదు.. కాదు.. నీ కూతురినే, నువ్వే నా తండ్రివి అంటుంది జ్యోత్స్న. మరి డాక్టర్ ఎందుకు అబద్ధం చెప్తుంది? అని అడుగుతాడు దాసు. మా వదినను కాపాడాల్సింది నువ్వే. ఇప్పటివరకు చేసిన పాపాలు చాలు. నా అనుమానం ఏంటంటే దశరథను దీప షూట్ చేసిందని చెప్పావు కదా.. నాకు తెలిసి ఆ పని కూడా నువ్వే చేసి ఉంటావు అంటాడు దాసు. షాక్ అవుతుంది జ్యోత్స్న. ఇక అన్నీ ఆపేసి, నీ తల్లిని నువ్వు కాపాడుకో అంటాడు దాసు. అన్నీ లెక్కలు తేలుస్తాను. అంత ఈజీగా ఏది వదలిపెట్టను నా తండ్రి ఎవరో నేనే తెలుసుకుంటాను మీ ఆట కట్టిస్తాను అని చిటికెలు వేస్తూ చెబుతుంది జ్యోత్స్న. అంతలో పారిజాతం వచ్చి ఎవ్వరి మీదే చిటికెలు వేస్తున్నావు అని సీరియస్ అవుతుంది.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode:దీప‌ అనాథ కాదన్న దశరథ-షాక్ అయిన జ్యో-దశరథ ఎమోషనల్-జ్యో డౌట్ క్లియర్?
Related image2
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీప ఏడుపు- జ్యోని కూతురు కాదన్న దాసు- నిజం చెప్పిన దశరథ?
36
నా వల్లే కష్టాలు
Image Credit : Jiohotstar

నా వల్లే కష్టాలు

మరోవైపు ఏమైంది బావ, నాన్న ఏమన్నాడు అని కార్తీక్ ని అడుగుతుంది దీప. మామయ్యను కంట్రోల్ చేయడం నా వల్ల కావట్లేదు. ఎక్కడ నిజం చెప్పేస్తాడో అని భయంగా ఉంది అంటాడు కార్తీక్. నాన్నతో నేను మాట్లాడనా అని అడుగుతుంది దీప. మామయ్యను చూస్తే జ్యోత్స్నకు కచ్చితంగా అనుమానం వస్తుంది అంటాడు కార్తీక్. వస్తే ఏం చేస్తుంది అంటుంది దీప. దాసు మామయ్యతో మాట్లాడుతుంది అంటాడు కార్తీక్. 

సారీ బావ.. నా వల్లే నీకు ఇన్ని కష్టాలు. అంటుంది దీప. అత్తను కాపాడి ఆ ఇంటి వారసురాలి స్థానంలో నిన్ను నిలబెట్టాలి అదే నా లక్ష్యం అంటాడు కార్తీక్. ఆపరేషన్ అంటే మనం శాంపిల్స్ ఇచ్చినంత ఈజీ కాదు దీప. అందులోను మన బిడ్డకు ఏమైనా అయితే ఆ బాధ నుంచి తేరుకోవడం అంత సులువు కాదు. డాక్టర్ ఛాన్స్ లేదని చెప్పింది కానీ, బిడ్డపై ఆశలు వదులుకోలేదు అని ఎమోషనల్ అవుతాడు కార్తీక్.

46
నువ్వు సుమిత్ర కూతురివే
Image Credit : Jiohotstar

నువ్వు సుమిత్ర కూతురివే

మేము ఇక్కడ ఉన్నట్లు నీకెలా తెలిసింది గ్రానీ అంటుంది జ్యోత్స్న. నేనే రమ్మన్నాను అంటాడు దాసు. నీకు భయం లేదు అన్నావు కదా.. మరి గ్రానీని ఎందుకు రమ్మన్నావు అంటుంది జ్యోత్స్న. మా అమ్మను కాపాడుకోవడానికి అని చెప్తాడు దాసు. నువ్వు నన్ను పదే పదే కలవడం చూస్తే శివన్నారాయణకు అనుమానం వస్తుంది. అప్పుడు నీ మీద నిగా పెడతాడు. పిల్లల్ని మార్చిన విషయం బయటపడుతుంది. 

మా అమ్మ ఫోటోకు దండ పడుతుంది అంటాడు దాసు. ఒరేయ్ నువ్వు అలా మాట్లాడుకురా అని నాకు భయమేస్తుంది అంటుంది పారిజాతం. జ్యోత్స్న పదే పదే నన్ను కలిస్తే జరిగేది అదే అంటాడు దాసు. నువ్వు నా అసలైన మనుమరాలిని వెతుకురా అంటుంది పారు. నేను నీ మనుమరాలిని అంటుంది జ్యోత్స్న. కాదు నువ్వు సుమిత్ర కూతురివి అని అరిచి చెబుతుంది పారు.

56
పారు, జ్యో మెడిటేషన్
Image Credit : Jiohotstar

పారు, జ్యో మెడిటేషన్

మరుసటి రోజు ఉదయం జ్యోత్స్న, పారు మెడిటేషన్ చేస్తుంటారు. నా గురించి నిజం ఎవరికి చెప్పొద్దు అంటుంది పారు. నువ్వు ఏం టెన్షన్ పడకు. మనం మళ్లీ ఫ్రెండ్స్ లా ఉందాం అంటుంది జ్యోత్స్న. ఏంటి పారు ఇంత పొద్దునే మెడిటేషన్ చేస్తున్నావ్ అంటాడు కార్తీక్. మనశ్శాంతి కోసం అంటుంది పారు. నువ్వు మనశ్శాంతి కోల్పోయే అంతా ఇప్పుడు ఏం జరిగిందో అంటాడు కార్తీక్. కొన్ని చెప్పుకోలేము, దాచుకోలేము, ఒప్పుకోలేము అంటుంది పారు.

66
పారును ఇరికించిన కార్తీక్
Image Credit : Jiohotstar

పారును ఇరికించిన కార్తీక్

అంతలో శివన్నారాయణ అక్కడికి వస్తాడు. ఏంటి అని అడిగితే పారుకు మనశ్శాంతి కరువైందట తాత. ఎందుకో మనం కచ్చితంగా తెలుసుకోవాలి అని పారును ఇరికిస్తాడు కార్తీక్. ఎందుకు నీకు అంత ఒత్తిడి.. దాసు మామయ్య కిడ్నాప్ గురించా? అంటాడు కార్తీక్. కిడ్నాప్ ఏంట్రా అంటాడు శివన్నారాయణ. టెన్షన్ పడుతుంది పారు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:దీప‌ అనాథ కాదన్న దశరథ-షాక్ అయిన జ్యో-దశరథ ఎమోషనల్-జ్యో డౌట్ క్లియర్?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీప ఏడుపు- జ్యోని కూతురు కాదన్న దాసు- నిజం చెప్పిన దశరథ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved