MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: కొనసాగిన కిడ్నాప్ డ్రామా- జ్యోపై వైరా డౌట్- దాసును నిలదీసిన పారు

Karthika Deepam 2 Today Episode: కొనసాగిన కిడ్నాప్ డ్రామా- జ్యోపై వైరా డౌట్- దాసును నిలదీసిన పారు

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఏప్రిల్ 22వ తేదీ)లో కొనసాగిన కిడ్నాప్ డ్రామా. కూతురి కోసం ఏడ్చిన దాసు. నిలదీసిన పారు. మరోసారి దీపపై కోపం చూపించిన సుమిత్ర. డబ్బులతో బయల్దేరిన దశరథ. ఫాలో అయిన దాసు, కార్తీక్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : Apr 22 2026, 08:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో కార్తీక్, దశరథ, దాసు బయట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. జ్యోత్స్న కోసం దాసు కంగారు పడతారు. ఇప్పటివరకు జ్యోత్స్న డబ్బుల కోసం డ్రామా ఆడుతోందని అనుకున్నాను. కానీ కిడ్నాపర్ నీ కూతురి మీద ఆశలు వదిలేసుకోమని చెప్పినప్పటి నుంచి నిజంగానే నా కూతురు చనిపోతుందేమోనని భయంగా ఉందని ఏడుస్తాడు దాసు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
శివన్నారాయణ డౌట్
Image Credit : Jiohotstar

శివన్నారాయణ డౌట్

తను నీకు మాత్రమే కూతురు కాదు. నాకు కూడా కూతురే. ఈ భుజాలపై తనని ఎత్తుకొని పెంచాను. నాకు ప్రేమ లేదు అనుకున్నావా.. జ్యోత్స్న కోసం 30 కోట్లు కాదు.. నా ఆస్తి మొత్తం రాసివ్వమన్నా రాసిస్తాను అంటాడు దశరథ. నా కూతురిని ఎలాగైనా కాపాడు అన్నయ్య అంటాడు దాసు. 

ఇంతలో శివన్నారాయణ వచ్చి నీ కూతురు ఏంటి అని అడుగుతాడు. కార్తీక్ కవర్ చేస్తాడు. దశరథ, నువ్వు కార్తీక్.. సుమిత్ర దగ్గరికి వెళ్లి ఏదో ఒకటి చెప్పి తనకు భోజనం తినిపించండి అని చెప్తాడు. అలాగే పారిజాతాన్ని పిలిచి దాసుకు భోజనం పెట్టమని చెప్తాడు. అన్నీ సర్దుకుంటాయి నువ్వు బాధపడకు అని దాసుతో చెప్పి లోపలికి వెళ్లిపోతాడు.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: వీడని కిడ్నాప్ డ్రామా-దీపపై సుమిత్ర కోపం-పోలీసులతో దాసు- అంతా షాక్
Related image2
Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యో- కిడ్నాప్ ప్లాన్‍తో రూ. 30 కోట్లు డిమాండ్
38
దాసును నిలదీసిన పారు
Image Credit : Jiohotstar

దాసును నిలదీసిన పారు

దాసు బాధపడటం చూసిన పారు.. నిజం చెప్పు జ్యోత్స్నే నీ కూతురు కదా అని అడుగుతుంది. నాకు అబద్ధం చెప్పావు కదా అని నిలదీస్తుంది. నువ్వు ఇంతలా బాధపడుతున్నావంటే అదే నీ కూతురు అంటుంది పారు. అన్నయ్య, వదినా బాధపడుతుంటే ఇది నా సమస్య కాదు అని నేను ఎలా అనుకోగలను అమ్మా.. నీకు మాత్రం బాధ లేదా అంటాడు దాసు. సుమిత్రను చూస్తుంటే నాకు బాధగానే ఉంది అంటుంది పారు.

48
దీపపై సుమిత్ర కోపం
Image Credit : Jiohotstar

దీపపై సుమిత్ర కోపం

మరోవైపు ఉదయాన్నే శివన్నారాయణ ఇంటికి పోలీసులు వస్తారు. నిన్నటి నుంచి కిడ్నాపర్ మళ్లీ ఫోన్ చేయలేదు. జ్యోత్స్న గురించి ఏం తెలియలేదు అంటాడు దశరథ. వాడు అడిగిన డబ్బు ఇచ్చి నా కూతురిని తీసుకురండి అని ఏడుస్తుంది సుమిత్ర. అప్పుడే డబ్బు బ్యాగుతో వస్తాడు శ్రీధర్. మీ ప్రయత్నం మీరు చేయండి, మా ప్రయత్నం మేము చేస్తాము అంటారు పోలీసులు. మీరు ఏం చేయొద్దు. దయచేసి ఇందులో మీరు ఇన్వాల్వ్ కావద్దు. వాడు నా కూతురిని చంపేస్తాడు అని ఏడుస్తూ కిందపడబోతుంది సుమిత్ర. పట్టుకుంటుంది దీప. కోపంగా దీప చేయిని తీసేసి పక్కకు వెళ్లమంటుంది సుమిత్ర.

జ్యోత్స్నకు ఏం కాదు. నువ్వు ప్రశాంతంగా ఉండు అత్త అంటాడు కార్తీక్. నిన్నటి నుంచి నువ్వే అదే చెప్తున్నావు. అయినా జ్యోత్స్నను తీసుకొచ్చే బాధ్యత నాది అన్నావ్? కదా.. ఎక్కడ్రా నా కూతురు? తీసుకురా అని గట్టిగట్టిగా అరుస్తుంది సుమిత్ర.

58
వైరా డౌట్
Image Credit : Jiohotstar

వైరా డౌట్

మరోవైపు హ్యాపీగా టిఫిన్ చేస్తూ ఉంటుంది జ్యోత్స్న. టైం వేస్ట్ చేయకుండా మా డాడీకి ఫోన్ చేసి డబ్బులు అడుగు అని వైరాతో చెప్తుంది. అసలు నువ్వు దశరథ కూతురివేనా అని అడుగుతాడు వైరా. నా డౌట్ కూడా అదే అంటాడు వైరా అసిస్టెంట్. షాక్ అయిన జ్యోత్స్న..  మీరు ఇలాగే డౌట్ లు అడుక్కుంటూ ఉండండి. వాళ్లు వచ్చి అందర్నీ పట్టుకుంటారు అంటుంది. ఎవరిని ఎవరు కిడ్నాప్ చేశారో అర్థం కాకుండా ఉంది అంటాడు వైరా.

68
డబ్బుతో బయల్దేరిన దశరథ
Image Credit : Jiohotstar

డబ్బుతో బయల్దేరిన దశరథ

ఆ తర్వాత దశరథకు కాల్ చేసి డబ్బు రెడీనా అని అడుగుతాడు. నా కూతురు ఎలా ఉంది? తను క్షేమంగానే ఉందని నమ్మకం ఏంటని అడుగుతాడు దశరథ. పక్కన పోలీసులను పెట్టుకొని ఆడిన డ్రామాలు చాలు. ముందు డబ్బు తీసుకుని బయల్దేరు, ఎక్కడికి రావాలో చెప్తానని కాల్ కట్ చేస్తాడు వైరా. దశరథ డబ్బులు తీసుకొని బయల్దేరుతాడు. కార్తీక్ వస్తానన్న వద్దు అంటాడు. దశరథ కారును పోలీసులతో కలిసి ఫాలో అవుతాడు దాసు. వాళ్ల వెనకాలే కార్తీక్, పారు కూడా బయల్దేరుతారు.

78
నా వాటా ఎలా ఇస్తావు?
Image Credit : Jiohotstar

నా వాటా ఎలా ఇస్తావు?

మరోవైపు వైరాతో సీరియస్ గా మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్న. నేను మా డాడీతో వెళ్లిపోతే నా వాటా డబ్బులు ఎలా తీసుకోవాలి. అసలు ఆయన్ని ఎక్కడికి రమ్మన్నావు.. ప్లాన్ ఫేయిల్ చేయవు కదా అంటుంది జ్యోత్స్న. నువ్వు నన్ను మోసం చేయకుంటే చాలు అంటాడు వైరా. ఒక బ్యాగు తెప్పించి, నా వాటా డబ్బులు అందులో పెట్టివ్వు అంటుంది జ్యోత్స్న. అన్నీ ప్లాన్ చేశాను. నువ్వు కాస్త కామ్ గా ఉండమంటాడు వైరా.

88
దశరథకు వైరా కాల్
Image Credit : Jiohotstar

దశరథకు వైరా కాల్

స్కూటీపై కూర్చొని బిస్కెట్లు తింటూ కార్తీక్ కి తినిపించబోతుంది పారు. ఏంటి పారు ఇది మనం ఉన్న సిట్యూయేషన్ ఏంటి? నువ్వు చేస్తున్న పనేంటీ అంటాడు కార్తీక్. జ్యోత్స్న గురించి మనకెందుకు? నువ్వు దీప మొగుడివి. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది అంటుంది పారు.

మరోవైపు దశరథకు కాల్ చేసి కారు ఆపమని చెప్తాడు వైరా. కారు దిగి దూరంగా వెళ్లిపోమంటాడు. ఆ తర్వాత వేరేవాళ్లు కారు తీసుకొని వెళ్లిపోతారు. వెనకాలే పోలీసులతో వచ్చిన దాసు.. ఏమైంది అన్నయ్య అని అడిగితే జరిగింది చెప్తాడు దశరథ. వెంటనే ఆ కారు ఎక్కి ముందు కారును ఫాలో అవుతారు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Mukesh Gowda: రిషిగా బుల్లితెరని ఊపేశాడు, ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌ షేక్‌.. ముఖేష్‌ గౌడ గ్రాండ్‌ ఎంట్రీ
Recommended image2
Bigg Boss 10 Varshini: ఆ ఘటనతో పెళ్లికి దూరం, క్యాస్టింగ్‌ కౌచ్ కామెంట్‌తో దుమారం.. వర్షిణి గ్రాండ్‌ ఎంట్రీ
Recommended image3
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌తో లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: వీడని కిడ్నాప్ డ్రామా-దీపపై సుమిత్ర కోపం-పోలీసులతో దాసు- అంతా షాక్
Recommended image2
Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యో- కిడ్నాప్ ప్లాన్‍తో రూ. 30 కోట్లు డిమాండ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved