MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: జ్యోకు హ్యాండ్ ఇచ్చిన వైరా-కార్తీక్‍ని గన్‍తో షూట్-డబ్బుతో ఎస్కేప్

Karthika Deepam 2 Today Episode: జ్యోకు హ్యాండ్ ఇచ్చిన వైరా-కార్తీక్‍ని గన్‍తో షూట్-డబ్బుతో ఎస్కేప్

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఏప్రిల్ 23వ తేదీ)లో జ్యోకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వైరా. డబ్బు మొత్తం తీసుకొని పారిపోయేందుకు ప్లాన్. అడ్డుకున్న పారు, కార్తీక్. గన్ తో కార్తీక్ ని షూట్ చేసిన వైరా. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...  

3 Min read
Author : Kavitha G
Published : Apr 23 2026, 08:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో డబ్బుతో ఉన్న కారును పోలీసులతో కలిసి దాసు, దశరథ ఫాలో అవుతుంటారు. వారి వెనకాలే కార్తీక్, పారు కూడా వెళ్తుంటారు. కొద్దిదూరం వెళ్లాక కారు ఒక చోట ఆగి ఉంటుంది. పోలీసులు వెళ్లి చూస్తే కార్లో డబ్బులు ఉండవు, మనుషులు ఉండరు. చూశారా.. మీరు అనవసరంగా నన్ను ఫాలో అయ్యారు. ఇప్పుడు చూడు వాడు డబ్బులు తీసుకొని పారిపోయాడు అంటాడు దశరథ. 

మీ పని మీరు చేశారు. ఇప్పుడు మా పని మేము చేస్తాము. మీరు ఇంటికి వెళ్లండి అని చెప్తారు పోలీసులు. ఇలా జరిగింది ఏంటి మనుమడా.. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతుంది పారు. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది పదా అని పారును తీసుకొని వెళ్తాడు కార్తీక్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
భ్రమపడిన సుమిత్ర
Image Credit : Jiohotstar

భ్రమపడిన సుమిత్ర

మరోవైపు సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది. దీప దగ్గరికెళ్లి, అమ్మా మీరు ఇలా ఏం తినకుండా, ట్యాబ్లెట్ వేసుకోకుండా ఉంటే ఎలా అని అడుగుతుంది. దీపను చూసి జ్యోత్స్న అనుకొని భ్రమ పడుతుంది సుమిత్ర. అమ్మా జ్యోత్స్న వచ్చావా అని దీపను దగ్గరకు తీసుకుంటుంది. మామయ్య గారు జ్యోత్స్న వచ్చింది అని శివన్నారాయణను పిలుస్తుంది. దీపను చూసిన శివన్నారాయణ ఏం మాట్లాడుతున్నావమ్మా.. తను జ్యోత్స్న కాదు దీప అంటాడు.

కోపంగా పక్కకు జరిగి, నా మనసు నా కూతురి కోసం ఎంత ఆరాటపడుతుందో చూశారా అని బాధపడుతుంది సుమిత్ర. ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే మీ ఆరోగ్యం ఏమవుతుందని అడుగుతుంది దీప. నాకు ఏమైతే నీకేంటి, నేను ప్రశాంతంగా ఉండాలంటే ముందు నువ్వు నాకు దూరంగా ఉండమని కోపంగా చెప్తుంది సుమిత్ర. నీ కూతురు వస్తే మాట్లాడ్డానికైనా నీ దగ్గర ఓపిక ఉండాలి కదా.. కనీసం వాటర్ అయినా తాగు అని సుమిత్రకు వాటర్ ఇస్తాడు శివన్నారాయణ.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: వీడని కిడ్నాప్ డ్రామా-దీపపై సుమిత్ర కోపం-పోలీసులతో దాసు- అంతా షాక్
Related image2
Karthika Deepam 2 Today Episode: కొనసాగిన కిడ్నాప్ డ్రామా- జ్యోపై వైరా డౌట్- దాసును నిలదీసిన పారు
37
జ్యోకు షాకిచ్చిన వైరా
Image Credit : Jiohotstar

జ్యోకు షాకిచ్చిన వైరా

మరోవైపు డబ్బుల బ్యాగ్ తీసుకొని వైరా దగ్గరకు వస్తాడు ఒక వ్యక్తి. వాళ్లను బురిడి కొట్టించి బ్యాగ్ తీసుకొని ఎస్కేప్ అయ్యాను అని వైరాతో చెప్తాడు. బ్యాగ్ ఓపెన్ చేసి డబ్బులను చూసి అంతా సంతోషపడతారు. చూశావా.. మా మమ్మీకి నేనంటే ఎంత ఇష్టమో.. మనం అనుకున్న డబ్బులు వచ్చాయి. నాకు రావాల్సిన వాటా వేరే బ్యాగులో పెట్టి, నన్ను మెయిన్ రోడ్ దగ్గర వదిలెయ్. ఇంటికి ఎలా వెళ్లాలో నాకు తెలుసు అంటుంది జ్యోత్స్న.

ఆ మాటకు అంతా నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారని కోపంగా అడుగుతుంది జ్యోత్స్న. సారీ జ్యోత్స్న.. నేను నిన్ను మోసం చేశాను అంటాడు వైరా. నీ వాటా కూడా నేను తీసుకుంటున్నానే కాబట్టి, నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను అని అంటాడు. షాక్ అవుతుంది జ్యోత్స్న. నిన్ను వదిలిపెట్టను. నీ అంతు చూస్తాను అంటూ బెదిరిస్తుంది. ముందు మనం ఇక్కడినుంచి సేఫ్ గా వెళ్లిపోవాలి అందరూ మాస్క్ లు వేసుకోండని తన బ్యాచ్ తో చెప్తాడు వైరా.

47
కార్తీక్ ని షూట్ చేసిన వైరా
Image Credit : Jiohotstar

కార్తీక్ ని షూట్ చేసిన వైరా

అప్పుడే పారు, కార్తీక్ ఎంట్రీ ఇస్తారు. ఇద్దరూ కలిసి రౌడీలను చితక్కొడతారు. వైరా మాస్క్ తీసి షాక్ అవుతాడు కార్తీక్. నీకు ఇంకా బుద్ధి రాలేదా అని బాగా కొడతాడు. ఎలాగైనా డబ్బులు తీసుకొని పారిపోవాలి అనుకొని బ్యాగ్ దగ్గరకు వెళ్తాడు వైరా. కర్రతో వైరా తలపై కొడుతుంది జ్యోత్స్న. నిన్ను చంపిన తప్పులేదురా అంటుంది జ్యోత్స్న. అయితే ఆ పని నేనే చేస్తాను అని గన్ తీసి షూట్ చేస్తాడు వైరా. కార్తీక్ అడ్డుగా వెళ్తాడు. బావ అని జ్యోత్న్స, కార్తీక్ అని పారు గట్టిగా అరుస్తారు. వైరా బ్యాగ్ తీసుకొని ఎస్కేప్ అవుతాడు.

57
సుమిత్ర కోపం
Image Credit : Jiohotstar

సుమిత్ర కోపం

మరోవైపు జ్యోత్స్సను తీసుకురాలేదని దశరథతో గొడవపడుతుంది సుమిత్ర. నేనే ముందే చెప్పాను.. వాడు అడిగిన డబ్బులు వాడికిచ్చి, నా కూతురిని తీసుకురమ్మని.. మీరు వినలేదు. ఇప్పుడు నేనే వెళ్లి, నా కూతురిని తీసుకొస్తాను అని చెప్పి వెళ్లబోతుంది సుమిత్ర. అప్పుడే జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది. 

67
సుమిత్ర ఎమోషనల్
Image Credit : Jiohotstar

సుమిత్ర ఎమోషనల్

నీకు ఏం కాలేదు కదా అని జ్యోత్స్నను హత్తుకొని ముద్దు పెట్టుకుంటుంది సుమిత్ర. చేతులకు రక్తం చూసి ఏమైంది అని అడుగుతుంది. బావను గన్ తో షూట్ చేశారని జ్యో చెప్పడంతో, షాక్ అవుతుంది దీప. నా బావ ఎక్కడున్నాడు.. అని కంగారు పడుతుంది. బాగానే ఉన్నాను అంటూ చేతికి కట్టుతో లోపలికి వస్తాడు కార్తీక్. వెనకాలే పోలీసులు కూడా వస్తారు. ఏం జరిగిందని అడిగితే, వైరా గన్ తో కాల్చిన విషయాన్ని చెప్తారు.

77
శివన్నారాయణ సీరియస్
Image Credit : Jiohotstar

శివన్నారాయణ సీరియస్

నీకు ప్రాణాలంటే విలువ లేదా అని కార్తీక్ పై సీరియస్ అవుతాడు శివన్నారాయణ. కార్తీక్ రాక పోయి ఉంటే మీ మనుమరాలి ప్రాణాలు పోయేవి. అయితే వీళ్లు రావడం వల్ల కిడ్నాపర్ తప్పించుకున్నాడని చెప్తారు పోలీసులు. అయినా వాడేవడో డబ్బులకు ఆశపడి కిడ్నాప్ చేస్తే, నువ్వు ఎందుకురా ఇంత రిస్క్ చేశావు అని అంటాడు దశరథ. వాడు డబ్బుల కోసం చేయలేదు మామయ్య.. పగతో చేశాడు అని చెప్తాడు కార్తీక్. అంతా షాక్ అవుతారు. కిడ్నాప్ చేసింది వైరా అని చెప్పగానే శివన్నారాయణ ఆవేశంగా గన్ తీసుకొని వస్తాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: వీడని కిడ్నాప్ డ్రామా-దీపపై సుమిత్ర కోపం-పోలీసులతో దాసు- అంతా షాక్
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కొనసాగిన కిడ్నాప్ డ్రామా- జ్యోపై వైరా డౌట్- దాసును నిలదీసిన పారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved