- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Latest Episode:ప్రూఫ్స్ మాయం చేసిన కాశీ-జైల్లోనే శ్రీధర్-కార్తీక్‌కి షాకిచ్చిన తాత
Karthika Deepam 2 Latest Episode:ప్రూఫ్స్ మాయం చేసిన కాశీ-జైల్లోనే శ్రీధర్-కార్తీక్‌కి షాకిచ్చిన తాత
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (డిసెంబర్ 23వ తేదీ)లో ఆట మొదలుపెట్టిన జ్యో. శ్రీధర్ కలెక్ట్ చేసిన ప్రూఫ్స్ ని మాయం చేసిన కాశీ. దిక్కుతోచని స్థితిలో పడ్డ కార్తీక్. దీప, కార్తీక్ లపై మరోసారి రెచ్చిపోయిన పారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో కంగారుగా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి వైరాకు కాల్ చేస్తాడు కాశీ. మీరు చిన్న వార్నింగ్ లాంటిదే అన్నారు. కానీ ఇక్కడ ఆయనకు బేల్ కూడా రిజెక్ట్ చేశారు. అసలు ఏం జరుగుతోంది. నేను అనవసరంగా ఇలా చేశాను అంటాడు. ఎందుకు నువ్వు అంతా టెన్షన్ పడుతున్నావు. అన్నీ నేను చూసుకుంటాను. అయినా ఎవరికో బేల్ రాకపోతే నీకెంటి ఇబ్బంది అన్నట్లు మాట్లాడుతాడు వైరా.
ఆయన మా మామగారు. కార్తీక్ నా బావ అంటాడు కాశీ. మీ మామగారు అయ్యుండి కూడా నిన్ను పీఏగా పెట్టుకున్నారంటే.. నువ్వు కచ్చితంగా అతనిపై రివేంజ్ తీసుకోవాల్సిందే. నీకు ఏం తెలియనట్లు సైలెంట్ గా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు బయటపడితే.. నాతోపాటు నువ్వు కూడా ఇబ్బంది పడతావనే విషయం మర్చిపోకు. త్వరగా వచ్చి నా కంపెనీలో జాయిన్ అవ్వు అని చెప్తాడు వైరా.
ఓకే చెప్తాడు కాశీ. ఇంతలో కార్తీక్ వెనుక నుంచి వచ్చి కాశీపై చేయి వేస్తాడు. భయపడిపోతాడు కాశీ. సైలెంట్ గా ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ లో ఎవరూ అని అడుగుతాడు కార్తీక్. తెలిసినవాళ్లు అని కవర్ చేస్తాడు కాశీ.
పీఏ పోస్టుకు రిజైన్ చేసిన కాశీ
నువ్వు ఏం చేశావో నీకు అర్థమవుతోందా? మా నాన్న ఎప్పుడో మాట్లాడిన మాటలను రికార్డ్ చేసి, ఎడిట్ చేసి పోలీసులకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని అడుగుతాడు కార్తీక్. నా ఫోన్ లో ఆటోమేటిక్ రికార్డర్ ఆన్ లో ఉంది అంటాడు కాశీ. నువ్వు ఇప్పుడు మాట్లాడిన కాల్ వినిపించు అంటాడు కార్తీక్. కంగారు పడి.. ఆ యాప్ తీసేశాను అంటాడు కాశీ. అనుమానంగా చూస్తాడు కార్తీక్.
మా నాన్న నిన్ను పక్కన పెట్టుకొని నన్ను నీలో చూసుకున్నాడు. ఆయన నీ ఎదుగుదల గురించి ఎంతో తాపత్రయపడ్డాడు అంటాడు కార్తీక్. శ్రీధర్ ఆలోచించాల్సిన అంత స్థాయి వీడికి లేదు అంటాడు శివన్నారాయణ. అందుకే రిజైన్ చేస్తున్నాను అని లెటర్ కార్తీక్ చేతిలో పెట్టబోతాడు కాశీ. దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆఫీస్ కు వెళ్లి ఇవ్వు అనగానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు కాశీ.
ఎక్కడో తప్పు జరిగింది
కాశీ ప్రవర్తనలో నీకు ఏమైనా తేడా కనిపిస్తోందా తాత అంటాడు కార్తీక్. ఇంతలో కాంచన ఫోన్ చేస్తుంది. ఏంట్రా ఇదంతా అని ఏడుస్తూ ఉంటుంది. మా నాన్న తప్పు చేశాడు అంటే నేను నమ్మను. నువ్వు నమ్ముతావా అమ్మ? నాన్న కల్తీ ఫుడ్ పెట్టేంత దుర్మార్గుడా అని అడుగుతాడు కార్తీక్. కాదురా.. ఆయన ఈ పని చేసి ఉండడు అంటుంది కాంచన. ఎక్కడో తప్పు జరిగింది. నిరూపించడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటివరకు మనం వెయిట్ చేయాలి అని చెప్పి ఫోన్ కట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు శివన్నారాయణ, కార్తీక్.
ప్రూఫ్స్ మాయం చేసిన కాశీ
మరోవైపు ఆఫీసుకు వెళ్లి జ్యోత్స్న తప్పు చేసిందని నిరూపించే సాక్ష్యాలను కలెక్ట్ చేస్తూ ఉంటాడు కాశీ. ఇంతలో జ్యోత్స్న కాశీకి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు అని అడుగుతుంది. ఆఫీసుకు వచ్చాను. జాబ్ రిజైన్ చేశాను అంటాడు కాశీ. మంచి పని చేశావు. వెళ్లి వైరా దగ్గర జాయిన్ అవ్వు. నేను నీకోసం చేయగలిగిన సహాయం చేశాను అంటుంది జ్యోత్స్న. చాలా పెద్ద హెల్ప్ చేశావు అక్క అంటాడు కాశీ. అందుకే నీకోసం నేను కూడా ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నాను అంటాడు.
సంతోషంలో జ్యోత్స్న
ఏం చేయబోతున్నావు అంటుంది జ్యోత్స్న. నువ్వు తప్పు చేశావని నిరూపించే ఫైల్స్ అన్నీ ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి. జాబ్ లో జాయిన్ అయ్యాక చిన్న ట్రీట్ ఇచ్చి.. ఇవి నీకు ఇస్తాను అంటాడు కాశీ. సంతోషంగా ఓకే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది జ్యోత్స్న. ఇప్పుడు చెప్పు బావ... ఎవరు తెలివైన వారో.. నీ చెల్లి మొగుడ్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని ఎలా ఆడిస్తానో చూడు. ఇప్పుడు టైం నాది అని అనుకుంటుంది జ్యోత్స్న.
కుప్పకూలిన దీప
కార్తీక్ కోసం బయట నిలబడి వెయిట్ చేస్తూ ఉంటుంది దీప. కారులో నుంచి శివన్నారాయణ, కార్తీక్ దిగగానే.. మామయ్య గారు రాలేదా? ఏమైంది అని కంగారు పడుతూ కార్తీక్ ని అడుగుతుంది. బెయిల్ రాలేదని చెప్పడంతో అక్కడే కుప్పకూలుతుంది. ఈ విషయం అత్తయ్య గారికి తెలుసా అంటుంది దీప. అందరికీ తెలుసు అంటాడు కార్తీక్.
కాశీ మామయ్య కోసం బాధపడుతున్నాడేమో అంటుంది దీప. కాశీనే బలమైన సాక్ష్యం చెప్పాడని మనసులో అనుకుంటాడు కార్తీక్. మా అమ్మకు ఇలా అయింది. మీ నాన్నకు అలా అయింది. అసలు ఎందుకు ఇలా జరుగుతోందని బాధపడుతుంది దీప. నువ్వు టెన్షన్ పడకు అన్నీ సర్దుకుంటాయి. తల పగిలిపోయేలా ఉంది. స్ట్రాంగ్ కాఫీ పెట్టి ఇవ్వు అని దీపను లోపలికి తీసుకెళ్తాడు కార్తీక్.
కార్తీక్ కి షాక్ ఇచ్చిన తాత
కాశీ మాటలను గుర్తుచేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు శివన్నారాయణ. ఇంతలో ఆఫీసు నుంచి ఒక వ్యక్తి వచ్చి.. మన రెస్టారెంట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఫుడ్ క్వాలిటీగా లేదని కన్ఫర్మ్ చేసి రెస్టారెంట్స్ ని క్లోజ్ చేశారు అని చెప్తాడు. షాక్ అవుతారు అంతా. గోవిందా గోవిందా అని స్టార్ట్ చేస్తుంది పారు. దీప, కార్తీక్ లపై మరోసారి విరుచుకుపడుతుంది.
మా నాన్న తప్పు చేయలేదని అందరినీ నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నమ్మాల్సిన వాళ్లు నమ్మారు అది నాకు చాలు అంటాడు కార్తీక్. మామయ్య తప్పు చేయలేదని తాత నమ్ముతున్నాడని అనుకుంటున్నావా బావ అంటుంది జ్యోత్స్న. ఏం తాత నువ్వు నమ్ముతున్నావా? అని అడుగుతుంది. శివన్నారాయణ లేదు అంటాడు. కార్తీక్ షాక్ అవుతాడు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

