- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ అరెస్ట్ విషయంలో జ్యోపై అనుమానం- కార్తీక్ నిజం కనిపెడతాడా?
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ అరెస్ట్ విషయంలో జ్యోపై అనుమానం- కార్తీక్ నిజం కనిపెడతాడా?
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (డిసెంబర్ 24వ తేదీ)లో తప్పు చేసింది ఇంటి దొంగో, బయటి దొంగో కనిపెట్టాలన్న శివన్నారాయణ. కాశీని ఇంట్లో నుంచి పోరా అన్న కావేరి. శ్రీధర్ విషయంలో రెచ్చిపోయిన జ్యో. కౌంటర్ ఇచ్చిన కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో మామయ్య తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావా తాత అని అడుగుతుంది జ్యోత్స్న. లేదు అంటాడు శివన్నారాయణ. షాక్ అవుతారు దీప, కార్తీక్. చూశావా బావ.. తాత మీ నాన్నను నమ్మట్లేదు అంటుంది జ్యోత్స్న. నేను శ్రీధర్ నే కాదు.. ఎవ్వరినీ పూర్తిగా నమ్మలేకపోతున్నాను. పూర్తిగా అనుమానించలేకపోతున్నాను అంటాడు శివన్నారాయణ.
నువ్వేనా తాత ఇలా మాట్లాడేది అంటాడు కార్తీక్. అవును నేనేరా. శ్రీధర్ తన అల్లుడి మీద నమ్మకంతో తనకి జాబ్ ఇచ్చాడు. ఇప్పుడు తనే మా మామయ్య తప్పు చేశాడని సాక్ష్యం చెప్పాడు. అంటే ఎవరిని నమ్మాలి అంటాడు శివన్నారాయణ. కాశీ సాక్ష్యం చెప్పాడా.. అని షాక్ అవుతుంది దీప. వాడు సాక్ష్యం చెప్పాడంటే జ్యోత్స్నే ఏదో ఒకటి చేసి ఉంటుంది అని మనసులో అనుకుంటుంది పారిజాతం. తప్పు ఎవ్వరు చేసినా శిక్ష మాత్రం దారుణంగా ఉంటుంది. దీని వెనుక ఎవ్వరు ఉన్నా సరే కనిపెట్టాలి అంటాడు శివన్నారాయణ.
కాశీని పోరా అన్న కావేరి
మరోవైపు ఇంటికి వెళ్లిన కాశీని.. బయటికి పోరా అంటుంది కావేరి. నా భర్త మీదే సాక్ష్యం చెప్పి.. మా ఇంటికే వస్తావా అని తన ఆవేదన వెల్లగక్కుతుంది. నేను జరిగిందే అక్కడ చెప్పాను. నేను ఏ తప్పు చేయలేదు అంటాడు కాశీ. మా నాన్న గురించి నీకు తెలియదా? మా నాన్న తప్పు చేశాడని నువ్వు ఎలా చెప్పగలిగావు అని నిలదీస్తుంది స్వప్న. మా నాన్న నీ గురించి ఆలోచించి.. నీకు జాబ్ ఇస్తే నువ్వు ఇలా చేస్తావా అంటుంది.
అందుకే మా నాన్న అరెస్ట్ అయ్యేలా చేశావా?
అర్హత లేకున్నా శ్రీధర్ మామయ్యకు శివన్నారాయణ గారు సీఈఓ పోస్టు ఇచ్చారు. కానీ అన్నీ అర్హతలున్నా నాకు మీ నాన్న పీఏ పోస్టు ఇచ్చాడు అని అక్కసు వెళ్లగక్కుతాడు కాశీ. అందుకే ఇలా చేశావా అంటుంది స్వప్న. నేను ఏ తప్పు చేయలేదు. ఇప్పుడు నేను ఇంట్లో ఉండాలా? వెళ్లిపోవాలా.. అని అడుగుతాడు కాశీ. నువ్వు ఇక్కడే ఉండాలి. మా నాన్న ఏ తప్పు చేయలేదని తెలిశాక.. సారీ చెప్పడానికైనా నువ్వు ఇక్కడే ఉండాలి అంటుంది స్వప్న. అది జరగదులే అని మనసులో అనుకుంటాడు కాశీ.
దీప సుమిత్ర అత్త కూతురు
మరోవైపు సుమిత్ర, దశరథల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది దీప. జ్యోత్స్నను అమ్మ, నాన్నలకు ఫోన్ చేశావా? ఎలా ఉన్నారట? ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది దీప. నా పేరెంట్స్ గురించి నీకు ఎందుకు అంతా తాపత్రయం. వాళ్లకు ఏమైతే నీకేంటి? పనిమనిషివి పనిమనిషిలా ఉండూ అంటుంది జ్యోత్స్న.
దీప సుమిత్ర అత్త కూతురు అంటాడు కార్తీక్. షాక్ అవుతుంది జ్యోత్స్న. ఆ రోజు మామయ్య చెప్పాడు కదా.. దీపను కూతురే అనుకొని సారె తెచ్చామని.. ఇంకా నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అన్నట్లు మాట్లాడుతాడు కార్తీక్. నువ్వు రా దీప అర్హత లేని వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు కార్తీక్. నేను వారసురాలిని కాదు అని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడా అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
హాస్పిటల్లో అడ్మిట్ కావాలి..
మరోవైపు సుమిత్ర, దశరథలు టెస్టులు చేయించుకొని రిజల్ట్స్ కోసం హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ వారిని పిలిచి.. సుమిత్రను అడ్మిట్ కావాలి అని చెప్తాడు. నాకు ఏం కాలేదు. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను అని బయటకు వెళ్తుంది సుమిత్ర.
ఇప్పుడు చెప్పండి తనకు ఏమైంది అని అడుగుతాడు దశరథ. నేను సుమిత్ర గారి బ్లడ్ షాంపిల్స్ ఒక స్పెషలిస్ట్ కి ఇచ్చాను. ఆయన చాలా పెద్ద డాక్టర్. 2, 3 రోజుల్లో ఆయనే నేరుగా ఇక్కడికి వస్తాడు. మీరు ఆయనతో మాట్లాడొచ్చు. అవసరమైతే కాల్ చేయండి. సమస్య మాత్రం పెద్దదే. ఫేస్ చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి అని చెప్తాడు డాక్టర్.
సుమిత్ర అంటే మాకు ప్రేమ లేదా?
సుమిత్ర, దశరథ ఇంటికి వస్తారు. వారిని చూసి ఇప్పుడు నేను బాగా ప్రేమ నటించాలి అనుకుంటుంది జ్యోత్స్న. ఈలోపే అమ్మ మీకు ఏమైంది.. డాక్టర్ ఏం చెప్పారు అని కంగారు పడుతూ అడుగుతుంది దీప. జ్యోత్స్నకు ఒళ్లు మండుతుంది. దీపను తక్కువ చేసి మాట్లాడుతుంది. ఇక్కడ అర్హత ఉన్నవాళ్లకు ప్రేమ ఉండదు. ప్రేమ ఉన్నవాళ్లకు అర్హత ఉండదు అంటాడు కార్తీక్. అంటే సుమిత్ర అంటే మాకు ప్రేమ లేదా అంటుంది పారు. ఉందిలే అని వెటకారంగా అంటాడు కార్తీక్.
బావ తప్పు చేయడు నాన్న..
నాన్న మీరు నాకు చాలాసార్లు ఫోన్ చేశారు. ఏం జరిగింది అని అడుగుతాడు దశరథ. అల్లుడు మోసం చేశాడని ఎలా చెప్తాడులే అంటుంది పారు. జరిగిన విషయం తెలిసి బావ తప్పు చేయడు అంటాడు దశరథ. క్లాప్స్ కొట్టి మీకు హ్యాట్సాప్ డాడీ. అదే నా గురించి ఎవరైనా ఇలా చెప్తే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నమ్మేవారు కదా... మీ బావపై మీకున్న నమ్మకానికి దండం పెట్టాలి అంటుంది జ్యోత్స్న. అర్హత లేని వ్యక్తిని సీఈఓ చేసి.. ఆయన మోసం చేశాక కూడా మీరు నమ్ముతున్నారా అంటుంది.
కార్తీక్ కౌంటర్
అవును.. అర్హత లేని వ్యక్తే కంపెనీని అప్పుల పాలు చేసింది. అర్హత లేని వ్యక్తే షేర్ హోల్డర్స్ ని పారిపోయేలా చేసింది అని జ్యోత్స్నను ఉద్దేశించి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడు కార్తీక్. ఇప్పుడు ఉన్న సీఈఓ సమర్థుడే. ఆయన ఏ తప్పు చేయలేదని నిరూపించిన రోజు.. ఈ నోర్లు ఎలా లేస్తాయో నేనూ చూస్తాను అంటాడు కార్తీక్. మామయ్య గారి అరెస్ట్ విషయంలో జ్యోత్స్న ఏదో కుట్ర చేసే ఉంటుంది. అందుకే ఇంతలా ఎగురుతుందని మనసులో అనుకుంటుంది దీప. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

