- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ మనసు ముక్కలు చేసిన కాంచన- అమ్మానాన్నలను కార్తీక్ కలుపుతాడా?
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ మనసు ముక్కలు చేసిన కాంచన- అమ్మానాన్నలను కార్తీక్ కలుపుతాడా?
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (డిసెంబర్ 25వ తేదీ)లో ఆయనకు నాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అని కాంచనతో అన్న కావేరి. శ్రీధర్ కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్లిన కాంచన. అన్నం పెట్టి మరీ శ్రీధర్ మనసు ముక్కలు చేసిన కాంచన. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో ఏడుస్తూ ఉంటుంది స్వప్న. కార్తీక్ కి మరోసారి ఫోన్ చేసి అక్కడి పరిస్థితి ఎలా ఉందో కనుక్కో అంటుంది కావేరి. బెయిల్ రాలేదు అని చెప్పాడు కదా మమ్మీ. ఇంతలోనే ఏం మారిపోతుంది. పెద్దమ్మ కూడా మనలాగే బాధపడుతూ ఉంటుంది. ఓసారి ఫోన్ చేసి మాట్లాడు అంటుంది స్వప్న .
కాంచనకు ఫోన్ చేసి అక్కా.. జరిగిన విషయం మీకు తెలిసే ఉంటుంది. నాకు చాలా భయంగా ఉంది అంటుంది కావేరి. స్వప్న వాళ్ల నాన్న తప్పు చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా? అని అడుగుతుంది కాంచన. లేదక్కా.. కానీ ఆయన సీఈఓ అయిన దగ్గరి నుంచి ఆ ఇంట్లో వాళ్లు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. ఆయన ఎదుగుదలను సహించలేని వాళ్లే ఇలా చేసి ఉంటారని అంటుంది కావేరి.
కాంచనకు సారీ చెప్పిన కావేరి
ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండు అంటుంది కాంచన. మాటల సందర్భంలో ఆయనకు నాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు అంటుంది కావేరి. మనిషి స్వభావమే అంతా.. దగ్గర లేని దానిగురించే ఆలోచిస్తూ ఉంటాడు అంటుంది కాంచన. అయితే నువ్వు కూడా ఆయన గురించి ఆలోచిస్తావా అక్క? అంటుంది కావేరి. భార్యా భర్తల బంధం తెంపేసుకున్నా.. అమ్మానాన్నల బంధం ఉంది కదా.. ఆలోచించక తప్పదు అంటుంది కాంచన.
సారీ అక్క.. నా మాటలను తప్పుగా తీసుకోకు అంటుంది కావేరి. పర్లేదు.. నువ్వు ధైర్యంగా ఉండు. మన నమ్మకమే ఆయనను బయటకు తీసుకువస్తుంది అని ఫోన్ కట్ చేస్తుంది కాంచన. పెద్దమ్మతో అలాగేనా మమ్మీ మాట్లాడేది అంటుంది స్వప్న. మళ్లీ చేసి సారీ చెప్పనా అంటుంది కావేరి. వద్దులే.. నాన్న గురించి పెద్దమ్మ, అన్నయ్య చూసుకుంటారు ఇక వదిలెయ్ అంటుంది స్వప్న.
కార్తీక్ తో నిజం చెప్పిన దశరథ
మరోవైపు సుమిత్రకు ఏమైందని దీప, కార్తీక్ లు దశరథను అడుగుతుంటారు. సుమిత్రకు ఏం కాలేదు. డాక్టర్ చాలా పాజిటివ్ గా చెప్పాడు. మీరేం టెన్షన్ పడకండి. రెండు రోజుల్లో రిపోర్ట్స్ వస్తాయన్నారు అని చెప్తాడు దశరథ. నువ్వు ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకోకు. సుమిత్రకు ఏం కావాలో చూడు అని దీపను అక్కడి నుంచి పంపిస్తాడు దశరథ.
ఇప్పుడు చెప్పు మామయ్య.. అత్తకు ఏమైంది అని అడుగుతాడు కార్తీక్. నీ దగ్గర నేను ఏం దాచలేనురా.. అని డాక్టర్ చెప్పిన అసలు విషయాన్ని కార్తీక్ తో చెప్తాడు దశరథ. అత్తకు ఏం కాదని మామయ్యకు ధైర్యం చెప్తాడు కార్తీక్. వారి మాటలను దీప వింటుంది. అమ్మకు ఏం కాదు కదా అని ఏడుస్తుంది. ఏం కాదు.. ముందు ఇంటికి వెళ్దాం పదా.. అక్కడ పరిస్థితి ఎలా ఉందో అంటాడు కార్తీక్.
తాత దగ్గరికి నేను తీసుకెళ్తాను
మరోవైపు కావేరి మాటలను గుర్తుచేసుకుంటూ ఉంటుంది కాంచన. శౌర్య వచ్చి ఏమైంది నాన్నమ్మ అదోలా ఉన్నావు అని అడుగుతుంది. తాత పోలీస్ స్టేషన్లో ఉన్నాడని చెప్తుంది కాంచన. తాతకు ఏమైంది. ఎందుకు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. నేను నిన్ను తాత దగ్గరకు తీసుకెళ్తాను అంటుంది. మీ నాన్న వచ్చాక తీసుకెళ్లమంటాలే అంటుంది కాంచన.
పోలీస్ స్టేషన్ కి నువ్వెందుకు?
ఇంతలో కార్తీక్, దీప వస్తారు. నాన్నమ్మ మీ కోసమే ఎదురుచూస్తోంది. తాత పోలీస్ స్టేషన్ లో ఉన్నాడంట కదా... నానమ్మ తాత దగ్గరకు వెళ్లాలి అనుకుంటోంది తీసుకువెళ్లు నాన్న అంటుంది శౌర్య. పోలీస్ స్టేషన్ కి నువ్వెందుకు అమ్మా? ఇష్టం లేని మనిషి కోసం ఇవన్నీ ఎందుకు అంటాడు కార్తీక్. నువ్వు వస్తావా.. నన్ను వెళ్లమంటావా.. అంటుంది కాంచన. సరే ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్తాడు కార్తీక్.
కాంచన నన్ను క్షమించింది
నీకోసం ఎవరూ ఏది తెచ్చేలా లేరు. కనీసం మంచి నీళ్లైనా తాగండి గురువు గారు అంటాడు శ్రీధర్ పక్కన ఉన్న వ్యక్తి. వద్దూ.. తేవాలనే మనసు ఎవరికి ఉంటుందో వాళ్లు వస్తారులే అంటాడు శ్రీధర్. ఇంతలో కార్తీక్, కాంచన బాక్స్ తీసుకొని వస్తారు. ఆ పరిస్థితిలో ఆయన్ని చూడాలా వద్దా అనుకుంటూనే లోపలికి వస్తుంది కాంచన. కార్తీక్ ని చూసి నువ్వు ఎందుకు వచ్చావురా అంటాడు శ్రీధర్. అమ్మ కూడా వచ్చింది అని పక్కకు జరుగుతాడు కార్తీక్. కాంచనను చూసి చాలా సంతోషపడతాడు శ్రీధర్. కాంచన నన్ను క్షమించి.. భర్తగా అంగీకరించిందని మనసులో అనుకుంటాడు.
శ్రీధర్ కి అన్నం పెట్టిన కాంచన
నాన్నకు నువ్వు వడ్డించమ్మ.. లాయర్ కు కాల్ చేయాలని కావాలనే బయటకు వెళ్తాడు కార్తీక్. శ్రీధర్ కు వండిస్తుంది కాంచన. నువ్వు వస్తావని అనుకోలేదు అంటాడు శ్రీధర్. కావేరి వస్తుందని అనుకున్నారా? అంటుంది కాంచన. సైలెంట్ అవుతాడు శ్రీధర్. ఆ తర్వాత నన్నెందుకు అరెస్టు చేశారో నీకు తెలుసా? నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా? అని అడుగుతాడు. నువ్వు తప్పు చేశావని నమ్మితే ఇక్కడి వరకు వచ్చేదాన్నా అంటుంది కాంచన.
శ్రీధర్ మనసు ముక్కలు చేసిన కాంచన
ఇప్పటివరకు నీ గురించే ఆలోచిస్తున్నా. నిన్ను చూశాక నా బాధ మొత్తం పోయింది. మన బంధం మనం ఉన్నంత కాలం ఉంటుంది కాంచన అంటాడు శ్రీధర్. నువ్వు నన్ను భర్తగా అంగీకరించావు అది చాలు నాకు అంటాడు. మిమ్మల్ని భర్తగా అంగీకరించానని ఎవరు చెప్పారు? నేను కార్తీక్ తల్లిగా మాత్రమే వచ్చాను అంటుంది కాంచన.
ఆ మాటకు శ్రీధర్ మనసు ముక్కలవుతుంది. ఒక్క మాటతో తినే అన్నాన్ని కూడా విషంలా మార్చేశావు కాంచన అని కన్నీళ్లు పెట్టుకుంటాడు శ్రీధర్. వారిని చాటుగా గమనిస్తున్న కార్తీక్ లోపలికి వచ్చి తండ్రికి అన్నం తినిపిస్తాడు. అన్నం గొంతు దిగడం లేదురా... అన్నం మెతుకులు కూడా ముళ్లలా గుచ్చుకుంటున్నాయని శ్రీధర్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇంతదాక వచ్చాక దాచేది ఏం లేదు. మీరు మామాలుగా మాట్లాడుకుంటే చూడాలి అనుకున్నాను అంటాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

